secratariat
-
AP: సచివాలయ ఉద్యోగులపై పోలీసుల దుశ్చర్య!
సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కఓ సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉద్యోగుల డిన్నర్ సమావేశంపై పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు. వారిని ఇబ్బందులకు గురిచేశారు.రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు. ఉద్యోగుల డిన్నర్ సమావేశంపై పోలీసులు దాడులు చేశారు. డిన్నర్ చేస్తున్న సమయంలో 50 మంది వరకు పోలీసులు.. ఉద్యోగులను చుట్టుముట్టారు. ప్లాన్ ప్రకారం డిన్నర్ పార్టీపై ఏడు పోలీసు స్టేషన్ల సిబ్బంది దాడులు చేయడం గమనార్హం. అంతటితో ఆగకుండా అక్కడ మద్యం బాటిళ్లు ఉన్నాయని ఉద్యోగులపై పోలీసులు కేసులు పెట్టారు.అనంతరం, ఉద్యోగులను పోలీసులు పోలీసు స్టేషన్‌కు తరలించారు. గురువారం అర్ధరాత్రి వరకు వారిని పీఎస్ లోనే ఉంచారు. దాదాపు మూడు గంటల పాటు సచివాలయ ఉద్యోగులను స్టేషన్ లోపలే బంధించారు. 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులను వేధిస్తున్నారని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉద్యోగులను వేధించకుండా తనపై కేసు పెట్టాలని వెంకట్రామిరెడ్డి తెలిపారు. -
ప్రజలు కోరుకునే విధంగా తెల్లంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. విగ్రహ ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఇక, డిసెంబర్ తొమ్మిదో తేదీన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరుగనుంది. 👉ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దసరా వరకు మళ్లీ మంచి రోజులు లేనందున ఈరోజే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పండుగ రోజు. 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారు. కరీంనగర్లో ఇచ్చిన హామీని సోనియా సఫలం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను జేఎన్టీయూ ఫైనాన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ చేత నిర్మిస్తున్నాం. తెలంగాణ కోరుకుంటున్న విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది. డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహం స్థాపన ఉంటుంది.గత పాలకులే తెలంగాణ ఇచ్చినట్టు పాలించారు. పాత విధానాలకు మా ప్రభుత్వం విరుద్ధం. పదేళ్లుగా సీఎంగా ఉన్న వాళ్లు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు. మిలియన్ మార్చ్ తరహాలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కార్యక్రమం జరుగుతుంది. పదేళ్లు అధికారంలో ఉన్న వారు తెలంగాణ తల్లిని మరుగున పడేశారు. విగ్రహానికి అయ్యే కోటి రూపాయలను కూడా కేటాయించలేదు. ఇక్కడ ఎందరివో విగ్రహాలు ఉన్నాయి. దేశం కోసం ప్రాణం అర్పించిన రాజీవ్ గాంధీ విగ్రహం లేకపోవడం లోటే. రాజీవ్ విగ్రహ ఏర్పాటును కూడా వివాదం చేశారు. మేధావుల సూచన మేరకు సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం అంటూ కామెంట్స్ చేశారు. 👉మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం మంచి పరిణామం. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్బంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం మంచి విషయం. సోనియా గాంధీ లేకపోతే ఇంకో 50 ఏళ్లు అయినా తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ కోసం కొట్లాడిన విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీతో సీఎం రేవంత్ దూకుడుగా వెళ్తున్నారు. గత పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం సృష్టించారు అని ఘాటు విమర్శలు చేశారు.👉ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ..‘పదేళ్ల నుంచి తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. సెక్రటేరియట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ప్రజలు కోరుకున్నారు. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఎన్నో విమర్శలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటేరియట్ లోపల పెడుతున్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నారు అంటూ కామెంట్స్ చేశారు. -
కోల్‌కతాలో హైఅలర్ట్.. మూడు వలయాలుగా 6 వేలమంది పోలీసులు!
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్లో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన.. దేశాన్ని కుదిపేసింది. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు మంగళవారం 'నబన్న అభిజన్' (మార్చ్ టు సెక్రటేరియట్) పేరుతో నిరసనకు పిలుపునిచ్చాయి. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఈ భారీ ర్యాలీ జరగనుంది. అయితే హింస చేలరేగే అవకాశం ఉండడంతో కోల్‌కతా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్ వద్ద సుమారు 6 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థి సంఘాల ముసుగులో.. అరాచక శక్తులు ర్యాలీలో పాల్గొన వచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.#BreakingNews : कोलकाता डॉक्टर रेप-हत्या पर बड़ी खबर, भारी संख्या में छात्र आज करेंगे प्रदर्शन#KolkataDoctorDeathCase #KolkataDoctorDeath #CBI #KolkataDeathCase | @Nidhijourno @anchorjiya pic.twitter.com/mDjspQ4ons— Zee News (@ZeeNews) August 27, 2024క్రెడిట్స్: Zee News సామాన్య ప్రజలను రెచ్చగొట్టి అరాచకాలు సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సుమారు 19 పాయింట్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. 26 మంది డిప్యూటీ కమిషనర్లు పలు పాయింట్ల వద్ద ఎప్పటికప్పుడు పోలీసు భద్రతను పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు చోట్ల పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి కోల్‌కతా, హౌరాలో పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తామని పోలీసులు అధికారులు తెలిపారు. యువ వైద్యురాలిపై హత్యాచార ఘటన తర్వాత.. ఆగస్టు 14 అర్ధరాత్రి చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అందుకే పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ భద్రతకు ప్లాన్ చేశారు. మరోవైపు.. శాంతియుతంగా నిరసన తెలిపేవారిని అడ్డుకోవద్దని ఇటీవల సుప్రీం కోర్టు బెంగాల్ ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. -
సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డా.బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ఆదివారం రోడ్లు, భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ సచివాలయం 5వ అంతస్తులోని 5F 11,12,13 గదుల వద్ద పూజలు నిర్వహించారు. తర్వాత మంత్రి కోమటిరెడ్డి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే 9 ఫైల్స్‌పై సంతకం చేశానని తెలిపారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేసిన వారికీ కృతజ్ఞతలు తెలిపారు. R&B శాఖ కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సీఎంతో చర్చించి కౌన్సిల్ హాల్‌ను షిఫ్ట్ చేస్తున్నమని తెలిపారు. ముఖ్యమంత్రి ఆ బాధ్యతలు తనకు అప్పగించారని పేర్కొన్నారు. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ముందు ఫెన్సింగ్ తీసేసి సుందరీకరణ చేస్తామని ఆయన వెల్లడించారు. నియోజకవర్గ పరిధిలోని రోడ్లను రూ.100 కోట్లతో నాలుగు లైన్ల రోడ్లుగా మారుస్తున్నామని తెలిపారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కోమటిరెడ్డి తెలిపారు. రేపు(సోమవారం) తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అపాయింట్మెంట్ తీసుకుంటానని అన్నారు. తనకున్న పరిచాయలతో ఢిల్లీ నుంచి నిధులు తీసుకువస్తానని తెలిపారు. కొడంగల్ లింగంపల్లి-దుగ్యాల రోడ్డు, నేషనల్ హైవే రోడ్లు కూడా రావాల్సి ఉందని అందుకే 14 రోడ్లను.. నేషనల్ హైవే రోడ్లుగా గుర్తించాలని రేపు ఢిల్లీకి వెళ్తునట్లు తెలిపారు.హైదరాబాద్-విజయవాడ రోడ్‌ను ఆరు లైన్ల రోడ్‌గా మార్చాలని అన్నారు. నకిరేకల్ రోడ్డు అభివృద్ధి చేయాలని, హైదరాబాద్-కల్వకుర్తి రోడ్డును 4 లైన్లుగా మార్చాలని చెప్పారు. సెంట్రల్ రోడ్ నిఫ్రా స్ట్రక్చర్ నిధులు పెంచాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు. మొత్తం ఐదు పనులను పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని అడుగుతానని పేర్కొన్నారు. ఎల్బీనగర్ మల్కాపురం వరకు, మల్కాపురం నుంచి సూర్యాపేట వరకు 6 లైన్ల రోడ్డు పనులు చేయాలన్నారు. పది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత వస్తుందని తెలిపారు. -
సచివాలయంలో సీఎం కేసీఆర్, గవర్నర్.. చాలా రోజులకు ఒకే వేదికపై..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త సచివాలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.హైదరాబాద్: రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో గుడి, చర్చి, మసీదులను గవర్నర్ తమిళిసైతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ప్రారంభించారు. నల్లపోచమ్మ ఆలయ పూర్ణాహుతి కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చర్చి ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం మసీదును ప్రారంభించి నమాజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ►గవర్నర్ తమిళిసైను సీఎం కేసీఆర్ కొత్త సచివాలయంలోకి తీసుకెళ్లారు. ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌ను చూపించారు. ►.సచివాలంలోని సర్వమత ప్రార్థనల్లో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై సీఎం, గవర్నర్ కలిసి కనిపించారు ►సచివాలయంలో నల్లపోచమ్మ ఆలయం, మసీదు, చర్చిల ప్రారంభోత్సవం జరిగింది. ఈ క్యాక్రమంలో సీఎ కేసీఆర్, గవర్నర్ తమిళిసైసౌందరరాజన్ ప్రారంభించారు. అనంతరం సచివాలయాన్ని గవర్నర్ తమిళిసై పరిశీలించనున్నారు ► శివాలయం, పోచమ్మగుడి, హనుమాన్, గణపతి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ► మందిరాల ప్రారంభోత్సవం సందర్భంగా యాగం నిర్వహించారు. ► గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ నేడు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ► మత పెద్దల సమక్షంలో మసీదు, చర్చిలను కేసీఆర్ ప్రారంభించనున్నారు. షెడ్యూల్ ఇదే.. ► మధ్యాహ్నం 12: 35 గంటలకు కేసీఆర్ సచివాలయం చేరుకోనున్నారు. ► 12: 40 గంటలకు చర్చి రిబ్బన్ కటింగ్. ► 12: 45 గంటలకు చర్చిలో కేక్ కటింగ్. ►12: 55 గంటలకు చర్చిలో ముగింపు ప్రేయర్ ► మధ్యాహ్నం 1- 1.30 గంటల వరకు మసీదును ప్రారంభించి మత పెద్దల ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొననున్నారు కేసీఆర్. -
సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ భేటీ.. చర్చించే ముఖ్యాంశాలు ఇవేనా!
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో జూలై 31న రాష్ట్ర కేబినేట్ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా దాదాపు 40 నుంచి 50 అంశాల మీద రాష్ట్ర కేబినేట్ చర్చించనుంది. ఇటీవల రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, వరదలు సంభవించిన కారణంగా ప్రభుత్వ చర్యలపై ఈ కేబినేట్ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. రైతాంగం వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో.. అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేయడంతో పాటు దీనిపై అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడం.. అలాగే యుద్ధప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధిరించడం కోసం చేపట్టనున్న చర్యలపై కేబినేట్ చర్చించనున్నట్లు సమాచారం. చదవండి జీహెచ్ఎంసీ ఆఫీసులోకి కాంగ్రెస్ నేతలు.. లోపల కూర్చుని నిరసన -
తెలంగాణ సచివాలయం దగ్గర ఉద్రిక్తత
-
దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ మారింది
-
ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి: సీఎస్ సోమేశ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ విజన్‌కు అనుగుణంగా పనిచేయాలని, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ ఉద్యోగులను కోరారు. 122 మంది సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి నందుకు తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గురువారం బీఆర్కేఆర్ భవన్లో సోమేశ్‌కుమార్‌ను సన్మానించింది. రాష్ట్రంలోని పేద ప్రజలకు సహాయం చేయడానికి పారద ర్శకంగా సేవలను సమర్థవంతంగా అందించాలని ఆయన ఉద్యోగులను కోరారు. సీఎం ఆదేశాల మేర కు ప్రభుత్వంలోని అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా పదోన్నతులు కల్పించామ న్నారు. ఉద్యోగులందరికీ డ్రాఫ్టింగ్, నోట్స్, కంప్యూ టర్ స్కిల్స్‌పై శిక్షణను ఏర్పాటు చేయడం ద్వారా మానవ వనరులను అభివృద్ధి చేయాలని సాధారణ పరిపాలనశాఖకు సూచించారు. కార్యక్రమంలో జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ రావు పాల్గొన్నారు. -
ఉద్యోగులకు ఇకపై ఇంటినుంచే పని
చంఢీగడ్ : భారత్‌లో కరోనా విజృంభిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో సచివాలయంలో పనిచేసే గర్భిణీ ఉద్యోగులక ఊరట కల్పిస్తూ ప్రభుత్వం తీపికబురు అందించింది. హర్యానా సచివాలయంలో పనిచేసే గర్భిణీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం జాయింట్, డిప్యూటీ సెక్రటరీలు, సూపరింటెండెంట్లు, డిప్యూటీ సూపరింటెండెంట్లు, కార్యదర్శులు తమ విభాగాల్లో పనిచేస్తున్న గర్భిణులకు ఇంటి వద్ద నుంచి పనిచేసేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. (కాగ్‌గా బాధ్యతలు చేపట్టిన గిరీశ్ చంద్ర ముర్ము) కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గర్భిణీలకు ఊరటనిచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటూ సీఎంవో కార్యాలయం ట్వీట్ చేసింది. అంతేకాకుండా అంధులు, శారీరక వైకల్యం ఉన్నవారికి సైతం ఇంటి నుంచే పని చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అంతకుముందు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సైతం గర్భిణీలు, 55 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్నవారు, పదేళ్ల వయసు పిల్లలున్న ఉద్యోగులు కార్యాలయానికి హాజరు కావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక హర్యానాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40, 054కు చేరుకోగా, 167 మంది మరణించారు. (‘ఆశా కార్యకర్తలపై కేంద్రం గుడ్డిగా వ్యవహరిస్తోంది’ ) -
సచివాలయం ఇక కూల్చివేతే!
-
నేడు లేదా రేపు ‘సచివాలయ’ ఫలితాలు
సాక్షి, అమరావతి: లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు గురువారం సాయంత్రం లేదా శుక్రవారం విడుదల కానున్నాయి. గురువారమే ఫలితాలు వెల్లడించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే.. ప్రభుత్వంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నవారికి వెయిటేజ్ మార్కులు కలిపే అంశానికి సంబంధించి ఇంకా రెండు శాఖల నుంచి సమాచారం అందలేదు. భర్తీ చేస్తున్న మొత్తం 19 రకాల ఉద్యోగాల్లో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్–5, రూరల్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వీఆర్వో, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులు మినహా మిగిలిన పోస్టులకు ప్రస్తుతం ఆయా ఉద్యోగాల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నవారికి వారి సర్వీస్ కాలం ఆధారంగా వెయిటేజ్ మార్కులు ఉంటాయని అధికారులు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే.. అందులో రెండు రకాల ఉద్యోగాల రాతపరీక్షల ఫలితాలకు వెయిటేజ్ మార్కులు కలిపే ప్రక్రియ బుధవారం సాయంత్రం వరకు పూర్తికాలేదు. దీంతో గురువారం ఉదయానికి ఈ ప్రక్రియ పూర్తయితే, సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇన్చార్జి మంత్రులతో గ్రామ సచివాలయాలు ప్రారంభం అక్టోబరు 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోయే గ్రామ సచివాలయాల కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో ఇన్చార్జి మంత్రుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ఏదో ఒక మండలంలోని ఒక గ్రామ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆ జిల్లా ఇన్చార్జి మంత్రి ఆధ్వర్యంలో జరిపించాలని అందుకనుగుణంగా జిల్లా కలెక్టర్ ఆ జిల్లా ఇన్చార్జి మంత్రితో మాట్లాడి తగిన ఏర్పాటు చేసుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ జిల్లా అధికారులను బుధవారం ఆదేశించారు. -
సెక్రటేరియట్,అసెంబ్లీ భవనాలకు శంకుస్ధాపన
-
కొత్త సచివాలయ నిర్మాణానికి భూమిపూజ
-
రేపటి కేబినెట్లో ఐఆర్,సీపీఎస్ రద్దుపై నిర్ణయం
-
సచివాలయంలో చంద్రబాబు ఫొటోలు తొలగింపు
-
ఈదురుగాలులకు ఎగిరిపోయిన సచివాలయం రేకులు
-
ఈదురుగాలులకు ఎగిరిపోయిన సచివాలయం రేకులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నాం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం వరకూ ప్రశాంతంగా ఉన్న రాజధాని ప్రాంతం.. ఒక్కసారిగా ఈదురు గాలులు వీచడంతో చిగురుటాకులా వణికింది. గాలి, భారీవర్షం అమరావతి పరిసర ప్రాంతంలో బీభత్సం సృష్టించాయి. గాలల ధాటికి రాష్ట్ర సచివాలయంలో రేకులు ఎగిరిపడ్డాయి. సచివాలయ ప్రాంగణంలో స్మార్ట్‌పోల్, ఎంట్రీపాయింట్ కుప్పకూలాయి. బ్లాక్ టెర్రస్‌లో రేకులు ఎగిరిపడగా, నాలుగో బ్లాక్‌లో రేకులు ఈదురుగాలల ధాటికి విరిగిపోయాయి. అలాగే గుంటూరు, తాడికొండ ప్రాంతాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మంగళగిరిలో వడగాళ్ల వాన స్థానికులను అతలాకుతలం చేసింది. మీడియాకు అనుమతి నిరాకరణ మరోవైపు ఇటీవల నిర్మించిన తాత్కాలిక హైకోర్టు భవనం కూడా దెబ్బతిన్నది. ఈదురు గాలులకు హైకోర్టు రేకులు ఊడిపోయాయి. అదే సమయంలో సమీపంలో ఉన్న రమణ అనే కార్మికురాలపై రేకులు పడి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. రేకులు లేచిపోవడంతో అక్కడి సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన భవనాన్ని రిపేర్ చేశారు. హైకోర్టు ప్రాంగణంలోకి మీడియాను అనుమంతించకుండా భారీగా పోలీసుల్ని మోహరించారు. -
సర్వీస్ చార్జీలు ఇస్తే.. మాకు ఓకే!
సాక్షి,హైదరాబాద్: బైసన్‌పోలో మైదానంలో సచివాలయ నిర్మాణంపై మళ్లీ కదలిక మొదలైంది. మంగళవారం హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు రక్షణ శాఖలో కసరత్తు తిరిగి ప్రారంభం కానుంది. కంటోన్మెంట్ ప్రాంతంలోని బైసన్‌పోలో మైదానం ఆవరణలో సచివాలయం నిర్మించినున్నట్లు 2015లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ మేరకు ప్రధానితో పాటు, రక్షణ శాఖ మంత్రిని కలసి సహకరించాల్సిందిగా కోరారు. తదనుగుణంగా భూ బదలాయింపునకు కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలపడంతో కంటోన్మెంట్, రక్షణ, రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ విభాగాల అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. 60 ఎకరాల పరిధిలోని బైసన్ పోలో, జింఖానా మైదానాలను సచివాలయానికి అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను మిలిటరీ అధికారులు అంగీకరించారు. అలాగే ప్యాట్నీ నుంచి హకీంపేట, ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి చెక్‌పోస్టు వరకు రెండు స్కైవేల నిర్మాణానికి మరో 90 ఎకరాలు అవసరం అవుతుందని కమిటీ సర్వేలో తేలింది. 150 ఎకరాల కంటోన్మెంట్ స్థలానికి బదులు మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో ఆర్మీ రైఫిల్ రేంజ్ కోసం 513 ఎకరాలు బదలాయిం చేం దుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. సర్వీసు చార్జీలే అడ్డంకి కంటోన్మెంట్ స్థలాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం వల్ల కంటోన్మెంట్ బోర్డు కోల్పోయే ఆదాయాన్ని సర్వీసు చార్జీల రూపంలో చెల్లించాల్సిందిగా కంటోన్మెంట్ అధికారులు కోరారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అనడంతో బైసన్ పోలో మైదానంలోకి సచివాలయం ఏర్పాటు ప్రతిపాదన అటకెక్కింది. తాజాగా సచివాలయానికి కంటోన్మెంట్ స్థలాల అప్పగింతకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణకు హైకోర్టు అంగీకరించడంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. సర్వీసు చార్జీల అంశంలో కంటోన్మెంట్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఏకాభిప్రాయం కుదిరితే సచివాలయం ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయే అవకాశముంది. భూ బదలాయింపుతో పాటు కోరిన మొత్తాన్ని సర్వీసు చార్జీలుగా చెల్లించేందుకు ప్రభుత్వం ఒకే అంటే, భూములు అప్పగించే యోచనలో రక్షణ శాఖ ఉన్నట్లు తెలిసింది. ప్రాథమిక అంగీకారం తెలిపాం కొత్త సచివాలయం నిర్మాణానికి సికింద్రాబాద్, బైసన్‌పోలో గ్రౌండ్‌ను బదలాయించేందుకు ప్రాథమికంగా అంగీకారం తెలిపామని, కొన్ని షరతులు విధించామని కేంద్రం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. ఈ షరతులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలపాల్సి ఉందని పేర్కొంది. తమ షరతులకు అంగీకారం తెలిపిన తర్వాతే బైసన్‌పోలో గ్రౌండ్ బదలాయింపుపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని వివరించింది. ఈ కేసు పెండింగ్‌లో ఉండటం వల్ల బదలాయింపు విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోలేకపోతోందని నివేదించింది. అందువల్ల త్వరితగతిన ఈ కేసులో విచారణ జరపాలని అభ్యర్థించింది. దీంతో ఈ వ్యవహారంపై ఫిబ్రవరి 12న విచారణ జరుపుతామని, ఈ కేసులో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు లేనందున, ఈ లోపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదింపులు, ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బైసన్‌పోలో, జింఖానా మైదానాలను సచివాలయ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించకుండా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ డీజీపీ ఎంవీ భాస్కరరావు, మాజీ క్రికెటర్ వివేక్ జయసింహతో పాటు మరో ఇద్దరు 2017లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇదే అంశంపై జి.కరుణాకర్ అనే వ్యక్తి కూడా ఆ తర్వాత పిల్ దాఖలు చేశారు. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు.. మంగళవారం మరోసారి విచారించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సునీల్ బి.గాను, వీవీఎన్ నారాయణరావులు వాదనలు వినిపిస్తూ.. 2017లో ఈ వ్యాజ్యాలు దాఖలు చేశామని, ఇప్పటి వరకు మౌనంగా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు అత్యవసరంగా విచారణ జరపాలని కోరుతోందని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు కూడా లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. సచివాలయ నిర్మాణం కోసం బైసన్‌పోలో గ్రౌండ్‌ను బదలాయించేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) కె.లక్ష్మణ్ స్పందిస్తూ.. బైసన్‌పోలో గ్రౌండ్ బదలాయింపు విషయంలో ప్రాథమిక అంగీకారం తెలిపిన మాట వాస్తవమేనని, అయితే ఇదే సమయంలో కొన్ని షరతులు కూడా విధించామని తెలిపారు. ఈ షరతులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ షరతులకు అంగీకారం తెలిపిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. -
సచివాలయంలో టీడీపీ ఎంపీకి చేదు అనుభవం
సాక్షి, అమరావతి : అధికార పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌కు ఏపీ సచివాలయంలో చేదు అనుభవం ఎదురయ్యింది. పబ్లిసిటీ సెల్లో మీడియా సమావేశం నిర్వహించాలనుకున్న కనకమేడలకు ఐ అండ్ పీఆర్ అధికారులు అనుమతి నిరాకరించారు. కేవలం మంత్రులు, విప్ల మీడియా సమావేశాల నిర్వహణకు మాత్రమే సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌ని అనుమతిస్తారని అధికారులు తెలిపారు. పబ్లిసిటీ సెల్లో మీడియా సమావేశానికి అనుమతి నిరాకరించడంతో ఫోర్త్ బ్లాక్ బయట మీడియా సమావేశాన్ని నిర్వహించారు కనకమేడల. -
సెక్రటేరియట్ వద్ద కారు బీభత్సం
సాక్షి, హైదరాబాద్ : సెక్రటేరియట్ సమీపంలో గురువారం ఓ కారు బీభత్సం సృష్టించింది. కోఠికి చెందిన ముగ్గురు యువకులు తప్పతాగి.. వాహనం నడపడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. వేగంగా వచ్చిన మారుతీ రిట్జ్ కార్ సెక్రటేరియట్ సమీపంలోని చెట్టును ఢీకొట్టి.. పల్టీలు కొట్టింది. యాక్సిడెంట్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. మద్యం తాగి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం సంభంవించినట్లు పోలీసులు నిర్థారించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏపీ వ్యాప్తంగా కుండపోత వర్షాలు
-
పన్నీర్ - స్టాలిన్.. సచివాలయంలో భేటీ!
తమిళనాడు రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. బద్ధశత్రువులైన డీఎంకే - అన్నాడీఎంకే నేతలు సమావేశమవుతున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పన్నీర్ సెల్వం.. ప్రతిపక్ష నాయకుడు ఎంకే స్టాలిన్‌తో భేటీ అవుతున్నారు. డీఎంకేను వ్యతిరేకిస్తూ ఏర్పాటైన అన్నాడీఎంకేలో ముఖ్యమంత్రిగా పనిచేసి, అమ్మకు అత్యంత విధేయుడిగా పేరొందిన పన్నీర్ సెల్వం.. ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో భేటీ కావడం ఏంటన్న చర్చ జోరుగా సాగుతోంది. అవసరమైతే పన్నీర్ సెల్వం ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తామని కూడా ఒక సందర్భంలో స్టాలిన్ అన్నట్లు కథనాలు వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరి భేటీ నేపథ్యంలో నిజంగానే మద్దతు గురించి చర్చిస్తారా లేక వేరే ఏమైనా చర్చలు ఉంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడు కథనాలు చదవండి... శశికళకు 119 మంది 'రిసార్ట్ ఎమ్మెల్యేల' మద్దతు! కమల్.. మళ్లీ వేసేశాడు! చిన్నమ్మతో ప్రభుత్వం ఏర్పాటు చేయించండి: సుప్రీంలో పిల్ పన్నీర్ అమ్ముడుపోయారు.. చిన్నమ్మే కావాలి శశికళా.. మొసలి కన్నీరు ఆపండి: సెల్వం 'తమిళనాడులో సీఎం పదవి ఖాళీలేదు' జయలలిత చివరి మాటలు ఏంటో తెలుసా? సచివాలయానికి సీఎం పన్నీర్ సెల్వం! ఢిల్లీని ఢీ కొడతా ఎమ్మెల్యేలు ఇంకా రారేంటి? ‘అమ్మ’ కోసం అవమానాలు భరించా తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట -
సచివాలయంలో సివిల్ డిస్పెన్సరీ
హైదరాబాద్: వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో సివిల్ డిస్పెన్సరీని ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. రాష్ట్రం విడిపోక ముందు హైదరాబాద్ సచివాలయంలో డిస్పెన్సరీ ఉండేది. వెలగపూడిలోని ఏపీ సచివాలయానికి కొత్త డిస్పెన్సరీ అవసరమైంది. అత్యవసర వైద్యంలో భాగంగా ఇద్దరు వైద్యులు, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఇద్దరు అటెండర్లు, ఒక స్వీపర్‌తో మొత్తం తొమ్మిదిమంది ఈ డిస్పెన్సరీలో విధులు నిర్వహిస్తారు. డిస్పెన్సరీలో సచివాలయ సిబ్బందికి వివిధ రకాల రక్త పరీక్షలు అందుబాటులో ఉంటాయి. సామాజిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో వైద్యం పొందే అవకాశం ఉంటుంది. సచివాలయంలో రెండు వేల మంది సిబ్బంది ఉండటంతో పాటు పలువురు అధికారులు కూడా ఇక్కడకు వచ్చివెళ్తుంటారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ డిస్పెన్సరీ పని చేస్తుంది. కాగా ఈ డిస్పెన్సరీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ పరిధిలోకి వస్తుంది. తాజాగా ఏర్పాటు చేయనున్న డిస్పెన్సరీకి సిబ్బందిని కూడా వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్న వారినే డెప్యుటేషన్ మీద నియమించనున్నట్టు తెలిసింది. -
వెలగపూడిలో వంద కోట్ల మాయ
-
రాజధానిపై చంద్రబాబుకు జ్ఞానోదయం
-
సీఎం కార్యాలయంపై హెలీప్యాడ్ ప్రతిపాదన ఉత్తిదే
విమర్శలతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం విజయవాడ: తుళ్లూరు మండలం వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంపై హెలీప్యాడ్ నిర్మాణ ప్రతిపాదన లేదని సీఆర్డీఏ కమిషన్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యాలయంపైనే హెలీప్యాడ్ ఏర్పాటుచేసుకోవడం ద్వారా అక్కడ దిగి నేరుగా ఛాంబర్లోకి ముఖ్యమంత్రి వెళ్లేలా భవనానికి డిజైన్ చేసినట్లు ప్రచారం జరిగింది. దేశంలో ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రికి ఇలాంటి సౌకర్యం లేదని, హెలీప్యాడ్ నిర్మిస్తే కార్యాలయంపైనే దాన్ని ఏర్పాటుచేసుకున్న మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలుస్తారని సీఆర్డీఏ వర్గాలు తెలిపాయి. కానీ దీనిపై విమర్శలు రావడంతో ప్రభుత్వం ప్లేటు ఫిరాయించింది. లోటు బడ్జెట్, ఉద్యోగులకు జీతాలివ్వలేమని ఒకవైపు చెబుతూ మరోవైపు ఇలాంటి విలాసాలేంటనే వాదన మొదలైంది. అసలు తాత్కాలిక సచివాలయమే అనవసరమని, డబ్బు వృధా చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న తరుణంలో దానిపై ఏకంగా హెలీప్యాడ్ నిర్మిస్తే ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం భావించనట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం నుంచి సైతం అభ్యంతరాలు వస్తాయనే ఆలోచనతో దీన్ని విరమించుకున్నారు. అయితే అధికారికంగా చెప్పలేదు కాబట్టి ఈ ప్రతిపాదనే లేదని సీఆర్డీఏ కమిషనర్‌తో చెప్పించినట్లు తెలిసింది. -
జూన్ 1న ప్రభుత్వ ఉద్యోగుల నిరసన ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజనలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా జూన్ 1న మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రభుత్వ, సచివాలయ ఉద్యోగులు కలసి సచివాలయంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కో-ఆర్డినేషన్ కమిటీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
సచివాలయంలో అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయంలో అగ్నిమాపక సిబ్బంది గురువారం మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్ని ప్రమాదం వంటి విపత్కర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, ఎలా రక్షించుకోవాలి అనే విషయాలపై ఉద్యోగులకు తగు సూచనలు చేశారు. వేసవి కాలం కావడంతో అకస్మాత్తుగా సంభవించే అగ్నిప్రమాదాల నిర్వహణపై సిబ్బందిని సమాయత్తం చేసేందుకు మాక్ డ్రిల్ నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ప్రమాద స్థలానికి దూసుకెళ్లే ‘బుల్లెట్ మిస్ట్’ ఇరుకైన ప్రాంతాల్లో ప్రమాదం జరిగితే అగ్నిమాపక సిబ్బంది వేగంగా చేరుకునేందుకు ‘బుల్లెట్ మిస్ట్’ అనే మోటార్ సైకిల్‌ను వినియోగించనున్నారు. అగ్నిమాపక వాహనం వచ్చేలోగా ‘బుల్లెట్ మిస్ట్’పై సిబ్బంది ప్రమాదస్థలానికి చేరుకుని మం టలను అదుపు చేసేందుకు ముందస్తు చర్యలు చేపడతారని అగ్నిమాపక శాఖ సంచాలకుడు పి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఇలాంటి వాహనాలు 4 మాత్రమే ఉన్నాయని, త్వరలోనే నగరంలోని అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. బుల్లెట్ మిస్ట్‌తోపాటు మిని వాటర్ టెండర్, వాటర్‌టెండర్, హజ్మత్ వాహనం, 54 మీటర్ల ఎత్తులో ప్రమాదం జరిగినా ఎదుర్కొనేలా రూపొందించిన ల్యాడర్‌ను ప్రదర్శించారు. -
కేసీఆర్‌కు మీడియా అంటే ఎందుకంత భయం?
-
తరలించే సచివాలయానికి మెరుగులు..!
హైదరాబాద్: ‘ప్రస్తుతం ఉన్న సచివాలయం వాస్తు బాగోలేదు.. ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రిని వికారాబాద్ తరలించి.,, ఆ స్థలంలో కొత్త సచివాలయాలన్ని నిర్మిస్తాం’ అంటూ ఒకవైపు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటిస్తుంటే... అధికారులు మాత్రం సచివాలయానికి మెరుగుల కోసమంటూ నిధులు విడుదల చేస్తున్నారు. సెక్రటేరియట్లో ప్రధాన రోడ్డు విస్తరణ కోసం రూ.9.80 లక్షలు మంజూరు చేస్తూ సోమవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సెక్రటేరియట్లో మెయిన్ గేట్ నుంచి సీఎం కార్యాలయానికి వెళ్లే ప్రధాన దారి మలుపులు తిరిగి ఉంది. అందుకే సీ బ్లాక్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయం ఎదురుగా ఉన్న నల్ల పోచమ్మ దేవాలయానికి.. డి బ్లాక్‌కు మధ్యలో ఉన్న లాన్‌ను పూర్తిగా తొల గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉన్నతాధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సచివాలయ మార్గంలో మెయిన్‌గేట్, ఆర్చి నిర్మాణానికి కోటి రూపాయలు మం జూరు కాగా పనులు జరుగుతున్నాయి. తెలంగాణ సంసృ్కతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ ఆర్చీ నిర్మిస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. మెయిన్ గేట్‌కు సమీపంలో రోడ్డుకు అడ్డుగా ఉందనే కారణంతో కిండర్ గార్టెన్ స్కూల్‌ను ఏ- బ్లాక్ సమీపంలోనికి తరలించారు. దీనికి రూ.15 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేసింది. సచివాలయ తరలింపు నేపథ్యంలో ఇవన్నీ వృథా మిగిలిపోనున్నాయి. -
ఎర్రగడ్డకు తెలంగాణ సచివాలయం ?
-
టెక్నాలజీతో మరింత ప్రగతి సాధించగలం
-
'దేవ రహస్యం' పుస్తక ఆవిష్కరణ
-
టీ సచివాలయం ముందు విద్యార్థి సంఘాల ఆందోళన
-
2 రాష్ట్రాల పటిష్ట పునాదికి సంస్కరణలు
‘సాక్షి’కి సీఎస్ మహంతి ప్రత్యేక ఇంటర్వ్యూ రాష్ట్ర విభజనలో, ఇరు రాష్ట్రాల సుపరిపాలనలో కీలక పాత్ర పోషిస్తా అవసరం లేని సంస్థలు, శాఖల మూత... మరికొన్ని విలీనం ఫైళ్లు ఇంటికి తీసుకెళ్లడంపై నిషేధం... ఉద్యోగులు ఇక రాజకీయాలు వదిలేయాలి సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల పటిష్ట పునాదికి సంస్కరణలు చేపట్టనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి తెలిపారు. విభజన నేపథ్యంలో సీఎస్‌గా మరో 4 నెలల పొడిగింపుతో మహంతి ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీలు, కేటాయింపులో కీలక పాత్ర పోషించనున్నారు. ఇరు రాష్ట్రాల్లో సుపరిపాలన తీసుకురావడానికి అవసరమైన సంస్కరణలు చేపట్టడానికి కృషి చేయనున్నారు. నిజానికి శుక్రవారం పదవీకాలం పూర్తి కావాల్సి ఉంది. అయితే రాష్ట్ర విభజన సమయంలో కంటిన్యుటీ ఉండాలనే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి మహంతి పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించింది. ఈ సందర్భంగా మహంతి సాక్షితో ప్రత్యేకంగా వూట్లాడారు. వివరాలు ఆయున మాటల్లోనే... కేంద్ర సర్వీసులో కార్యదర్శి హోదా పదోన్నతి వచ్చినప్పటికీ సీఎం కోరిక మేరకు రాష్ట్ర సర్వీసుకు వచ్చాను. వచ్చాక మూడు నెలలు మాత్రమే ప్రశాంతంగా ఉంది. తరవాత తుపాన్లు, వరదలు, ఉత్తరాఖండ్ దుర్ఘటన, తెలంగాణ ఉద్యోగులు, సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెలకు తోడు రాజకీయ అనిశ్చితి కూడా నెలకొంది. వీటన్నింటినీ అధికార యంత్రాంగం బాగానే అధిగమించింది. అధికారులకు ఎప్పుడూ అజెండా ఉండకూడదు. ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయాలి. విభజన అంత సులభతరం కాదు. సుదీర్ఘ కాలం పడుతుంది. ఇరు రాష్ట్రాలు అవసరమైన సంస్కరణల తో ముందే గట్టి పునాది నిర్మించుకోవాలి. అందుకోసం సుదీర్ఘకాలం పని చేస్తాను. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహాయంతో సంస్కరణలు, సుపరిపాలనకు మార్గదర్శకాల రూపకల్పన చేస్తా. ఇందుకు 30 మంది యువకులతో పరిశోధనా విభాగాన్ని ఏర్పాటు చేస్తాను. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పలు శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు అవసరం లేదు. వాటిని ఇరు రాష్ట్రాలు మూసేసుకోవాలి. ఉదాహరణకు ఆర్థిక శాఖలో ఐదుగురు ఐఏఎస్ అధికారులతో కూడిన విభాగాలున్నాయి. పరిశ్రమల శాఖలో నలుగురు ఐఏఎస్ అధికారులతో విభాగాలున్నాయి. విభజన తర్వాత అంతమంది అవసరం లేదు. అలాగే కొన్ని శాఖలను విలీనం చేయాలి. కొన్ని కార్పొరేషన్లలో, శాఖల్లో అవసరానికి మించి ఉద్యోగులున్నారు. మరికొన్నింట్లో ఉద్యోగుల కొరత ఉంది. వీటిని సంస్కరణల ద్వారా సరిచేయూలి. విభజన సమయంలో అధికారులెవరూ ఇళ్లకు ఫెళ్లు తీసుకువెళ్లరాదు. దీనిపై నిషేధం విధించాం. ఫైళ్లు తీసుకువెళ్లడంపై నిఘా కోసం జీఏడీ, ప్రత్యేక భద్రత, విజిలెన్స్‌తో కమిటీ ఏర్పాటు. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల మంజూరు సంఖ్య 376. ప్రస్తుతం 299 మందే ఉన్నారు. దీంతో 77 మంది ఐఏఎస్‌ల కొరత ఉంది. విభాగాలు విలీనం, సంస్కరణల ద్వారా కొరతను అధిగమిస్తాం. ఐఏఎస్‌లకు ఆప్షన్స్ అడుగుతారు. అయితే కొంతమంది ఐఏఎస్‌ల్లో ఆందోళన ఉంది. తమిళనాడుకు చెందినవారు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందినవారు తెలంగాణలో పనిచేయడానికి సుముఖత చూపుతున్నారు. ఉద్యోగుల విభజన, ఆస్తులు, ఆప్పుల పంపిణీ, ఉమ్మడి రాజధానిలో ఇరు రాష్ట్రాల పాలన చాలా క్లిష్టతరం. ఇందుకు చాలా పని చేయాల్సి ఉంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోను, మరి కొన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలో చేయాలి. సచివాలయంతో పాటు కొన్ని రంగాల్లో అధికారులు విభజన చేసినట్టు వస్తున్న వార్తలు నిజం కాదు. అధికారులు ప్రతిపాదనలను తయారు మాత్రమే చేస్తున్నారు. ఆ ప్రతిపాదనలపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. విభజనోద్యమం సందర్భంగా ప్రభుత్వోద్యోగులు క్రమశిక్షణారహితంగా వ్యవహరించారు. వారిక రాజకీయాలు వదిలి నియమావళి ప్రకారం, బాధ్యతాయుతంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలి. ‘మీ సేవ’లో వక్ఫ్‌బోర్డు సేవలు రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు సంబంధించిన నాలుగు సేవలను ఇకపై మీ సేవ ద్వారా కూడా పొందవచ్చు. మీ సేవలో వక్ఫ్ బోర్డు సేవలను శుక్రవారం సీఎస్ మహంతి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఒమర్ జలీల్ లాంఛనంగా ప్రారంభించారు. ఇకపై వక్ఫ్ బోర్డు ఆస్తుల ధ్రువీకరణ, వక్ఫ్ బోర్డు సంస్థల మేనేజింగ్ కమిటీల ధ్రువీకరణ, ముతవల్లీల నియామక ధ్రువీకరణ, వక్ఫ్ పరిధిలోని సంస్థల పర్యవేక్షకులకు అందించే ఆర్థిక సహాయ ధ్రువీకరణ పత్రాలను మీ సేవలో నిర్ణీత రుసుము చెల్లించి పొందవచ్చని జలీల్ తెలిపారు. -
దద్దరిల్లిన సచివాలయం
విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళన అడ్డుపడుతున్నారంటూ తెలంగాణ ఉద్యోగుల నిరసన సాక్షి,హైదరాబాద్: విభజన బిల్లు అసెంబ్లీకి రావడంతో రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల ఉద్యోగుల ఆందోళనలు, ధర్నాలతో బుధవారం సచివాలయం దద్దరిల్లింది. సీమాంధ్ర ప్రజల ఆందోళనను పట్టించుకోకుండా కేంద్రం రాష్ట్ర విభజన విషయంలో దూకుడుగా వెళుతోందని సీమాంధ్ర ఉద్యోగులు ఆరోపించగా.. చివరి దశలో ఉన్న తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే కుట్రలకు పాల్పడుతున్నారంటూ తెలంగాణ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. విభజనకు వ్యతిరేకంగా 140 రోజులుగా జరుగుతున్న ఆందోళనలను పట్టించుకోకుండా కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తోందని సీమాంధ్ర సచివాల ఉద్యోగుల సంఘం నేత కృష్ణయ్య మండిపడ్డారు. ఈ నేపథ్యంలో 159 మంది సీమాంధ్ర ఎమ్మెల్యేల నుంచి విభజనకు వ్యతిరేకంగా ‘అఫిడవిట్లు’ తీసుకోవాలని నిర్ణయించామన్నారు. విభజనపై నిరసన తెలిపేందుకు వచ్చిన సీమాంధ్ర విద్యార్థులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని.. వారిని పరామర్శించడానికి వెళ్లిన సంఘం కోశాధికారి వరలక్ష్మిని కూడా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. తెలంగాణ తథ్యం: తెలంగాణ ఏర్పాటు తుది అంకానికి చేరుకున్న దశలో అడ్డుకోవడం ద్వారా విద్వేషాలు పెరగడమే తప్ప వేరే ప్రయోజనం ఉండదని సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత శ్రావణ్‌కుమార్ రెడ్డి అన్నారు. బిల్లులో తెలంగాణ ప్రాంత వాసులకూ అభ్యంతరాలు ఉన్నాయన్నారు. అక్రమంగా వచ్చిన 70 వేల మంది సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులను ఇక్కడే కొనసాగించేటట్లయితే ‘తెలంగాణ’కు అర్థమే లేదన్నారు. ‘371 డి’ని తెలంగాణకు వర్తింపచేయకపోతే స్థానికులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. -
సచివాలయంలో ధర్నాలు, ర్యాలీలు నిషేధం
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో ధర్నాలు, ర్యాలీలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ కార్యదర్శి ఎన్.శివశంకర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు సచివాలయంలో ఎటువంటి ధర్నాలు, ర్యాలీలు నిర్వహించరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సచివాలయ గౌరవాన్ని, క్రమశిక్షణను ప్రతి ఉద్యోగి కాపాడేలా వ్యవహరించాలని కోరారు. తెలంగాణ బిల్లు రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో శుక్రవారం సచివాలయంలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సచివాలయంలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించరాదని ప్రభుత్వం మరోసారి ఉత్తర్వులు జారీ చేశారు -
తక్షణమే అసెంబ్లీ
* సమైక్య తీర్మానం కోసం వైఎస్సార్సీపీ డిమాండ్.. * కుదరదన్న సీఎం.. సచివాలయంలో ఎమ్మెల్యేల ధర్నా * కేంద్రం కోరితే తప్ప తాను ప్రత్యేక భేటీ ఏర్పాటు చేయలేనన్న కిరణ్ * సీ బ్లాక్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన.. అరెస్టు * తక్షణమే సభను సమావేశపరచాలని స్పీకర్‌ను కోరిన ప్రజాప్రతినిధులు * సమైక్యవాదులెవరో, ద్రోహులెవరో తేలిపోతుందని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానించేందుకు శాసనసభను తక్షణమే ప్రత్యేకంగా సమావేశపరచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని శుక్రవారం సచివాలయంలో కలిసి ఈ మేరకు డిమాండ్ చేశారు. కానీ అందుకు ఆయన ససేమిరా అన్నారు. అసెంబ్లీ ప్రత్యేక భేటీ కుదరదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం నేపథ్యంలో దానికి విరుగుడుగా శాసనసభలో సమైక్య తీర్మానం చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ప్రజాప్రతినిధులు బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, గొల్ల బాబూరావు, తెల్లం బాలరాజు, మేకతోటి సుచరిత, ధర్మాన కృష్ణదాస్, కాటసాని రామిరెడ్డి, కె.శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కర రామారావు తదితరులు కిరణ్‌ను కలిశారు. సమైక్య తీర్మానం కోసం అసెంబ్లీని వెంటనే ప్రత్యేకంగా సమావేశ పరచాలని డిమాండ్ చేశారు. కానీ వారి డిమాండ్‌ను కిరణ్ పట్టించుకోలేదు. శీతాకాల సమావేశాలకోసం డిసెంబర్లోనే సభ జరుగుతుందని చెప్పారు. కేంద్రం కోరితే తప్ప తనంతట తానుగా ముందస్తుగా సమావేశాలు ఏర్పాటు చేయలేనని కూడా ఆయన చెప్పినట్టు తెలిసింది. కిరణ్ తీరుతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సమైక్య తీర్మానం కోసం సభను సమావేశపరచాలనే డిమాండ్‌తో ఆయనకు వినతిపత్రం అందించారు. అనంతరం జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేయడమే గాక సీఎం కార్యాలయముండే సీ బ్లాక్ వద్ద ధర్నాకు దిగారు. ‘జగన్‌తోనే సమైక్యాంధ్ర సాధ్యం’, ‘సమైక్య జెండా, రాష్ట్రానికి అండ’, ‘సమైక్యం కోసం సభను సమావేశపరచాలి’, ‘జై సమైక్యాంధ్ర’, ‘బాబు, కిరణ్ మొండి వైఖరి నశించాలి’ అంటూ ప్లకార్డులు పట్టుకుని అరగంటపాటు అక్కడే బైఠాయించారు. నినాదాలతో హోరెత్తించారు. దాంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కనీసం అక్కడున్న మీడియాతో మాట్లాడటానికీ అనుమతించలేదు. ప్రజాప్రతి నిధుల్ని బలవంతంగా ఎత్తుకెళ్లి వాహనం ఎక్కించి సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తు పై వదిలేశారు. ధర్నా నేపథ్యంలో సచివాలయంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెయిన్‌గేటు నుంచి సీ బ్లాక్ వరకు పోలీసు వలయాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు అసెంబ్లీని తక్షణమే సమావేశపరచాల్సిందిగా స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కూడా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు. రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల జరిగే నష్టాల్ని అసెంబ్లీద్వారా ప్రజలకు తెలపాల్సిన అవసరముందన్నారు. అదే సమయంలో సమైక్యవాదులెవరో, సమైక్యం ముసుగులో ద్రోహం చేస్తున్నవారి బండారమేమిటో కూడా బయటపడుతుందన్నారు. శుక్రవా రం మధ్యాహ్నం వారు అసెంబ్లీలో స్పీకర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రొరోగ్ కానందున వెంటనే సభను సమావేశపరచాలని కోరారు. సీమాంధ్రలో అగ్నిజ్వాలలు స్పీకర్‌ను కలిసిన అనంతరం సహచర ఎమ్మెల్యేలతో కలసి భూమన మీడియాతో మాట్లాడారు. విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో 79 రోజులుగా అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయన్నారు. ‘‘స్వాతంత్య్ర సంగ్రామం తరవాత అతిపెద్ద ఉద్యమం ఇదే. రాష్ట్రాన్ని విభజిస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఎడారవుతుంది. విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ నేతలు తొలి నుంచీ పోరాడుతూనే ఉన్నారు. మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విభజనను వ్యతిరేకిస్తూ జైల్లోనూ, బయటా ఆమరణ దీక్ష చేశారు. ఈ నేపథ్యంలో విభజన విషయంలో ఎవరి బండారమేమిటో ప్రజలకు తెలియాలంటే తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాల్సిన అవసరముంది. విభజనకు వ్యతిరేకంగా ఎగిసిపడుతున్న అగ్ని కీల లను ఆపడానికి సమైక్యవాద ముసుగులో నీళ్లు చల్లుతున్న ద్రోహుల బండారం కూడా సభ ద్వారానే బయటపడుతుంది. మేం సీఎంను కలసి ఇదే విషయం చెప్పి అసెంబ్లీని సమావేశపరచాలని కోరినా ఆయన అంగీకరించలేదు. అసెంబ్లీని సమావేశపరచడానికి డిసెంబర్ 30 దాకా గడువుంది గనుక ఆలోపుసమావేశపరుస్తామని, విభజనపై కేంద్ర కేబినెట్ నోట్ వచ్చినప్పుడు అభిప్రాయ సేకరణ కూడా చేపడతామని బదులిచ్చారు. అసెంబ్లీ తీర్మానం చేసినా దానికి చట్టబద్ధత ఉండదు గనుక అసలు సభను సమావేశపరచాల్సిన అవసరమే లేదని కూడా కిరణ్ అన్నారు’’ అని తెలిపారు. విభజన తొలి ద్రోహి సోనియానే కాంగ్రెస్‌తో వైఎస్సార్సీపీ కుమ్మక్కైందంటూ వస్తున్న వార్తల్ని కొందరు విలేకరులు ప్రస్తావించగా భూమన తీవ్రంగా స్పం దించారు. రాష్ట్ర విభజన విషయంలో తొలి ద్రోహి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీయేనన్నారు. ‘‘మొదటి నుంచీ మేం ఇదే చెబుతూ పోరాడుతూనే ఉన్నాం కదా! సోనియా తరవాత... విభజనకు అనుకూల లేఖలిచ్చి, విభజన జరిగేదాకా నిద్ర కూడా పోకుండా, తీరా విభజన ప్రకటన వచ్చాక ఇప్పుడు హాయిగా నిద్ర పోతున్న చంద్రబాబు మరో ద్రోహి. 3వ అధికరణం ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని మేం చెప్పలేదు. ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగేలా, అందరి సమ్మతితో ఒక తండ్రిలా న్యాయం చేయాలని మాత్రమే చెప్పాం. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమంటే విభజించాలని కాదు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే న్యాయం జరుగుతుందనేది మా భావన. అంతే తప్ప ఏ ఒక్కరి అభిప్రాయమూ తెలుసుకోకుండా 3వ అధికరణాన్ని దుర్వినియోగం చేస్తూ, ఒక ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేసే నిర్ణయం తీసుకోవాలని కాదు. ఇలాంటి నిర్ణయాన్ని మేం అంగీకరించే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టారు. గతంలో రాజీనామా చేసి, వాటిని ఆమోదించాలని స్పీకర్‌ను ఎందుకు కోరలేదని ప్రశ్నిం చగా, ‘అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని అడిగేందుకు వచ్చిన వాళ్లం రాజీనామాలను ఆమోదించాలని కోరతామా?’ అని బదులిచ్చారు. అసెంబ్లీని సమావేశపరిచి అందరి అభిప్రాయాలూ తీసుకున్నాక స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలను ఆమోదించుకుంటామని శోభా నాగిరెడ్డి చెప్పారు. -
సోనియా క్విట్ ఇండియా..
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. సోమవారం సచివాలయం పాత ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ‘సోనియా క్విట్ ఇండియా.. ప్యాకేజీలు వద్దు సమైక్యాంధ్ర ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. సాయంత్రం 7 గంటల సమయంలో సచివాలయంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సమతా బ్లాక్ ఎదురుగా కూర్చుని నిరసన తెలిపారు. అంతకుముందు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు మంత్రి వర్గ ఉపసంఘంతో చర్చల్లో పాల్గొన్నారు. ఈనెల 9న సీఎంతో సమావేశం కానున్నామని, రాష్ట్ర విభజన నిలిపివేయడంపై స్పష్టమైన హామీ వచ్చేంత వరకూ సమ్మె కొనసాగిస్తామని సచివాలయ సీమాంధ్ర ఫోరం కన్వీనర్ మురళీకృష్ణ, కార్యదర్శి కె.వి.కృష్ణయ్య తెలిపారు. విద్యుత్ సౌధలో పోటాపోటీ ఆందోళనలు సీమాంధ్ర, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీలు సోమవారం విద్యుత్ సౌధలో పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించాయి. సమ్మెలో పాల్గొంటున్న అసాంఘిక శక్తులపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కో ఆర్డినేటర్ రఘు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విద్యుత్‌సౌధకు వచ్చి మద్దతు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేదాకా ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించేది లేదని సీమాంధ్ర జేఏసీ చైర్మన్ సాయిబాబా స్పష్టం చేశారు. -
దద్దరిల్లిన సచివాలయం
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఉద్యోగుల ఆందోళనలతో శనివారం సచివాలయం దద్దరిల్లింది. రాష్ట్ర విభజనకు యూపీఏ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తూ సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు డీ బ్లాక్ భవనంపైకి ఎక్కి ఆందోళనకు దిగగా.. వారి తీరును ఇక తాము సహించబోమంటూ తెలంగాణ ఉద్యోగులు హెచ్చరిస్తూ ధర్నాకు దిగారు. దీంతో సచివాలయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యూపీఏ ప్రభుత్వం గుడ్డిగా రాష్ట్ర విభజనకు సిద్ధమైందని ఆరోపిస్తూ దాదాపు 200 మంది సీమాంధ్ర ఉద్యోగులు ముఖ్యమంత్రి కార్యాలయం సమీపంలోని డీ బ్లాక్ భవనంపైకి ఎక్కి ఆందోళనకు దిగారు. నల్లవస్త్రాలు ధరించి, చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని పెద్దపెట్టున నినాదాలు చేశారు. సచివాలయం లోపల ఆందోళనకు అనుమతి ఉన్నా మైకులు వాడకూడదనే నిబంధన ఉంది. కానీ సీమాంధ్ర ఉద్యోగులు మైకులు వాడటంతో తెలంగాణ ఉద్యోగ సంఘం ప్రతినిధులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సీమాంధ్ర ఉద్యోగులు భవనంపైకి ఎక్కుతున్న సమయంలో సచివాలయ భద్రతాధికారుల్లో ఒకరు వారి వెంట ఉండటం ఉద్రిక్తతకు కారణమైంది. దాదాపు రెండు గంటల పాటు మైకులు వాడుతూ భవనంపై నిరసన తెలిపినా పోలీసులు పట్టించుకోలేదని, సీమాంధ్ర ఉద్యోగులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ ఉద్యోగ సంఘం అధ్యక్షులు నరేందర్రావుతోపాటు, సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.పద్మాచారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)కి ఫిర్యాదు చేశారు. దీనిపై సంబంధిత అధికారులతో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటానని ఆయన వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఉద్యోగులు ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా నరేందర్‌రావు, పద్మాచారి మాట్లాడుతూ.. సీమాంధ్ర ఉద్యోగులను సోదరులుగా భావించినందునే ఇన్ని రోజులు వారి విషయంలో ఓపిక పట్టామని, సచివాలయంలో పనులకు విఘాతం కలిగేలా వారు చేస్తున్న చర్యలను ఇక సహించబోమన్నారు. ప్రభుత్వ మద్దతుతోనే వారు నిబంధనలు అతిక్రమించి సచివాలయం స్థాయిని గ్రామ సచివాలయం స్థాయికి తెచ్చారని ఆరోపించారు. దీన్ని అడ్డుకునేందుకు సోమవారం కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. తామే ప్రత్యక్ష చర్యలకు దిగుతామని, తమలపాకుతో అంటే తలుపు చెక్కతో సమాధానమిస్తామని హెచ్చరించారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయం.. సీమాంధ్ర ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా రాష్ట్ర విభజనకు సిద్ధమయ్యారని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారని సీమాంధ్ర ఉద్యోగుల సంఘం కార్యదర్శి కృష్ణయ్య అన్నారు. యూపీఏ తీరును ఎండగడతామని, ఇప్పటి వరకు సత్యాగ్రహం చేస్తున్న తాము ఇకపై సహాయనిరాకరణకు దిగుతామని ప్రకటించారు. సీమాంధ్ర ప్రజలెవరూ ప్రభుత్వానికి పన్నులు కట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు రేపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమ్మె చేస్తున్న ఉద్యోగ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సోమవారం చర్చలు జరపనుంది. ఈమేరకు ఆహ్వానం పంపింది. చర్చలకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నాయి. ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో భేటీ జరగనుంది. సమ్మె విరమింపజేసేందుకు ఉపసంఘం ఉద్యోగ సంఘాలతో మూడుసార్లు చర్చలు జరపడం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని కేంద్రం హామీ ఇచ్చేవరకు సమ్మె కొనసాగిస్తామని ఆ సంఘాలు చెప్పడం తెలిసిందే. ఇకపై ఉపసంఘం స్థాయి చర్చల్లో పాల్గొనబోమని, ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరపాలని ప్రకటించడమూ విదితమే. తెలంగాణ ఏర్పాటు నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ చర్చలకు పిలిచింది.