సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో జూలై 31న రాష్ట్ర కేబినేట్ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా దాదాపు 40 నుంచి 50 అంశాల మీద రాష్ట్ర కేబినేట్ చర్చించనుంది. ఇటీవల రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, వరదలు సంభవించిన కారణంగా ప్రభుత్వ చర్యలపై ఈ కేబినేట్ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.
రైతాంగం వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో.. అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేయడంతో పాటు దీనిపై అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడం.. అలాగే యుద్ధప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధిరించడం కోసం చేపట్టనున్న చర్యలపై కేబినేట్ చర్చించనున్నట్లు సమాచారం.
చదవండి జీహెచ్‌ఎంసీ ఆఫీసులోకి కాంగ్రెస్ నేతలు.. లోపల కూర్చుని నిరసన
Comments
Please login to add a commentAdd a comment