Kesava Rao
-
పీవీ నరసింహారావు ఒక కీర్తి శిఖరం
సాక్షిప్రతినిధి, వరంగల్: మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహారావు ఒక కీర్తి శిఖరం అని మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ కె.కేశవరావు పేర్కొన్నారు. శుక్రవారం పీవీ నరసింహారావు స్వగ్రామం అయిన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో పీవీ విజ్ఞాన వేదిక, స్మృతి వనం, మ్యూజియంలకు వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొ న్నారు. పీవీ స్మృతివనాన్ని నాలుగున్నర ఎకరాల్లో, 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తామని, సంవత్సరంలోపు పూర్తి చేస్తామని చెప్పా రు. వంగర గ్రామాన్ని పర్యాటకపరంగానూ అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ పీవీ నరసింహారావు దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఎంపీ కేశవరావు మాట్లాడుతూ పీవీ జ్ఞాపకాలను పదిలపరచాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రాజ్య సభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీ కాంతరావు, పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, హుస్నా బాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, ఎండీ మనో హర్, పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. -
జనం లేని సేన.. జనసేన: నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వరద బాధితులకు కేంద్రం ఎలాంటి సాయం చేయలేదని మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముంబై, బెంగళూరులో వరదలు వస్తే రూపాయి సాయం చేశారా? అని ప్రశ్నించారు. ‘‘వరద బాధితులను కేసీఆర్ సర్కార్ ఆదుకుంటే బీజేపీ ఆరోపణలు చేస్తోంది. హైదరాబాద్‌లో మేం సాయం చేస్తే అడ్డుకుంటారా?’’ అంటూ మంత్రి నిప్పులు చెరిగారు. జనం లేని సేన జనసేన.. సైన్యం లేని నాయకుడు పవన్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ వ్యతిరేకులు ఒక్కటవుతున్నారని, ఎందరు కలిసినా ప్రజలు టీఆర్ఎస్నే ఆదరిస్తారని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయమని నిరంజన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. (చదవండి: టీఆర్ఎస్ భయపడుతుంది: బండి సంజయ్) నిజమైన హిందువు కేసీఆరే: కేకే నిజమైన హిందువు కేసీఆరేనని టీఆర్ఎస్ నేత కేకే అన్నారు. మనుషులంతా ఒక్కటే అన్నది టీఆర్ఎస్ విధానమని తెలిపారు. బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు దేశంలో ఎక్కడా లేనివిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 85 సీట్లు బీసీలకు కేటాయించామని చెప్పారు. టికెట్ల కేటాయింపులో అన్ని వర్గాల వారికి న్యాయం చేశాం. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని కేకే పేర్కొన్నారు. (చదవండి: పవన్ కళ్యాణ్‌పై బాల్కసుమన్ సెటైర్లు) -
70 ఏళ్లు వెనుకబాటుకు గురయ్యాం
సాక్షి, న్యూడిల్లీ: 70 ఏళ్లు తీవ్ర వెనుకబాటుతనానికి, దోపిడీకి గురైన తెలంగాణకు విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై కేంద్రం దృష్టి సారించా లని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హామీల అమలుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఎంపీలు కె.కేశవరావు, బండ ప్రకాశ్ మాట్లాడారు. కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఏర్పాటైన వెంటనే రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఉన్న పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఏపీలో కలిపారని, దీనివల్ల సీలేరు విద్యుత్ ప్రాజెక్టును రాష్ట్రం కోల్పోవాల్సి వచ్చిందని కేకే అన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఏపీ ఇవ్వాల్సిన 6 వేల మెగావాట్ల విద్యుత్‌కు బదులు 1,600 మెగా వాట్లే ఇచ్చినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. పోలవరానికి తాము వ్యతిరేకం కాదని, తెలంగాణకు కలిగే నష్టానికే వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణలో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు చేయలేదన్నారు. ఏపీకి హామీల అమలుపై ఎలాంటి అభ్యంతరం లేదని, చట్టంలో రెండు రాష్ట్రాలకు ఇచ్చిన వాటిని కేంద్రం అమలు చేయాలన్నారు. హామీలపై సమాధానం చెప్పండి.. విభజన చట్టం తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలకు సంబంధించిందని బండ ప్రకాశ్ పేర్కొన్నారు. ఏపీకి అమలు కావాల్సిన హామీలనే కాకుండా తెలంగాణకు అమలు కావాల్సిన హామీలపై కూడా కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. చట్టంలో రాష్ట్రానికి బయ్యా రం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, హార్టీ్టకల్చర్, గిరిజన వర్సిటీలు, 400 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు బాధితులకు పునరావాసం, కాళేశ్వరం ప్రాజెక్టు నిధులు మంజూ రు కావాల్సి ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 37 లక్షల ఎకరాలకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను చేపడుతున్నామని చెప్పారు. కేంద్రం ఏపీ హామీల అమలుపై చర్చించి తెలంగాణ హామీలపై స్పందించకపోవడం సరికాదన్నారు. తెలంగాణ తీవ్ర వెనుకబాటుతనానికి గురైందని, ఎన్నో పోరాటాలతో సాధించుకున్న రాష్ట్రానికి ఇప్పటికీ కూడా నీళ్లు లేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును దేశమంతా ప్రశంసిస్తోందని, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినట్లు నిధులను కేంద్రం విడుదల చేయాలని కోరారు. -
రైట్ రాయల్‌గా కొనుక్కున్నా: కేకే
సాక్షి, హైదరాబాద్: ఇబ్రహీంపట్నంలో భూమికి సంబంధించి అన్నీ పరిశీలించిన తర్వాతే రైట్ రాయల్‌గా కొనుక్కున్నానని రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ నేత కె.కేశవరావు చెప్పారు. ఆదివారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇబ్ర హీంపట్నంలో భూమి కొన్న విషయం వాస్తవమని, దానికి సంబంధించి అన్ని పత్రాలూ ఉన్నాయన్నారు. ఆ భూమిని 2011లో కొన్నానని, అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉందని, టీఆర్ఎస్కు సంబంధం లేదని చెప్పారు. శంషాబాద్‌లో భూమి కొన్నట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవమని, అక్కడ ఒక్క సెంటు కూడాలేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొనుగోలు చేసిందేమీ లేదని, ఆ భూమి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేకే అన్నారు. -
పుట్టుక నుంచి చావు వరకు...అన్నింటిలోనూ కేసీఆర్ ముద్ర
ప్రజల అవసరాలను గుర్తిస్తున్న సీఎం: కేశవరావు హన్మకొండ: తెలంగాణ రాష్ట్రం లో మనిషి పుట్టిన నాటి నుంచి చావు వరకు.. అందరు ప్రజల అన్ని అవసరాలూ సీఎం కేసీఆర్ చూసుకుంటున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. హన్మకొండలో గురువారం జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభలో కె.కేశవరావు మాట్లాడారు. తెలంగాణను రైతు సమాజంగా మార్చాలన్న ధ్యేయంతో దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏటా రెండు పంటలకు ఎకరానికి రూ.4 వేల చొప్పున పెట్టుబడికి ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణను రైతు రాజ్యంగా మారుస్తున్నారన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రమంతా చీకటి మయంగా ఉందని, ప్రధాన సమçస్య అయిన విద్యుత్‌ను అనతికాలం లోనే పరిష్కరించారన్నారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ తోపాటు, ఇతర అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగు తోందని చెప్పారు. నాటి పాలకులు చెరువులు, కుంటల బాగోగులను విస్మరించగా.. కాకతీయులను స్ఫూర్తిగా తీసుకున్న కేసీఆర్ మిషన్ కాకతీయ పేరుతో చెరువులు, కుంటలను పటిష్టం చేశారన్నారు. ఆకాశాన్నైనా బద్దలు కొట్టి తెలంగాణ తెస్తానని ఇదే వేదికపై చెప్పారని.. నాడు అన్న మాటను నిజం చేశారన్నారు. రాష్ట్ర ప్రగతిని అశేష జనవాణికి వివరించడానికి ఈ సభను ఏర్పాటు చేశామన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ కంకణబద్దులై ముందుకు సాగుతున్నారని కేకే అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు బలం పెరిగిందని విర్రవీగడం లేదని, బాధ్యత పెరిగినట్లుగా భావిస్తున్నామని తెలిపారు. -
కేసీఆర్‌తో భేటీ కానున్న కేకే, ఇతర నేతలు
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆపార్టీ నేత సీనియర్ నేత కేశవరావు, ఇతర ముఖ్యనేతలు భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా కేసీఆర్ ప్లీనరీ తీర్మానాలను ఖరారు చేయనున్నారు. ఈ నెల 24న జరిగే టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల్లో 11కు పైగా తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. -
సమగ్ర సమాచారం ముఖ్యం
ప్రజావాణిలో ఏజేసీ చెన్నకేశవరావు చిలకలపూడి(మచిలీపట్నం) : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారంపై అధికారులు సమగ్ర సమాచారంతో హాజరు కావాలని అడిషనల్ జాయింట్ కలెక్టర్ బీఎల్.చెన్న కేశవరావు సూచించారు. కలెక్టరేట్లోని సమా వేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏజేసీతో పాటు డీఆర్వో ఎ.ప్రభావతి, బందరు ఆర్డీవో సాయిబాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఏజేసీ మాట్లాడుతూ అధికారులంతా ప్రజావాణిలో వచ్చిన అర్జీల సమస్యలను పరిష్కరించేందుకు సత్వరమే స్పందించాలని కోరారు. మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం, వికలాంగుల సంక్షేమశాఖ ఏడీ కేవివి. సత్యనారాయణ, డీఎస్వో పిబి.సంధ్యారాణి, బీసీ సంక్షేమాధికారి లక్ష్మీదుర్గ, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ మారుతీదివాకర్ తదితర అధికారులు పాల్గొన్నారు. అర్జీలు ఇవే : బంటుమిల్లి మండలం రామవరపుమోడి గ్రామంలో రేషన్‌షాపును ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అర్జీ ఇచ్చారు. గూడూరు మండలం మల్లవోలు గ్రామంలోని ప్రభుత్వం ఉన్నత పాఠశాల ప్రహరీగోడ సమీపంలో ఏర్పాటు చేసిన మద్యంషాపును తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన కూనపరెడ్డి పాండు రంగారావు వినతి పత్రమిచ్చారు. ఘంటసాల మండలం పాపవినాశనం గ్రామంలో ఉన్న ఇసుక క్వారీని ప్రభుత్వం పునరుద్ధరించాలని గ్రామ సర్పంచి డొక్కు లక్ష్మి అర్జీ ఇచ్చారు. బందరు మండలం మంగినపూడి పరిసర ప్రాంతాల్లో గొర్రెలు, మేకలు సంచరిస్తే జరి మానాలు విధిస్తున్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలని మురళీకృష్ణ గొర్రెల, మేకల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షుడు జి.వాకాలయ్య వినతిపత్రం అందించారు. మైనార్టీలకు కేటాయించిన బడ్జెట్ దుర్వినియోగం అవ్వకుండా... సబ్‌ప్లాన్ అమలు చేయాలని కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అన్వర్‌హుస్సేన్, దాదాసాహెబ్, షేక్ రబ్బాని అర్జీ ఇచ్చారు. సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల్లోని విద్యార్థులకు జొన్న బిస్కట్లు, జొన్నతో తయారు చేసిన ఇడ్లీ, జొన్నతో తయారు చేసిన అన్నం ప్రభుత్వ ఖర్చులతో అందించాలని ప్రముఖ న్యాయవాది కంచర్లపల్లి శివప్రసాద్ వినతి పత్రమిచ్చారు. సర్వశిక్షా అభియాన్ ద్వారా జిల్లాలో పని చేస్తున్న పార్ట్‌టైమ్ ఇన్స్ట్రక్టర్లకు నియామక పత్రాలు ఇచ్చి, బకాయిలు చెల్లించాలని ఆర్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, వర్క్ ఎడ్యుకేషన్, పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ఎన్.దేవేంద్రరావు అర్జీ ఇచ్చారు. రైతుల ఆత్మహత్యలకు సంబంధించి రైతుల కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు జారీ చేసిన జీవో నెంబరు 421ను జిల్లాలోని ఆర్డీవోలు, సబ్కలెక్టర్లు అమలు చేయాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ వినతి పత్రం సమర్పించారు. -
తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్‌కు లేదు: కేకే
తెలంగాణ ఇచ్చామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడం ఓ పెద్ద జోక్ అని టీఆర్ఎస్ నాయకుడు కె.కేశవరావు అన్నారు. అసలు తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్‌కు లేదని, ఉద్యమాల వల్లే తెలంగాణ వచ్చిందని ఆయన చెప్పారు. తెలంగాణ మంత్రులు ఎప్పుడూ ఉద్యమాలు చేయలేదని ఆయన అన్నారు. తాము సెటిలర్లకు వ్యతిరేకం కాదని తెలిపారు. రాష్ట్రంలో ఇంకా గవర్నర్ పాలన కొనసాగించడంపై తాము సుప్రీంకోర్టులో కేసు వేస్తామని కేకే అన్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనమైతే తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయనే తాము దూరంగా ఉన్నామని, తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆరే సరైన వ్యక్తి అని చెప్పారు. -
కెకె మీడియా సమావేశం 17th July 2013