గాంధీభవన్‌లో జరిగిన పీవీ జయంతి వేడుకల్లో ఉత్తమ్, పొన్నం ప్రభాకర్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ఆదివారం గాంధీభవన్‌లో పలువురు కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్యెల్యే శ్రీధర్‌బాబు, కార్య నిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావ్ తదితరులు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం దేశానికి పీవీ చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ తెలంగాణ సమాజం లోని అన్ని వర్గాల మనసుల్లో చిరస్థాయిగా ఉన్న వ్యక్తి పీవీ అని కొనియాడారు. ఎవరో ఇప్పుడు ఆయన జయంతి వేడుకలు చేస్తున్నారని రాష్ట్ర ప్ర భుత్వాన్ని పరోక్షంగా విమర్శించిన ఉత్తమ్, అయి నా తాము గర్విస్తామని, స్వాగతిస్తామన్నారు.
గీతారెడ్డి చైర్మన్‌గా కమిటీ ఏర్పాటు
పీవీ శతజయంతి వేడుకల నిర్వహణకుగాను మా జీ మంత్రి గీతారెడ్డి చైర్మన్‌గా, మంథని ఎమ్యెల్యే శ్రీధర్‌బాబు వైస్ చైర్మన్‌గా 15 మంది సభ్యులు, ముగ్గురు సలహాదారులతో ఉత్తమ్ కమిటీ ఏర్పాటు చేశారు. కాగా, దిగవంత పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను ఏడాదిపాటు జరపాలని సోనియా గాంధీ ఆదేశాలిచ్చారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఉమ్మడి రాష్ట్రంలోనే తీర్మానం చేశామని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని పార్లమెంట్‌లో కూడా కోరతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment