geethareddy
-
డాక్టర్ గీతారెడ్డి బోర: స్టార్టప్ దిశగా అంకురం!
'సమాజం మారాలి.. సమాజంలో మార్పు రావాలి. సమాజంలో మార్పు తేవాలి. ఈ ప్రసంగాలు వింటూనే ఉంటాం. మారాలని అందరూ కోరుకుంటారు. మార్పు కోసం ఏం చేయాలో తెలిసిన వాళ్లెందరు? సమాజం మారాలంటే ఏం చేయాలో తెలిసి ఉండాలి. ఆ మార్పు మనతోనే మొదలు... అనుకోవాలి. మార్పు దిశగా తొలి అడుగు వేయగలిగిన చొరవ ఉండాలి. అలా డిజిటల్ ఎరాలోకి అడుగుపెట్టారు డాక్టర్ గీత. తన పాదముద్రలతో అభివృద్ధి దారి చూపిస్తున్నారు.' ఈ డిజిటల్ యుగంలో దాదాపుగా అందరూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే. ఇలాంటి డిజిటల్ ఎరాను ముందుగానే ఊహించి సమాజాన్ని ప్రభావితం చేసిన సోషల్ ఇన్ఫ్లూయెన్సర్ గీతాబోర. ప్రపంచదేశాలన్నీ ఒక తాటిమీదకు వచ్చి ఒకేరకమైన నైపుణ్యాలతో గ్లోబల్ వేదిక మీద పోటీ పడుతున్న తరుణంలో మన గ్రామీణ విద్యార్థుల్లో ఎంతమంది ఈ పోటీలో నిలవ గలుగుతున్నారనే ప్రశ్న వేసుకుని అందుకు సమాధానంగా కమ్యూనికేషన్, లాంగ్వేజ్ స్కిల్స్‌లో శిక్షణ అవసరాన్ని గుర్తించారామె. క్యాంపస్ రిక్రూట్మెంట్లో ప్లేస్మెంట్ దొరక్క మిగిలిపోయిన పిల్లలు బీపీవోల్లో నైట్ షిఫ్ట్ ఉద్యోగాల్లో ఉపాధిని వెతుక్కోవాల్సి రావడం, క్రమంగా నైట్‌లైఫ్‌కు అలవాటు పడిపోవడం, యువశక్తి నిరీ్వర్యం కావడంతోపాటు సమాజంలో చాపకింద నీరులా వ్యసనాలు విస్తరించడాన్ని గ్రహించారు. అలాగే చదువుకున్న ప్రతి ఒక్కరూ పట్టా చేతపట్టుకుని ఉద్యోగం కోసం ఎదురు చూడడం కాదు సొంతంగా తమను తాము నిరూపించుకునే ప్రయత్నం చేయాలని, స్టార్టప్ దిశగా నడవడానికి విద్యార్థి దశలోనే ఈ ఆలోచనకు అంకురం వేయాలని ఆలోచించారు. వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ఉన్నత విద్యాశాఖ సమన్వయంతో సరి్టఫికేట్ కోర్సుకు రూపకల్పన చేశారు. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా సమాజానికి తన కంట్రిబ్యూషన్ గురించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారామె. 'మన సమాజం ఉద్యోగాలు వెతుక్కునే సమాజంగానే ఉండిపోవడానికి కారణం కూడా పెద్దవాళ్లు ఎప్పటికప్పుడు యువత ఆలోచనలను చిదిమేయడమే. పెద్దవాళ్ల కంటే యువత ఒక తరం ముందు ఉంటుంది. ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. ఆ ఆలోచనలకు ఒక అండ దొరికితే వాళ్లు అద్భుతాలు చేస్తారు'. – డాక్టర్ గీతారెడ్డి బోర, ఫౌండర్, యష్మి సొల్యూషన్స్, యష్మిత ఈ టెక్నాలజీస్, చైర్పర్సన్, సీఐఎమ్ఎస్ఎమ్ఈ, ఆంధ్రప్రదేశ్ ‘‘నేను పుట్టింది, పెరిగింది వైజాగ్‌లో. ఎంసీఏ తర్వాత హైదరాబాద్‌లో పన్నెండేళ్లపాటు ఉన్నాను. ఇప్పుడు నా కంపెనీ వ్యవహారాలు, సామాజిక వ్యవహారాలను వైజాగ్ నుంచే నిర్వహిస్తున్నాను. సమాజం మారాలని వేదికలెక్కి ఉపన్యాసాలివ్వడం కాదు, విద్యావ్యవస్థను గాడిలో పెడితే, యువత ఆలోచనలను అభివృద్ధి వైపు మరలి్చనట్లయితే సమాజం దానంతట అదే మారుతుంది. సరిగ్గా నేను అదే చేస్తున్నాను. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో 41 ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రసంగించి, నాలుగువందల మంది విద్యార్థులను ప్రభావితం చేయగలిగాను. వారిలో 150 మంది తమ సొంత ఆలోచనలతో ఎంటర్ప్రెన్యూర్ షిఫ్ వైపు అడుగులు వేస్తున్నారు. పెద్దవాళ్లు అనుభవం పేరుతో యువత ఆలోచనలకు పరిధులు విధిస్తుంటారు. ఇది చాలా తప్పు. యువత ఆలోచనలను బయటకు చెప్పగలిగేలా వాళ్లను ్రపోత్సహించాలి. పెద్దవాళ్లు ఎప్పుడూ యువత ఆలోచనలను కార్యరూపం దాల్చడానికి తమ అనుభవం నుంచి కొన్ని సూచనలు చేయవచ్చు. అంతేతప్ప యువత ఎలాంటి ఉపాధిని వెతుక్కోవాలనే ఆలోచనలు కూడా తామే చేయాలనుకోకూడదు. ఈ అంతరాన్ని పూడ్చడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మెంటార్, రీసోర్స్ పర్సన్, మోటివేషనల్ స్పీకర్‌గా ఉన్నాను. చైల్డ్ అబ్యూజ్, మహిళల పట్ల వివక్ష, మహిళల కుటుంబ, వైవాహిక పరమైన చిక్కులకు న్యాయసలహాలతో కౌన్సెలింగ్ ఇస్తున్నాను. మా వైజాగ్‌లో భూబకాసురుల చేతిలో చిక్కుకున్న భూమి వివరాలను, ఒరిజినల్ డాక్యుమెంట్ల ఆధారాలను ప్రభుత్వానికి తెలియచేసి, బాధితులకు అండగా నిలిచాను. ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉమన్‌గా సమాజానికి ఇస్తున్న సేవకుగాను ‘నారీప్రెన్యూర్’ గుర్తింపును అందుకున్నాను. ఇప్పుడు నా మీద మహిళల కోసం పని చేయాల్సిన బాధ్యత కూడా పెరిగింది. గ్రామీణ మహిళలను ఆర్థిక సాధికారత వైపు నడిపించడానికి కార్యక్రమాల మీద పని చేస్తున్నాను. పరిమితమైన వనరులు, సాధారణ విద్యార్హతలు కలిగిన గ్రామీణ మహిళ తన మేధను ఉపయోగించి ఎదగడానికి అవసరమైనట్లు శిక్షణ కార్యక్రమాలను రూపొందిస్తున్నాను. ఆడవాళ్లు అభ్యుదయ కోణంలో ఆలోచించనంత కాలం సమాజం అభివృద్ధి దిశగా నడవదు. అందుకే మహిళ మారాలి, ఆమె మారితే పిల్లల ఆలోచనలు మారుతాయి. ఆ భావితరం మనం కోరుకున్న సమాజాన్ని నిర్మిస్తుంది’’ అన్నారు డాక్టర్ గీతారెడ్డి బోర. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి. ఇవి చదవండి: వినూత్నం: రోబో టీచరమ్మ.. పిల్లలు బుద్ధిగా, సైలెంట్‌గా ఉండాల్సిందే.. -
దేశానికి ఎనలేని సేవ చేశారు..
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ఆదివారం గాంధీభవన్‌లో పలువురు కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్యెల్యే శ్రీధర్‌బాబు, కార్య నిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావ్ తదితరులు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం దేశానికి పీవీ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ తెలంగాణ సమాజం లోని అన్ని వర్గాల మనసుల్లో చిరస్థాయిగా ఉన్న వ్యక్తి పీవీ అని కొనియాడారు. ఎవరో ఇప్పుడు ఆయన జయంతి వేడుకలు చేస్తున్నారని రాష్ట్ర ప్ర భుత్వాన్ని పరోక్షంగా విమర్శించిన ఉత్తమ్, అయి నా తాము గర్విస్తామని, స్వాగతిస్తామన్నారు. గీతారెడ్డి చైర్మన్‌గా కమిటీ ఏర్పాటు పీవీ శతజయంతి వేడుకల నిర్వహణకుగాను మా జీ మంత్రి గీతారెడ్డి చైర్మన్‌గా, మంథని ఎమ్యెల్యే శ్రీధర్‌బాబు వైస్ చైర్మన్‌గా 15 మంది సభ్యులు, ముగ్గురు సలహాదారులతో ఉత్తమ్ కమిటీ ఏర్పాటు చేశారు. కాగా, దిగవంత పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను ఏడాదిపాటు జరపాలని సోనియా గాంధీ ఆదేశాలిచ్చారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఉమ్మడి రాష్ట్రంలోనే తీర్మానం చేశామని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని పార్లమెంట్లో కూడా కోరతామని చెప్పారు. -
దొరల ప్రభుత్వమా.. ప్రజల ప్రభుత్వమా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దొరల ప్రభుత్వం కావాలో... ప్రజాప్రభుత్వం కావాలో ప్రజలే తేల్చుకోవాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. ఆత్మ గౌరవం కోసం అందరూ ఐక్యమై నియంతలా పాలిస్తున్న కేసీఆర్‌ను ఓడించాలని కోరారు. ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్, మాజీ మంత్రి డాక్టర్ జె.గీతారెడ్డిలతో కలసి శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకు ప్రజాసంఘాలు, విద్యార్థులు, రైతులు, బీసీలు, దళి తులు, గిరిజనులు, మహిళలు ఏకతాటిపైకి రావా లని కోరారు. గాంధీ కుటుంబం, రాహుల్‌నుద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ‘తెలంగాణను ఇచ్చిన సోనియాను అమ్మా.. బొమ్మా అని అన్న కొడుకు కేటీఆర్, రాహుల్‌ను బఫూన్ అన్న తండ్రి కేసీఆర్ స్థాయి ఏంటో తెలంగాణ ప్రజలకు అర్థమైంద’న్నారు. అధికారంలోకి వచ్చే అవకాశము న్నా ఇతరులను ప్రధానిని చేసిన ఘనత సోనియా కుటుంబానిదని గుర్తుచేశారు. 100 సీట్లు గెలుస్తామ ని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన కేసీఆర్ కాంగ్రెస్ నాయకులనెందుకు చేర్చుకుంటున్నారని మధుయాష్కీగౌడ్ ప్రశ్నించారు. సురేశ్‌రెడ్డి పార్టీని వీడి నంత మాత్రాన నష్టం లేదన్నారు. ఎమ్మెల్సీలు, ఎంపీలే కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా రన్నారు. ముందస్తుకు వెళ్లి కేసీఆర్ తన గొయ్యి తానే తవ్వుకున్నారని గీతారెడ్డి విమర్శించారు. -
రేసులో గీతారెడ్డి, జీవన్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (ప్రజా పద్దుల సంఘం) చైర్మన్ పదవి ఖాళీ అవటంతో మాజీమంత్రులు గీతారెడ్డి, జీవన్ రెడ్డి ఆ పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే, మాజీమంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక మరణంతో చైర్మన్ ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే కిష్ణారెడ్డికి పీఏసీ చైర్మన్ పదవి వరించింది. అయితే అనారోగ్యంతో ఆయన మృతి చెందటంతో ఆ స్థానంలో రాంరెడ్డి వెంకటరెడ్డి నియమితులయ్యారు. దీంతో ఆయన మృతితో మరోసారి ఆ పదవి ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో పదవి కోసం పోటీ పడుతున్న ఇద్దరు నేతలకు గతంలో మంత్రులుగా చేసిన అనుభవం ఉంది. మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ ఎమ్మెల్యే, మాజీమంత్రి డీకె అరుణ కూడా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే ఈ ముగ్గురు నేతల్లో పీఏసీ పదవి ఎవర్ని వరిస్తుందో చూడాలి. కాగా సాధారణంగా శాసనసభలో పీఏసీ చైర్మన్‌గా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేను నియమించడం అనవాయితీ. -
'గీతారెడ్డిని అవమానించిందెవరు?'
- ఆమెను జైల్లో పెట్టించే ప్రయత్నం జరగలేదా?: రసమయి ఎదురుదాడి - మాటిమాటికి నా పేరెందుకు ఎత్తుతారు: గీతారెడ్డి - ఇది శాసనసభనా, ధూం..ధాం సభనా?: జానారెడ్డి అసహనం సాక్షి, హైదరాబాద్: ‘దళిత ఉప ముఖ్యమంత్రి బర్తరఫ్ అంశాన్ని లేవనెత్తుతున్న కాంగ్రెస్ సభ్యులు వారి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? దళిత మహిళ గీతారెడ్డి భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటే చూసి ఓర్వలేక ఆమెను జైల్లో పెట్టే ప్రయత్నం చేయలేదా. ఆ విషయాన్ని మరిచిపోయి ఇప్పుడు మా ప్రభుత్వంపై విమర్శలెందుకు చేస్తున్నారు. దళిత సంక్షేమం అంటే వారి పేరు చెప్పుకుని ఓట్లు అడగ టం కాదు.. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారి అభ్యున్నతికి కృషి చేయాలి. అది కేసీఆర్ చేస్తున్నారు’ అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సభ్యులు విమర్శలు చేయటంతో ఆయన ప్రత్యారోపణలతో సభలో వేడి పుట్టించారు. దీంతో రెండు పక్షాల మధ్య వాదోపవాదాలతో గందరగోళం నెలకొంది. పాటలు పాడుతూ హద్దుపద్దూ లేని ఆరోపణలు చేస్తున్నా ఎలా అనుమతిస్తున్నారని సీఎల్పీ నేత జానారెడ్డి ఉపసభాపతిని ప్రశ్నించి అసలు ఇది శాసనసభా.. ధూంధాం సభనా అంటూ అసహనం వ్యక్తం చేశారు. సంపత్ వర్సెస్ రసమయి కాంగ్రెస్ సభ్యుడు సంపత్ ఆవేశ ప్రసంగం.. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ తర్వాత ప్రసంగం ప్రారంభించిన రసమయి... ఆది నుంచి ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. ఇన్నేళ్ల తర్వాత దళిత పక్షపాత సీఎంగా కేసీఆర్ కనిపిస్తున్నారని, పాటలు పాడుకుంటున్న తనను సాంస్కృతిక సారథికి చైర్మన్ చేశారని రసమయి బాలకిషన్ అన్నారు. హాస్టళ్లలోని పేద పిల్లలు సన్నబియ్యం తింటుంటే అభినందించాల్సిందిపోయి దాన్నీ రాజకీయం చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలోనే గీతారెడ్డి ప్రస్తావన తెచ్చారు. దీనికి గీతారెడ్డి లేచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రసమయి సానుభూతి నాకవసరం లేదు ‘సభలో మాటిమాటికి నా ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు. రసమయి సానుభూతి నాకవసరం లేదు. కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని సభలో లేవనెత్తటం సరికాదు’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి అన్నారు. అసలు అప్పుడు ఎవరో చేసిన తప్పుల్లో మంత్రులుగా మా పేరు వచ్చింది. వాస్తవమేంటో కోర్టు తేలుస్తుంది. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా... అన్ని ఫైళ్లు తెప్పించుకుని వాస్తవాలేంటో చెప్పమనండని ఆగ్రహంగా మాట్లాడారు. -
గీతారెడ్డి ఫైవ్ స్టార్ మినిష్టర్: కేసీఆర్
మెదక్ : మెదక్ జిల్లాలో రాజకీయ నేతల ఎన్నికల ప్రచారం పోటీ పోటీగా కొనసాగుతోంది. మెదక్ జిల్లా జహీరాబాద్‌లో శనివారం కేసీఆర్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ గీతారెడ్డి ఫైవ్ స్టార్ మినిష్టర్ అని, ఆమె సామాన్యులకు అందుబాటులో ఉండరని వ్యాఖ్యానించారు. గీతారెడ్డిపై సీబీఐ కేసులు ఉన్నాయని, ఆమె జైలుకు వెళ్లటం ఖాయమని అన్నారు. 14 సంవత్సరాల పోరాటం తర్వాత తెలంగాణ వచ్చిందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఎవరి చేతిలో ఉంటే క్షేమంగా ఉంటుందో ప్రజలే ఆలోచించుకోవాలని ఆయన సూచించారు. ఈ ఎన్నికల్లో ఎవరి తలరాతను వాళ్లు రాసుకునే సమయం వచ్చిందన్నారు. 40ఏళ్ల పాటు తెలంగాణను కాంగ్రెస్ పాలించిందని, అయితే తెలంగాణ అభివృద్ధిని మాత్రం పట్టించుకోలేదని కేసీఆర్ విమర్శించారు. కాగా తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి మహిళా కావాలన్నది తన కోరిక అంటూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ నేతగా ఉన్న గీతారెడ్డి సీఎం రేసులో ముందున్నారు. -
మాటేసిన మృత్యువు
జహీరాబాద్/ జహీరాబాద్‌టౌన్/ కోహీర్, న్యూస్‌లైన్ : పుట్టిన రోజు వేడుకలను సింగూరు ప్రాజెక్టు వద్ద ఆహ్లాదంగా జరుపుకునేందుకు బయలుదేరిన విద్యార్థులు మార్గమధ్యలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామ సమీపంలో 9వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా వాసులను కలచి వేసిన ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులతో పాటు ఆటో డ్రైవర్ మరణించారు. మరో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సీఐ నరేందర్ కథనం మేరకు.. జహీరాబాద్ పట్టణంలోని మాణిక్‌ప్రభు వీధికి చెందిన జేమ్స్ తన పుట్టి రోజును పురస్కరించుకుని మిత్రులకు విందు ఇవ్వాల ని నిర్ణయించాడు. అందులో భాగంగా జహీరాబాద్‌లో తాను చదివే ఆచార్య డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుకుంటున్న తొమ్మిది మం ది (జేమ్స్‌తో కలిసి పది మంది) విద్యార్థులతో కలిసి సింగూరు ప్రాజెక్టుకు వెళ్లేందుకు అద్దెకు టాటా మ్యాజిక్ (ఆటో)ను మాట్లాడాడు. మొ త్తం 11 మంది (డైవర్‌తో కలిపి)తో ఆటో బ యలుదేరింది. అయితే ఆటో కోహీర్ మండ లం దిగ్వాల్ గ్రామ సమీపంలో వచ్చే సరికే ముందు వెళ్తున్న బస్సును అధిగమించే క్రమం లో ఎదురుగా వస్తున్న మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొంది. దీంతో ఆటోలో ప్ర యాణిస్తున్న విద్యార్థుల్లో జహీరాబాద్ మండ లం విఠునాయక్ తండాకు చెందిన విఠల్ (21), జహీరాబాద్ పట్టణానికి చెందిన జేమ్స్ (21)లు సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. న్యాల్కల్ మండలం ముంగి గ్రామానికి చెందిన యాదగిరి జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, ఝరాసంగానికి చెందిన విద్యార్థిని మేఘమాల (20), న్యాల్కల్ మండలం టేకూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జహీరుద్దీన్ (40)లను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండ గా మార్గమధ్యంలో మరణించారు. ప్రమాదంలో గాయపడిన జహీరాబాద్ మండలం హుగ్గెల్లికి చెందిన భాగ్యలక్ష్మి, మంజుల, రాయిపల్లి తండాకు చెందిన ప్రేమబాయి, ఝరాసంగానికి చెందిన అరుణ, రాయికోడ్ మండలం మందాపూర్ గ్రామానికి చెందిన మహేష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వీరికి జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బర్త్‌డేను జరుపుకునేందుకని వెళ్లి.. జేమ్స్ పుట్టిన రోజును స్నేహితులు పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులో చేయాలని నిర్ణయించారు. అయితే ఇంట్లో తల్లిదండ్రులకు విషయం చెప్పక పోగా, కళాశాల యాజమాన్యం నుంచి సైతం అనుమతి తీసుకోలేదు. సింగూరు ప్రాజెక్టు వద్దే వంటలు వండుకునేందుకు సామగ్రి, పాత్రలు, చికెన్ కొనుగోలు చేసుకుని అద్దెకు మాట్లాడిన టాటా మ్యాజిక్ వాహనంలో బయలు దేరారు. అయితే వారి ఊహకు విరుద్ధంగా రోడ్డు ప్రమాదం వారి జీవితాలనే చిదిమేసింది. తల్లిదండ్రుల ఆశలు ఆవిరి తమ పిల్లలు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం పొంది తమను పోషిస్తారని పెట్టుకు న్న ఆశలు వారి పిల్లల మరణంతో ఆవిరయ్యా యి. విఠల్‌ది పేద కుటుంబం అయినప్పటికీ తల్లి దండ్రులు కష్టపడి తమ కుమారుడిని చది వించుకుంటున్నారు. జీవితంలో పైకి ఎదగాలని కలలు కన్నారు. జేమ్స్‌ది నిరుపేద కుటుం బం. అతడు ఇతర పనులు చేసుకుంటూ కష్టపడి చదువుకుంటున్నాడు. యాదగిరి కుటుం బం కూడా నిరుపేద కుటుంబమే. ఇంటికి పెద్దవాడైనందున ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని పోషిస్తాడని తల్లిదండ్రులు ఆశించారు. ప్రమాదం వారి కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. జహీరుద్దీన్ కొన్నేళ్లుగా జహీరాబాద్ పట్టణంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, కుమార్తె ఉంది. విద్యార్థుల ఆందోళన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలుకావడంతో తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు. 9వ నెంబరు జాతీయ రహదారి దెబ్బతిన్నా మరమ్మతులు చేపట్టడం లేదని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయ ని, విద్యార్థుల మృతికి కూడా ఇదే కారణమం టూ కళాశాల విద్యార్థులతో పాటు విద్యార్థి, యువజన సంఘాల నేతలు రాస్తారోకో నిర్వహించారు. దీంతో సీఐ నరేందర్ వారితో మా ట్లాడి ఆందోళనను విరమింపజేశారు. ప్రమా దం విషయమై మంత్రి గీతారెడ్డితో మాట్లాడినట్లు, మృతుల కుటుంబాలకు తగినన్యాయం చేస్తామని ఆమె చెప్పారని సీఐ వివరించారు. మాజీ మంత్రి ఫరీదుద్దీన్ పరామర్శ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రిలో రాష్ర్ట భారీ పరిశ్రమల శాఖ మంత్రి జే గీతారెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, ప్రమాదం గురించి సీఎంతో చర్చించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరి నట్లు పేర్కొన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. అంతకుముందు జహీరాబాద్, కోహీర్ ప్రభుత్వాస్పత్రులను మాజీ మంత్రి ఎండీ ఫరీదుద్దీన్ సందర్శించి, మృతుల కుటుంబాలను పరామర్శించారు. రోడ్డు ప్రమాదం పట్ల ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రోడ్డు అధ్వానంగా ఉండడం మూలంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మృతులకు రూ.10 లక్షలు చెల్లించాలి: ఎస్ఎఫ్ఐ సంగారెడ్డి మున్సిపాలిటీ: కోహీర్ మండలం దిగ్వాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డిగ్రీ విద్యార్థుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరేష్, రవిలు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.