స్వార్థం కోసమే మహారాష్ట్రతో ఒప్పందం
► ఎర్రవెల్లి కోసమే ప్రాజెక్టులు
► ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి
► వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి
మంకమ్మతోట : వ్యక్తిగత స్వార్థప్రయోజనాల కోసమే మహారాష్ర్ట ప్రభుత్వంతో సీఎం కేసీఆర్ నీటిప్రాజెక్టుల ఒప్పందం కుదుర్చుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. నగరంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కేసీఆర్ ఏదో ఘనకార్యం సాధించినట్లు సంబరాలు జరుపుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు కాకముందే దివంగత నే త వైఎస్.రాజశేఖరరెడ్డి2007లోనే తెలంగాణ భూములను సస్యశ్యామలం చేయడానికి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 7జిల్లాల్లోని 16లక్షల 40వేల ఎకరాలకు సాగునీరు, 30 టీఎంసీల తాగునీరు, 16టీఎంసీ నీరుఇండస్ట్రియల్‌కు అందించేందుకు రూపకల్పన చేశారన్నారు.
ఈ ప్రాజెక్టును పూర్తి చేయకుండా రీడిజైన్ పేరుతో నిర్లక్ష్యం చేస్తు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. అన్నిఅనుమతులతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉందని, జాతీయ హోదా కల్పించి దీన్ని పూర్తి చేస్తే తెలంగాణలోని ప్రతి ఎకరాకు నీరు అందేదని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ప్రాజెక్టులను మార్పులు చేసిన దాఖలాలు లేవన్నారు. ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌కు నీరు తీసుకుపోవడానికి రీడిజైన్ పేరుతో కాల యాపన చేస్తూ మహారాష్ర్ట ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారన్నారు. కుటుంబంతప్ప ప్రజల సంక్షేమం పట్టని కేసీఆర్ ఎల్లంపల్లి పూర్తి అయినా ఇంతవరకు చుక్క నీ రుఇవ్వలేదన్నారు.
రీడిజైన్‌తో మహా రాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రాజెక్టు ద్వారా ఎన్ని టీఎం సీల నీరు అందిస్తారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డి మాండ్ చేశారు. బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు బండమీది అంజయ్య, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దేవరనేని వేణుమాధవ్‌రావు, ప్రచా రకమిటీ జిల్లా అధ్యక్షుడు కంది వెంకటరమణారెడ్డి,నాయకులు దుబ్బాక సంప త్, యాదగిరి, రహీం పాల్గొన్నారు.