సీఎంపై హరీష్ పిటిషన్ను డివిజన్ బెంచ్కు బదిలీ
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు దాఖలు చేసిన పిటీషన్‌ను రాష్ట్ర హైకోర్టు శుక్రవారం డివిజన్ బెంచ్కు బదిలీ చేసింది. చిత్తూరు జిల్లాకు సాగునీటి పథకం పేరిట మూడు వందల కోట్లు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హరీష్ రావు న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హరీష్‌రావు పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.... పిటిషన్లో ప్రజా ప్రయోజనాలున్నాయని ఉన్నాయని అభిప్రాయపడింది.
ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరుకు తాగునీటి పథకం కోసం రూ.4,300 కోట్లు కేటాయించడం చట్ట విరుద్ధమని హరీష్ రావు మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో ప్రభుత్వం, సిఎంతో పాటు మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, గ్రామీణ నీటి సరఫరా విభాగాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
సుమారు రూ.7390 కోట్ల అంచనా వ్యయంతో చిత్తూరు జిల్లా త్రాగునీటి సరఫరా పథకం అమలుకు జారీ చేసిన జిఓలకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. విభజన ప్రక్రియ కొనసాగుతుండగా రాష్ట్ర మంత్రివర్గం ప్రాంతాల వారీగా చీలిపోయిన నేపథ్యంలో శాసనసభ నుంచి గానీ, రాష్ట్ర మంత్రివర్గం నుంచి గానీ ఆమోదం పొందకుండా నిధులు విడుదల చేసే అధికారం ముఖ్యమంత్రికి లేదని పిటిషనర్ వాదించారు. ఈ పిటిషన్పై వచ్చే సోమవారం పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశం ఉంది.