సాక్షి, హైదరాబాద్ : దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఘనంగా నివాళి అర్పించారు. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం పీవీ జ్ఞానభూమి వద్ద ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పీవీ కుటుంబసభ్యులు, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ రావు, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏడాదిపాటు నర్సింహారావు శత జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. (చదవండి : పీవీ.. అపర మేధావి)
గాంధీభవన్ లో
దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు శతజయంతి సందర్భంగా గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్యెల్యే శ్రీధర్ బాబు, కార్య నిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నా రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, టీపీసీసీ ఉపాధ్యక్షులు కుమార్ రావ్, ప్రధాన కార్యదర్శులు మహేష్ కుమార్ గౌడ్, బొల్లు కిషన్, ప్రేమ లాల్, నగేష్, అజ్మ షాకేర్, నిరంజన్, అధికార ప్రతినిధులు జి.నిరంజన్, సుజాత, సంధ్య, శ్రీరంగం సత్యం తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఆర్థికంగా దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి గాడిలో పెట్టిన ఘనత పీవీది అని కొనియాడారు. ల్యాండ్ సీలింగ్ తెచ్చి ఎంతో మంది పేదలకు సాయం చేసిశారని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీవీని చూసి రాజనీతిజ్ఞత నేర్చుకోవాలన్నారు. ఏడాది పాటు వేడుకలు చేస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment