సచివాలయంలో సీఎం కేసీఆర్‌, గవర్నర్‌.. చాలా రోజులకు ఒకే వేదికపై.. | Spiritual Atmosphere In Telangana Secretariat Live Updates | Sakshi
Sakshi News home page

సచివాలయంలో సీఎం కేసీఆర్‌, గవర్నర్‌.. చాలా రోజులకు ఒకే వేదికపై..

Published Fri, Aug 25 2023 10:23 AM | Last Updated on Fri, Aug 25 2023 2:04 PM

Spiritual Atmosphere In Telangana Secretariat Live Updates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కొత్త సచివాలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.హైదరాబాద్‌: రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో గుడి, చర్చి, మసీదులను గవర్నర్‌ తమిళిసైతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ప్రారంభించారు. నల్లపోచమ్మ ఆలయ పూర్ణాహుతి కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై‌, సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చర్చి ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. అనంతరం మసీదును ప్రారంభించి నమాజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

గవర్నర్‌ తమిళిసైను సీఎం కేసీఆర్‌ కొత్త సచివాలయంలోకి తీసుకెళ్లారు. ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌ను చూపించారు.

.సచివాలంలోని సర్వమత ప్రార్థనల్లో సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై సీఎం, గవర్నర్‌ కలిసి కనిపించారు

సచివాలయంలో నల్లపోచమ్మ ఆలయం, మసీదు, చర్చిల ప్రారంభోత్సవం జరిగింది. ఈ క్యాక్రమంలో సీఎ కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసైసౌందరరాజన్‌ ప్రారంభించారు. అనంతరం సచివాలయాన్ని గవర్నర్‌ తమిళిసై పరిశీలించనున్నారు

శివాలయం, పోచమ్మగుడి, హనుమాన్‌, గణపతి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. 

► మందిరాల ప్రారంభోత్సవం సందర్భంగా యాగం నిర్వహించారు. 

► గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సీఎం కేసీఆర్‌ నేడు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 

 మత పెద్దల సమక్షంలో మసీదు, చర్చిలను కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. 

షెడ్యూల్‌ ఇదే..

► మధ్యాహ్నం 12: 35 గంటలకు కేసీఆర్‌ సచివాలయం చేరుకోనున్నారు. 

► 12: 40 గంటలకు చర్చి రిబ్బన్ కటింగ్. 

► 12: 45 గంటలకు చర్చిలో కేక్ కటింగ్. 

12: 55 గంటలకు చర్చిలో ముగింపు ప్రేయర్

► మధ్యాహ్నం 1- 1.30 గంటల వరకు మసీదును ప్రారంభించి మత పెద్దల ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొననున్నారు కేసీఆర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement