
సాక్షి, అమరావతి : అధికార పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌కు ఏపీ సచివాలయంలో చేదు అనుభవం ఎదురయ్యింది. పబ్లిసిటీ సెల్‌లో మీడియా సమావేశం నిర్వహించాలనుకున్న కనకమేడలకు ఐ అండ్ పీఆర్ అధికారులు అనుమతి నిరాకరించారు. కేవలం మంత్రులు, విప్‌ల మీడియా సమావేశాల నిర్వహణకు మాత్రమే సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌ని అనుమతిస్తారని అధికారులు తెలిపారు. పబ్లిసిటీ సెల్‌లో మీడియా సమావేశానికి అనుమతి నిరాకరించడంతో ఫోర్త్ బ్లాక్ బయట మీడియా సమావేశాన్ని నిర్వహించారు కనకమేడల.