జనం లేని సేన.. జనసేన: నిరంజన్‌రెడ్డి | Telangana Minister Niranjan Reddy Comments On BJP | Sakshi
Sakshi News home page

సాయం చేస్తే అడ్డుకుంటారా..?

Published Sat, Nov 21 2020 5:32 PM | Last Updated on Sat, Nov 21 2020 7:00 PM

Telangana Minister Niranjan Reddy Comments On BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరద బాధితులకు కేంద్రం ఎలాంటి సాయం చేయలేదని మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముంబై, బెంగళూరులో వరదలు వస్తే రూపాయి సాయం చేశారా? అని ప్రశ్నించారు. ‘‘వరద బాధితులను కేసీఆర్ సర్కార్‌ ఆదుకుంటే బీజేపీ ఆరోపణలు చేస్తోంది. హైదరాబాద్‌లో మేం సాయం చేస్తే అడ్డుకుంటారా?’’ అంటూ మంత్రి నిప్పులు చెరిగారు. జనం లేని సేన జనసేన.. సైన్యం లేని నాయకుడు పవన్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ వ్యతిరేకులు ఒక్కటవుతున్నారని, ఎందరు కలిసినా ప్రజలు టీఆర్‌ఎస్‌నే ఆదరిస్తారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయమని నిరంజన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. (చదవండి: టీఆర్‌ఎస్‌ భయపడుతుంది: బండి సంజయ్)‌

నిజమైన హిందువు కేసీఆరే: కేకే
నిజమైన హిందువు కేసీఆరేనని టీఆర్‌ఎస్‌ నేత కేకే అన్నారు. మనుషులంతా ఒక్కటే అన్నది టీఆర్‌ఎస్‌ విధానమని తెలిపారు. బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు దేశంలో ఎక్కడా లేనివిధంగా రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ పెట్టామని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 85 సీట్లు బీసీలకు కేటాయించామని చెప్పారు. టికెట్ల కేటాయింపులో అన్ని వర్గాల వారికి న్యాయం చేశాం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని కేకే పేర్కొన్నారు. (చదవండి: పవన్‌ కళ్యాణ్‌పై బాల్కసుమన్‌ సెటైర్లు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement