
భీమదేవరపల్లి: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఉపయోగించిన కారును హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని ఆయన స్వగృహానికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. పీవీ నరసింహారావు 1980 ప్రాంతంలో ఈ కారును కొనుగోలు చేసినట్లు పీవీ సోదరుడి కుమారుడు పీవీ మదన్‌మోహన్ తెలిపారు.
ఇంతకాలం కారు హైదరాబాద్‌లో ఉండగా.. ఇటీవల ఆయన కుటుంబ సభ్యులు పీవీ ఉపయోగించిన కారు, కంప్యూటర్, టీవీ, కుర్చీ, మంచం తదితర వస్తువులను వంగరకు తీసుకొచ్చారు. కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉంది. పీవీ 18వ వర్ధంతి సందర్భంగా వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు శుక్రవారం వంగరలోని ఆయన ఇంటిని సందర్శించి.. ఆవరణలో నిలిపిన కారును ఆసక్తిగా తిలకించారు.
Comments
Please login to add a commentAdd a comment