పద్మ అవార్డులకు తెలంగాణ నుంచి 26 పేర్లు | t government recommends 26 names for padma awards | Sakshi
Sakshi News home page

పద్మ అవార్డులకు తెలంగాణ నుంచి 26 పేర్లు

Published Thu, Jan 8 2015 7:14 PM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM

t government recommends 26 names for padma awards

కేంద్రం అందించే పద్మ అవార్డులకు తెలంగాణ ప్రభుత్వం 26 మంది ప్రముఖుల పేర్లను సిఫార్సు చేసింది. దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను... దేశానికి ప్రధానిగా సేవలందించిన తెలంగాణ ప్రాంత వ్యక్తి పీవీ నరసింహారావుకు ఇవ్వాలని టీ- సర్కారు కేంద్రాన్ని కోరింది.

ప్రొఫెసర్ జయశంకర్ కు పద్మ విభూషణ్, ఇగ్నో, ఆంధ్రా యూనివర్సిటీల సార్వత్రిక విశ్వవిద్యాలయాల తొలి వీసీ ప్రొఫెసర్ జి.రామిరెడ్డికి పద్మ భూషణ్ అవార్డులు ఇవ్వాలని తెలంగాణ సర్కారు సిఫార్సు చేసింది. ఇంకా.. ప్రభుత్వం సిఫార్సు చేసిన వారిలో డాక్టర్ ఎన్.గోపి, చుక్కా రామయ్య, మిథాలీ రాజ్, సుద్దాల అశోక్ తేజల పేర్లున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement