వంగరలో పీవీ స్మృతివనానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, దయాకర్‌రావు, ఎంపీ కె.కేశవరావు
సాక్షిప్రతినిధి, వరంగల్: మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహారావు ఒక కీర్తి శిఖరం అని మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ కె.కేశవరావు పేర్కొన్నారు. శుక్రవారం పీవీ నరసింహారావు స్వగ్రామం అయిన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో పీవీ విజ్ఞాన వేదిక, స్మృతి వనం, మ్యూజియంలకు వారు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొ న్నారు. పీవీ స్మృతివనాన్ని నాలుగున్నర ఎకరాల్లో, 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తామని, సంవత్సరంలోపు పూర్తి చేస్తామని చెప్పా రు. వంగర గ్రామాన్ని పర్యాటకపరంగానూ అభివృద్ధి చేస్తామన్నారు.
మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ పీవీ నరసింహారావు దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఎంపీ కేశవరావు మాట్లాడుతూ పీవీ జ్ఞాపకాలను పదిలపరచాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రాజ్య సభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీ కాంతరావు, పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, హుస్నా బాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, ఎండీ మనో హర్, పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment