![PM Modi Remembers PV Narasimha Rao On His Birth Anniversary - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/28/narasimha-rao-l.jpg.webp?itok=WF1DH6TO)
సాక్షి, న్యూఢిల్లీ : దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 98వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నివాళులు అర్పించారు. పాలనా వ్యవహారాల్లో దిగ్గజ నేతగా పేరొందిన పీవీ దేశాన్ని సంక్లిష్ట పరిస్ధితుల్లో దీటుగా ముందుకు నడిపారని కొనియాడారు. ఆయన చేపట్టిన చర్యలు దేశ పురోగతికి బాటలువేశాయని మోదీ ట్వీట్ చేశారు.
దేశ తొమ్మిదో ప్రధానిగా 1991 జూన్‌లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ 1996 మే వరకూ అధికారంలో కొనసాగారు. దేశ అభివృద్ధికి అవరోధంగా నిలిచిన లైసెన్స్ రాజ్‌ను తొలగించడంతో పాటు సంస్కరణలు ప్రవేశపెట్టి ఆర్థిక వ్యవస్ధను కొత్తపుంతలు తొక్కించిన ఘనత పీవీ నరసింహరావుకు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment