
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవితం తెరపైకి రానుంది. గతంలో శ్రీహరి హీరోగా ‘శ్రీశైలం’ చిత్రాన్ని నిర్మించిన తాడివాక రమేశ్ నాయుడు ఎన్టీఆర్ ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రముఖ సీనియర్ దర్శకుడు ధవళ సత్యం ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సోమవారం పీవీ జయంతి సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు.
దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘జాతీయ స్థాయిలో సుపరిచితుడైన ఓ ప్రముఖ నటుడితో పీవీ నరసింహారావుగారి పాత్రను ధరింపజేస్తున్నాం. తెలుగు–హిందీ భాషలతోపాటు మరికొన్ని ముఖ్య భారతీయ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తాం. అతి త్వరలో సెట్స్‌కు వెళ్లనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 28న పీవీ జయంతి నాటికి విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment