birth anniversery celebrations
-
అమెరికా అంతటా వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు
వాషింగ్టన్: దివంగత మాజీ ఏపీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా అమెరికాలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ (యుఎస్ఎ) వేడుక కార్యక్రమాలను నిర్వహించనుంది. డాక్టర్ వైయస్ఆర్ అభిమానుల సహాయంతో అమెరికాలోని వివిధ నగరాలు కాలిఫోర్నియా, కనెక్టికట్, డెలావేర్, ఫ్లోరిడా, జార్జియా,ఇల్లినాయిస్, మేరీల్యాండ్, మిన్నెసోటా, మిస్సౌరీ, న్యూజెర్సీ, నార్త్ కరోలినా, ఒహియో, పెన్సిల్వేనియా, టెక్సాస్, వర్జీనియా, వాషింగ్టన్ లో వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలను నిర్వహించనుంది. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ జయంతి ఉత్సవాలను జరుపనున్నారు. అమెరికాలో వైఎస్ఆర్ అనుచరులు జూలై 8 గురువారం వైఎస్ఆర్ జయంతిని జరుపుకోనున్నారు. జూలై 10, జూలై 11న ముఖ్యమైన కార్యక్రమాలు జరగుతాయని ఫౌండేషన్ నిర్వహకులు తెలిపారు.ఈ సేవ కార్యక్రమాల్లో వైఎస్ఆర్ అనుచరులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వహకులు పేర్కొన్నారు. వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు జరిగే నగరాలు సీటెల్ (వాషింగ్టన్) జూలై 9, 2021 (శుక్రవారం), లాస్ ఏంజిల్స్ (కాలిఫోర్నియా),కనెక్టికట్, డెలావేర్, వర్జీనియా, డల్లాస్ (టెక్సాస్) జూలై 10, 2021 (శనివారం) శాన్ జోస్ (కాలిఫోర్నియా), అట్లాంటా (జార్జియా), చికాగో (ఇల్లినాయిస్), మేరీల్యాండ్, మిన్నియాపాలిస్ (మిన్నెసోటా), సెయింట్ లూయిస్ (మిస్సౌరీ), న్యూజెర్సీ, షార్లెట్ (నార్త్ కరోలినా), రాలీ (నార్త్ కరోలినా), కొలంబస్ (ఒహియో), ఆస్టిన్ (టెక్సాస్), హ్యూస్టన్ (టెక్సాస్) జూలై 11(ఆదివారం) గతంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ (యుఎస్ఎ) పలు కార్యక్రమాలను చేపట్టింది. కరోనా మహమ్మారి సమయంలో కోవిడ్ రిలీఫ్ ఈవెంట్లను ఏర్పాటు చేసింది. ఆక్సిజన్ కాన్సన్‌టేటర్లు, మెడికల్ కిట్లు, కూరగాయలు, మాస్క్‌లు, శానిటైజర్లను పంపిణీ చేసింది. అంతేకాకుండా కరోనా మృతదేహాల దహన సంస్కారాలకు సహాయం చేయడం, కోవిడ్ రోగులకు ఆహారాన్ని పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి సమయంలో నిధుల కొరతతో బాధపడుతున్న అనాథాశ్రమాలకు సహాయం చేసింది. డాక్టర్ ప్రేమ్ రెడ్డి సహాకారంతో ఫౌండేషన్ ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 100కు పైగా ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లను, ఆరోగ్య శిబిరాలను ఏర్పాటుచేసింది. డాక్టర్ ప్రేమ్ రెడ్డి డాలర్ టూ డాలర్ కార్యక్రమాన్ని ఎంతగానో విజయవంతమైంది. ఫౌండేషన్‌కు విరాళాలు అందించిన వారికి కృతజ్ఙతలు తెలిపారు. -
తిరుపతిలో వైఎస్సార్ జయంతి వేడుకలు
-
పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు
-
పీవీ శతజయంతి: స్పెషల్ ఫోటోలు
-
పీవీ నరసింహారావుకు సీఎం కేసీఆర్ నివాళి
సాక్షి, హైదరాబాద్ : దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఘనంగా నివాళి అర్పించారు. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం పీవీ జ్ఞానభూమి వద్ద ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పీవీ కుటుంబసభ్యులు, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ రావు, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏడాదిపాటు నర్సింహారావు శత జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. (చదవండి : పీవీ.. అపర మేధావి) గాంధీభవన్ లో దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు శతజయంతి సందర్భంగా గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్యెల్యే శ్రీధర్ బాబు, కార్య నిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నా రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, టీపీసీసీ ఉపాధ్యక్షులు కుమార్ రావ్, ప్రధాన కార్యదర్శులు మహేష్ కుమార్ గౌడ్, బొల్లు కిషన్, ప్రేమ లాల్, నగేష్, అజ్మ షాకేర్, నిరంజన్, అధికార ప్రతినిధులు జి.నిరంజన్, సుజాత, సంధ్య, శ్రీరంగం సత్యం తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఆర్థికంగా దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి గాడిలో పెట్టిన ఘనత పీవీది అని కొనియాడారు. ల్యాండ్ సీలింగ్ తెచ్చి ఎంతో మంది పేదలకు సాయం చేసిశారని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీవీని చూసి రాజనీతిజ్ఞత నేర్చుకోవాలన్నారు. ఏడాది పాటు వేడుకలు చేస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. -
తిరుమలలో ఘనంగా వెంగమాంబ జయంతి
సాక్షి, తిరుమల:తరిగొండ వెంగమాంబ 285వ జయంతి ఉత్సవాలను శనివారం తిరుమలలో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు బృందావనంలోని సమాధి వద్ద జేఈవో పోలా భాస్కర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం లలితాంబికా పీఠాధిపతి సంపర్ణానంద స్వామి అనుగ్రహణ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రాజెక్టుల డెప్యూటీ ఈవో శారద, ప్రత్యేకాధికారి కెజే కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.