'ఎన్ని ఆటంకాలు వచ్చినా కోటి ఎకరాలకు నీరిస్తా'
హైదరాబాద్: దుమ్ముగూడెం టెయిల్ పాండ్ దుర్మార్గమైన ప్రాజెక్టు అని చెప్పారు. కృష్ణా, గోదావరిపై మహారాష్ట్ర, కర్ణాటక 450 ప్రాజెక్టులు నిర్మించాయని అన్నారు. గురువారం తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్, ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ గోదావరి నుంచి ఈ ఏడాది చుక్క నీరు తెలంగాణ ప్రాజెక్టులకు రాలేదని పేర్కొన్నారు.
అనేక విషయాలపై అధ్యయనం చేశాక ప్రాజెక్టుల రీడిజైన్ పై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రాజెక్టులు కట్టాలనుకుంటుంటే కొంతమంది కోర్టుకు వెళ్లి అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా కోటి ఎకరాలకు నీరిచ్చి తీరుతాం అని కేసీఆర్ రైతులకు భరోసా ఇచ్చారు. బీడు భూములకు నీరు ఇచ్చి హరిత తెలంగాణగా మారుస్తామని చెప్పారు. ఒక్క పెన్ గంగపైనే మహారాష్ట్ర 40 ప్రాజెక్టులు కట్టిందని తెలిపారు.