సచివాలయంలో అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్ | fireengine department mockdrill at secratariat | Sakshi
Sakshi News home page

సచివాలయంలో అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్

Published Fri, Apr 17 2015 3:24 AM | Last Updated on Thu, Sep 13 2018 5:22 PM

సచివాలయంలో అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్ - Sakshi

సచివాలయంలో అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయంలో అగ్నిమాపక సిబ్బంది గురువారం మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్ని ప్రమాదం వంటి విపత్కర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి,  ఎలా రక్షించుకోవాలి అనే విషయాలపై ఉద్యోగులకు తగు సూచనలు చేశారు. వేసవి కాలం కావడంతో అకస్మాత్తుగా సంభవించే అగ్నిప్రమాదాల నిర్వహణపై సిబ్బందిని సమాయత్తం చేసేందుకు మాక్ డ్రిల్ నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.
 
ప్రమాద స్థలానికి దూసుకెళ్లే ‘బుల్లెట్ మిస్ట్’
ఇరుకైన ప్రాంతాల్లో ప్రమాదం జరిగితే అగ్నిమాపక సిబ్బంది వేగంగా చేరుకునేందుకు ‘బుల్లెట్ మిస్ట్’ అనే మోటార్ సైకిల్‌ను వినియోగించనున్నారు. అగ్నిమాపక వాహనం వచ్చేలోగా ‘బుల్లెట్ మిస్ట్’పై సిబ్బంది ప్రమాదస్థలానికి చేరుకుని మం టలను అదుపు చేసేందుకు ముందస్తు చర్యలు చేపడతారని అగ్నిమాపక శాఖ సంచాలకుడు పి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఇలాంటి వాహనాలు 4 మాత్రమే ఉన్నాయని, త్వరలోనే నగరంలోని అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. బుల్లెట్ మిస్ట్‌తోపాటు మిని వాటర్ టెండర్, వాటర్‌టెండర్, హజ్మత్ వాహనం, 54 మీటర్ల ఎత్తులో ప్రమాదం జరిగినా ఎదుర్కొనేలా రూపొందించిన ల్యాడర్‌ను ప్రదర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement