AP: సచివాలయ ఉద్యోగులపై పోలీసుల దుశ్చర్య! | AP Police Over Action With Secretariat Employees | Sakshi
Sakshi News home page

AP: సచివాలయ ఉద్యోగులపై పోలీసుల దుశ్చర్య!

Published Fri, Nov 29 2024 10:04 AM | Last Updated on Fri, Nov 29 2024 10:49 AM

AP Police Over Action With Secretariat Employees

సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కఓ సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉద్యోగుల డిన్నర్ సమావేశంపై పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు. వారిని ఇబ్బందులకు గురిచేశారు.

రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు. ఉద్యోగుల డిన్నర్ సమావేశంపై పోలీసులు దాడులు చేశారు. డిన్నర్ చేస్తున్న సమయంలో 50 మంది వరకు పోలీసులు.. ఉద్యోగులను చుట్టుముట్టారు. ప్లాన్ ప్రకారం డిన్నర్ పార్టీపై ఏడు పోలీసు స్టేషన్ల సిబ్బంది దాడులు చేయడం గమనార్హం. అంతటితో ఆగకుండా అక్కడ మద్యం బాటిళ్లు ఉన్నాయని ఉద్యోగులపై పోలీసులు కేసులు పెట్టారు.

అనంతరం, ఉద్యోగులను పోలీసులు పోలీసు స్టేషన్కు తరలించారు. గురువారం అర్ధరాత్రి వరకు వారిని పీఎస్ లోనే ఉంచారు. దాదాపు మూడు గంటల పాటు సచివాలయ ఉద్యోగులను స్టేషన్ లోపలే బంధించారు. 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులను వేధిస్తున్నారని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉద్యోగులను వేధించకుండా తనపై కేసు పెట్టాలని వెంకట్రామిరెడ్డి తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement