కల్లోల కాలాలను గెలిచిన తెలంగాణ బిడ్డ పీవీ | PV narasimha rao thoughts have become as telangana baby | Sakshi
Sakshi News home page

కల్లోల కాలాలను గెలిచిన తెలంగాణ బిడ్డ పీవీ

Published Wed, Dec 31 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM

రాజమోహన్ గాంధీ

రాజమోహన్ గాంధీ

దేశ ప్రధానిగా పీవీ నరసింహారావు వేసిన బాట మోదీ దాకా కొనసాగిందంటే ప్రపంచదేశాలలో భారత్ అస్థితాన్ని నిలపటంలో ఈ తెలంగాణ బిడ్డడి ఆలోచనలు కీలకమని స్పష్టంగా నిర్ధారణ అయింది. పీవీని స్మరించుకోవటమంటే ఇప్పుడున్న పరిస్థితులలో దేశాన్ని ఏ దిశగా తీసుకుపోవాలని ఆలోచించడమే.  
 
 ఇది డిజిటల్ యుగం. ఇది మార్కెట్ ప్రపంచం. ప్రపంచం నిత్యయుద్ధాల నిత్య సం ఘర్షణల సమాహారం. అందుకే ప్రపంచాన్ని కూడా మనం సమతుల్యంగా ఉంచు కోవాలి. సమతుల్యత దెబ్బతింటే వ్యవస్థలు తిరగబడ తాయి. దేశాలు తలకిందు లవుతాయి. సమాజాలు కకావికలవుతాయి. ఇలాంటి సమయాల్లోంచే దార్శనికులు పుట్టుకుని వస్తారు. ఇలా కాలానికి పాఠం చెప్పగల దార్శనికులతోటే చరిత్ర గమనం సాగుతుంది. కొన్ని సందర్భాలలో కొందరు చేసే పనులు విమర్శలకు గురికావచ్చును. అవే భవిష్యత్తులో తిరిగి ప్రయోజనాలుగా నిలిచిపోవచ్చును. ఫలితాలను పక్కనబెట్టి చూస్తే సంబంధిత కాలానికి సంబంధిత సందర్భం అన్నదే ముఖ్యమైనది.
 
 మన కాలంలో దేశంలో ఏర్పడ్డ అనేక కల్లోల కాలాల సందర్భాలను జయించిన అతి కొద్దిమంది రాజకీయ నేతలలో పీవీ నర్సింహారావు ఒకరు. ఇప్పుడు ప్రపంచం అంతా ప్రపంచీకరణకు పల్లవిగా మారిపోయింది. కమ్యూ నిస్టు ప్రభావిత దేశాలు కూడా ప్రపంచీకరణ పంచన చేరిపోయి తమ దేశ ఆర్థిక వ్యవస్థలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజీవ్ గాంధీ హత్యానంతరం దేశంలో ఏర్పడ్డ సంక్షోభాన్ని పరిష్కరించే పనికి పీవీ నర్సింహారావు నడుంకట్టడంతో ఆనాటికి ఆయన ఆపద మొక్కులవాడయ్యాడు. పీవీ ప్రపంచీకరణ విధానాలు దేశంలో ఒక రకమైన స్థితిగతులను ఏర్పరిచాయి. వాటి వల్ల పొందిన లాభ నష్టాలు కూడా ఉన్నాయి. అది వేరే విషయం.
 
 ఈ ఆదివారం (28-12-2014) సీనియర్ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి హైదరాబాద్‌లో పీవీ స్మారకోప న్యాసం ఏర్పాటు చేశారు. దానికి గాంధీ మహాత్ముడి మనవడు రాజమోహన్ గాంధీ విచ్చేశారు. ఆ సం దర్భంగా పలువురు చేసిన ఉపన్యాసాలన్నీ విన్నాక పీవీకి సంబంధించిన వ్యక్తిత్వం మననం చేసుకోవటం జరి గింది. తాను పుట్టిన తెలంగాణకు అంతగా సేవ చేయ లేకపోయినప్పటికినీ దేశాన్ని మాత్రం విపత్తు నుంచి కాపాడేందుకు ప్రధాన మంత్రిగా కృతకృత్యుడైనాడు. పీవీ నరసింహారావు బహుజన వర్గాల అభివృద్ధికి తన వంతు కృషి చేసినట్లు ఆనాటి స్మారకోపన్యాసంలో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అప్పటి ముఖ్య మంత్రిగా ఉన్న పీవీ 40 శాతం మంది బీసీలకు చట్ట సభలలోకి వచ్చేందుకు సీట్లు ఇచ్చారు. పీవీ వేసిన దారిలో ఆ తర్వాత కాంగ్రెస్ నడవలేకపోయింది కానీ ఆయన వేసిన బాటలో నడచిన ఎన్టీఆర్ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై బలమైన ముద్రవేయ గలిగాడు.
 
 తెలంగాణ మట్టి నుంచి ఎదిగొచ్చిన పీవీ ఏ శాఖలో పనిచేసినా ఆ శాఖకు వన్నె తెచ్చాడు. దేశంలో గురుకుల విద్యా వ్యవస్థను నెలకొల్పి విద్యారంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. కేంద్ర విద్యా శాఖ పేరును తొలగించి ఆ శాఖను మానవ వనరుల శాఖగా తీర్చి దిద్దాడు. బహుభాషలలో పండితుడైన పి.వి. తెలుగు భాషపట్ల అపరిమితమైన ప్రేమ కలవాడు. తెలుగు భాష కొనసాగింపునకు ఏం చేయాలో ఆలోచనలు చేసినవాడు. పి.వి. నరసింహారావును స్మరించుకోవటమంటే ఇప్పు డున్న పరిస్థితులలో దేశాన్ని ఏ దిశగా తీసుకుపోవాలని ఆలోచించడమే. పి.వి. స్మారకోపన్యాసం ద్వారా దేశం దశదిశను మార్చటానికి కొత్త ఆలోచనలు చేయాలి. ప్రస్తుత ప్రధాని మోదీ కొనసాగిస్తున్న విధానాలు పీవీ ఆలోచనలకు కొనసాగింపా? కాదా? అన్న విషయం చర్చనీయాంశంగా మారింది.
 
 పీవీ సరళీకరణ విధానాలే దేశాన్ని గట్టెక్కించా యని పాలకపక్షాలు చెబుతుంటే, దేశంలో ప్రస్తుతస్థితికి, పలు రంగాలలో నిరాసక్తతకు పీవీ విధానాలే కారణమన్న బలమైన వాదనలూ ఉన్నాయి. మొత్తం మీద దేశానికి మంచో చెడో ఏదో ఒకటి మాత్రం పీవీ చేయగలిగాడు. పీవీ నాయకుడిగా వేసిన బాట మోదీ దాకా కొన సాగిందంటే ప్రపంచదేశాలలో భారత్ అస్థిత్వాన్ని నిల పటంలో ఈ తెలంగాణ బిడ్డడి ఆలోచనలు కీలకమని స్పష్టంగా నిర్ధారణ అయింది. దేశానికి గొప్ప పేరు ప్రతిష్టలు తేగలిగిన వాడు. చివరకు తన సొంత పార్టీ నుం చి తీవ్ర నిరాదరణకు గురయ్యారు. ఒక దేశ ప్రధానిగా పని చేసిన వ్యక్తికి లభించాల్సిన ఆదరణ లభించలేదని ఇతర రాజకీయ పార్టీలు ప్రశ్నించాయి.
 
 పీవీ తెలంగాణకు చేయాల్సింది చేయలేకపోయినా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మాత్రం ఆయనను గౌరవించి సమున్నతంగా నిలిపింది. భారతదేశంలో సరళీకరణల మార్పులు తెచ్చిన వ్యక్తిగా పి.వి. దేశమంత ఎత్తు ఎదిగిన వాడు. దేశమంతా బ్రహ్మ రథం పడుతుంటే ఆయనను నిలువునా ప్రశ్నించగలిగింది కూడా తెలంగాణ సమాజమే. పీవీ వ్యక్తిత్వం విభిన్నమైనది. మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థిక వేత్తను తెరపైకి తీసుకువచ్చి ప్రపం చీకరణకు దారులు తెరి చారు. పీవీ రాజకీయరంగంలో అపర చాణుక్యుడిగా పేరు గడించాడు.
 
పీవీ తన ఆలోచనలతో దేశానికి దడపుట్టించగలి గాడు కానీ వ్యక్తిగతంగా కాళోజీని చూసి వణికిపోయాడు. దేశానికి నాయకునిగా చలామణి కాగలిగినా కాళోజీ ఇంట్లో పిల్లవానిగానే వ్యవహరించాడు. స్మారకోపన్యా సాలు, సంతాప సందేశాలు కాదు. స్మార కోపన్యాసాలు దేశానికి కొత్త ఆలోచనలు అందించేందుకు దోహద కారులుగా నిలుస్తాయి. విద్యారంగంలో మరిన్ని విప్లవా త్మక మార్పులకు పీవీ చూపిన దారిలో మరింత ముందుకుపోవలసి ఉంది.
 (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు)
 - చుక్కా రామయ్య

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement