
భీమదేవరపల్లి: మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు స్వగ్రామమైన వరంగల్ అర్బన్ జిల్లా వంగరలోని ఆయన స్వగృహం మ్యూజియంగా మారనుంది. పీవీ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయన స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో పీవీ ఉపయోగించిన 150 వస్తువులు ప్రదర్శనకు ఉంచుతారు. వచ్చే నెల 13, 14, 15 తేదీల్లో నూతన గృహప్రవేశంతో పాటు మ్యూజియాన్ని గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ చేత ప్రారంభించేందుకు కుటుంబీకులు ప్రయత్నిస్తున్నారు.