పీవీకి ఆప్తుడు.. కేంద్ర మాజీ మంత్రి కరోనాతో కన్నుమూత | Former Union Minister Matang Sinh Died With Covid Complicantions | Sakshi
Sakshi News home page

పీవీకి ఆప్తుడు.. కేంద్ర మాజీ మంత్రి కరోనాతో కన్నుమూత

May 6 2021 6:04 PM | Updated on May 6 2021 9:13 PM

Former Union Minister Matang Sinh Died With Covid Complicantions - Sakshi

కరోనా దెబ్బకు సామాన్యులతో పాటు ప్రముఖులు బలవుతున్నారు. తాజాగా ఒకే రోజు ఇద్దరు ప్రముఖులు కరోనాతో మృతి చెందారు. 

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కదనోత్సహంతో దరిమిలా వ్యాప్తిస్తుండగా సామాన్యుడితో పాటు ప్రముఖులు కూడా మృత్యువాత పడుతున్నారు. గురువారం ఉదయం ఆర్జేడీ అధినేత అజిత్‌సింగ్‌ కరోనాతో మృతి చెందగా సాయంత్రం కేంద్ర మాజీ మంత్రి మాతాంగ్‌ సిన్హ్‌ కరోనాతో కన్నుమూశారు. మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహారావుకు మాతాంగ్‌ సిన్హ్‌ అత్యంత ఆప్తుడు.

అస్సాంకు చెందిన మాతాంగ్‌ సిన్హ్‌ 1992లో రాజ్యసభకు ఎన్నికయ్యాడు. పీవీ నరసింహారావు హయాంలో 1994 నుంచి 98 వరకు కేంద్ర సహాయ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో పీవీకి దగ్గరయ్యారు. మాజీ రాజ్యసభ సభ్యుడు మాతాంగ్‌ సిన్హ్‌ పీవీ నరసింహారావుకు ఆప్తుడు. ఏప్రిల్‌ 22వ తేదీన కరోనా బారినపడ్డాడు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు.

సిన్హ్‌ను అస్సాంలో గుర్తుపట్టని వారంటూ ఎవరూ ఉండరు. సిన్హ్‌ మొదట బొగ్గు వ్యాపారం మొదలుపెట్టారు. ఆ తర్వాత అస్సాంలో తొలిసారిగా 2013లో శాటిలైట్‌ ద్వారా టీవీ ఛానెల్‌ (నార్త్‌ఈస్ట్‌ విజన్‌-ఎన్‌ఈటీవీ)ను 2003లో ప్రారంభించాడు. సిన్హ్‌ను శారద చిట్‌ఫండ్‌ కుంభకోణంలో పాత్ర ఉందని ఆరోపిస్తూ సీబీఐ 2015 జనవరిలో అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.
 

చదవండి: కరోనాపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు
చదవండి: కొత్తగా పెళ్లయిన కమెడియన్‌ జంటకు షాకిచ్చిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement