సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గురువారం సినీనటుడు ప్రకాష్‌రాజ్ కలిశారు. కేసీఆర్‌తో కలిసి అసెంబ్లీకి వచ్చిన ప్రకాష్‌రాజ్ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. జాతీయస్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టి.. దేశంలో గుణాత్మక మార్పుల కోసం ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రావాలంటున్న సీఎం కేసీఆర్ ఇటీవలే కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు.
ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ కేసీఆర్‌తో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చ జరిపినట్టు తెలుస్తోంది. కాగా, నిన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిసి రాజకీయ పరిణామాలు, ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణానికి అనుసరించాల్సిన వ్యూహం వంటి వాటిపై చర్చించారు. కాగా, తాను మోదీ వ్యతిరేకనని ఇప్పటికే ప్రకటించిన ప్రకాష్‌రాజ్, కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment