తిరుమలలో ఘనంగా వెంగమాంబ జయంతి | vengamamamba birth anniversery celebrations in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో ఘనంగా వెంగమాంబ జయంతి

Published Sat, May 2 2015 11:03 PM | Last Updated on Sun, Sep 3 2017 1:18 AM

vengamamamba birth anniversery celebrations in tirumala

సాక్షి, తిరుమల:తరిగొండ వెంగమాంబ 285వ జయంతి ఉత్సవాలను శనివారం తిరుమలలో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు బృందావనంలోని సమాధి వద్ద జేఈవో పోలా భాస్కర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని ఊరేగింపుగా తీసుకెళ్లారు.

 

అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం లలితాంబికా పీఠాధిపతి సంపర్ణానంద స్వామి అనుగ్రహణ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రాజెక్టుల డెప్యూటీ ఈవో శారద, ప్రత్యేకాధికారి కెజే కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement