mockdrill
-
వ్యాక్సినేషన్ డ్రై రన్ ప్రారంభం
న్యూఢిల్లీ : దేశవ్యాప్త కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం త్వరలో ప్రారంభం కానుండగా సన్నాహకాల్లో భాగంగా సోమవారం డ్రై రన్ ప్రారంభమైంది. టీకా సరఫరా, పంపిణీ, వ్యాక్సినేషన్ మొదలుకొని ప్రతి అంశంపై పరిశీలన జరిపి, వాస్తవ వ్యాక్సినేషన్‌ను ఎలాంటి అవాంతరాలు లేకుండా అమలు చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. దేశంలోని ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో మొదలైన ఈ కార్యక్రమం రేపు కూడా కొనసాగనుంది. రెండు రోజుల ఈ కార్యక్రమం సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా విజయవాడ, గుజరాత్‌లోని గాంధీనగర్, రాజ్‌కోట్, పంజాబ్‌లోని లూధియానా, షహీద్ భగత్ సింగ్ నగర్ (నవాన్షహర్), అస్సాంలోని సోనిత్పూర్, నల్బరీ జిల్లాల్లో అమలైంది. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి అందిన సూచనల మేరకు.. డ్రై రన్లో భాగంగా డమ్మీ వ్యాక్సిన్‌ను సెంట్రల్ స్టోరేజీ కేంద్రం నుంచి వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కోల్డ్ చైన్ పాయింట్లకు తరలించారు. ఈ వివరాలను కో విన్ యాప్‌లో నమోదు చేశారు. ప్రతి జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లలో 25 మందికి చొప్పున డమ్మీ వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సమయంలో టీకా రవాణా సహా ప్రతి అంశానికి పట్టిన సమయాలను నమోదు చేశారు. కోవిడ్ కట్టడికి కేంద్ర హోం శాఖ గత∙మార్గదర్శకాల అమలును 2021 జనవరి 31 వరకు పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది మరో 20 వేల కొత్త కేసులు భారత్‌లో కొత్తగా మరో 20,021 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,02,07,871కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 97.82 లక్షలకు పెరిగిందని పేర్కొంది. 24 గంటల్లో మరో 279 మంది కోవిడ్‌తో మృతిచెందడంతో మరణాల సంఖ్య 1,47,901గా ఉంది. ప్రస్తుతం రికవరీ రేటు 95.83%, మరణాల రేటు 1.45%గా ఉంది. వరుసగా ఏడో రోజు కూడా యాక్టివ్ కేసుల సంఖ్య 3 లక్షలకు లోపే నమోదైంది. 16,88,18,054 శాంపిళ్లను పరీక్షించారు. -
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ఉత్కంఠ!
సమయం: బుధవారం సాయంత్రం 5:30 గంటలు ప్రదేశం: నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం (గత నెల 20న విద్యుత్ ప్రమాదం జరిగిన ప్రాంతం). సందర్భం: విద్యుత్ కేంద్రం బయట వర్షం. కేంద్రం ప్రవేశద్వారం వద్ద ఒక్కసారిగా ఎగిసిన మంటలు.. భయంతో అధికారులు, ఉద్యోగుల పరుగులు. సాక్షి, నాగర్‌కర్నూల్: అసలేం జరుగుతుందో తెలి యదు. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో క్షణాల వ్యవధిలోనే విద్యుత్ నిలిచిపోయింది. విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటికి పరుగులు తీశారు. అప్పటికే బయట కురుస్తున్న వర్షానికి తడిసి ముద్దయ్యారు. వెంటనే రంగంలో దిగిన అగ్నిమాపక వాహనం మంటల్ని ఆర్పింది. సుమారు గంటసేపు తీవ్ర ఉత్కంఠతో ఉన్న ఉద్యోగులు, అధికారులకు అదంతా మాక్‌డ్రిల్ అంటూ ఉన్నతాధికారుల నుంచి అందిన వార్త ప్రాణం పోసినట్టుయింది. గత నెల 20న అగ్నిప్రమాదం జరిగిన శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలోని నాలుగో యూనిట్లో పునరుద్ధరణ పనులు సాగుతున్నాయి. వంద మందికిపైగా ఉద్యోగులు, అధికారులు, కార్మికులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో విద్యుత్ కేంద్రం ప్రవేశద్వారం నుంచి నీళ్ల మోటార్ల లోడుతో వెళ్తున్న డీసీఎం.. నేల మీద ఉన్న విద్యుత్ తీగలపై నుంచి వెళ్లింది. దీంతో షార్ట్‌సర్క్యూట్ అయి ఒక్కసారిగా పెద్ద శబ్దాలతో మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే విద్యుత్ నిలిచిపోయింది. ఆ సమయంలో పునరుద్ధరణ పనులు చేస్తున్న సిబ్బంది అంతా అయోమయానికి గురై బయటికి పరుగుతీశారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక యంత్రం (ఫైర్ ఎక్స్టెన్షన్)తో మంటలను ఆర్పారు. విద్యుత్ కేంద్రంలో రెండోసారి జరిగిన ప్రమాదం వార్త వెంటనే సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులందరూ ఉలికిపడ్డారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై అనేక చర్చలు మొదలయ్యాయి. ఇలా సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు (గంట పాటు) ఉత్కంఠ నెలకొంది. తర్వాత ఇది మాక్‌డ్రిల్ అని తేలడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. మాక్‌డ్రిల్‌పై భిన్నాభిప్రాయాలు అధికారులు నిర్వహించిన ఈ మాక్‌డ్రిల్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 20న అగ్నిప్రమాదం జరిగిన తర్వాత అందులో పనిచేస్తున్న తమకు ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని అందులో పనిచేసే ఓ ఉద్యోగి తెలిపారు. 15 రోజుల క్రితం జరిగిన ప్రమాదం నుంచి ఇంకా తేరుకోని తమను మాక్‌డ్రిల్ పేరిట భయపెట్టే యత్నం చేయడం ఆవేదన కలిగించిందన్నారు. మరోవైపు బయట వర్షం కురుస్తున్న సమయంలో విద్యుత్ కేంద్రంలో మాక్‌డ్రిల్ ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా 15రోజుల నుంచి ఆ కేంద్రంలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో దోమలపెంట సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ కేంద్రానికి కేబుళ్లు వేసిన అధికారులు వాటి ద్వారా లైట్లు, మోటార్లు నడిపిస్తున్నారు. మాక్‌డ్రిల్‌తో ఆ కేబుళ్లు కాలిపోయాయి. తర్వాత రంగంలో దిగిన అధికారులు కేబుళ్లు మార్చి విద్యుదుత్పత్తిని పునరుద్ధరించారు. (ఇక్కడ ప్రమాదం జరిగింది.. నేను చనిపోవచ్చు.. ) ప్రమాదం కాదు.. మాక్‌డ్రిల్ శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. సిబ్బంది అప్రమత్తతను పరిశీలించేందుకే రహస్యంగా మాక్‌డ్రిల్ నిర్వహించాం. ఈ కేంద్రాన్ని పరిశీలించేందుకు విశ్రాంత అధికారి అజయ్‌తో కలిసి వెళ్లా. ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో తెలిపేందుకు ఈ కార్యక్రమం చేపట్టాం. – ప్రభాకర్‌రావు, సీఎండీ, టీఎస్ ట్రాన్ ్సకో, జెన్ కో -
తిరుమల : ఆక్టోపస్ మాక్‌డ్రిల్‌లో అపశృతి
సాక్షి,తిరుమల : మాక్‌డ్రిల్ చేస్తున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. పాంచజన్యం అతిథి గృహం వద్ద మాక్ డ్రిల్ చేస్తున్న సమయంలో ఆక్టోపస్ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు నాలుగో అంతస్థు నుంచి పడిపోయాడు. ట్రైనింగ్ సందర్భంగా జరుగుతున్న ఈ శిక్షణలో గాయపడిన కానిస్టేబుల్ గోయల్ సందీప్‌ను స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. -
సచివాలయంలో అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయంలో అగ్నిమాపక సిబ్బంది గురువారం మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్ని ప్రమాదం వంటి విపత్కర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, ఎలా రక్షించుకోవాలి అనే విషయాలపై ఉద్యోగులకు తగు సూచనలు చేశారు. వేసవి కాలం కావడంతో అకస్మాత్తుగా సంభవించే అగ్నిప్రమాదాల నిర్వహణపై సిబ్బందిని సమాయత్తం చేసేందుకు మాక్ డ్రిల్ నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ప్రమాద స్థలానికి దూసుకెళ్లే ‘బుల్లెట్ మిస్ట్’ ఇరుకైన ప్రాంతాల్లో ప్రమాదం జరిగితే అగ్నిమాపక సిబ్బంది వేగంగా చేరుకునేందుకు ‘బుల్లెట్ మిస్ట్’ అనే మోటార్ సైకిల్‌ను వినియోగించనున్నారు. అగ్నిమాపక వాహనం వచ్చేలోగా ‘బుల్లెట్ మిస్ట్’పై సిబ్బంది ప్రమాదస్థలానికి చేరుకుని మం టలను అదుపు చేసేందుకు ముందస్తు చర్యలు చేపడతారని అగ్నిమాపక శాఖ సంచాలకుడు పి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఇలాంటి వాహనాలు 4 మాత్రమే ఉన్నాయని, త్వరలోనే నగరంలోని అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. బుల్లెట్ మిస్ట్‌తోపాటు మిని వాటర్ టెండర్, వాటర్‌టెండర్, హజ్మత్ వాహనం, 54 మీటర్ల ఎత్తులో ప్రమాదం జరిగినా ఎదుర్కొనేలా రూపొందించిన ల్యాడర్‌ను ప్రదర్శించారు.