మాటేసిన మృత్యువు | Students died to went to birthday party | Sakshi
Sakshi News home page

మాటేసిన మృత్యువు

Published Wed, Nov 20 2013 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM

Students died to went to birthday party

జహీరాబాద్/ జహీరాబాద్‌టౌన్/ కోహీర్, న్యూస్‌లైన్ :  పుట్టిన రోజు వేడుకలను సింగూరు ప్రాజెక్టు వద్ద ఆహ్లాదంగా జరుపుకునేందుకు బయలుదేరిన విద్యార్థులు మార్గమధ్యలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామ సమీపంలో 9వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా వాసులను కలచి వేసిన ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులతో పాటు ఆటో డ్రైవర్ మరణించారు. మరో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సీఐ నరేందర్  కథనం మేరకు.. జహీరాబాద్ పట్టణంలోని మాణిక్‌ప్రభు వీధికి చెందిన జేమ్స్ తన పుట్టి రోజును పురస్కరించుకుని మిత్రులకు విందు ఇవ్వాల ని నిర్ణయించాడు.

అందులో భాగంగా జహీరాబాద్‌లో తాను చదివే ఆచార్య డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుకుంటున్న తొమ్మిది మం ది (జేమ్స్‌తో కలిసి పది మంది) విద్యార్థులతో కలిసి సింగూరు ప్రాజెక్టుకు వెళ్లేందుకు అద్దెకు టాటా మ్యాజిక్ (ఆటో)ను మాట్లాడాడు. మొ త్తం 11 మంది (డైవర్‌తో కలిపి)తో ఆటో బ యలుదేరింది. అయితే ఆటో కోహీర్ మండ లం దిగ్వాల్ గ్రామ సమీపంలో వచ్చే సరికే ముందు వెళ్తున్న బస్సును అధిగమించే క్రమం లో ఎదురుగా వస్తున్న మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొంది. దీంతో ఆటోలో ప్ర యాణిస్తున్న విద్యార్థుల్లో జహీరాబాద్ మండ లం విఠునాయక్ తండాకు చెందిన విఠల్ (21), జహీరాబాద్ పట్టణానికి చెందిన జేమ్స్ (21)లు సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు.

న్యాల్‌కల్ మండలం ముంగి గ్రామానికి చెందిన యాదగిరి జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, ఝరాసంగానికి చెందిన విద్యార్థిని మేఘమాల (20), న్యాల్‌కల్ మండలం టేకూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జహీరుద్దీన్ (40)లను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండ గా మార్గమధ్యంలో మరణించారు. ప్రమాదంలో గాయపడిన జహీరాబాద్ మండలం హుగ్గెల్లికి చెందిన భాగ్యలక్ష్మి, మంజుల, రాయిపల్లి తండాకు చెందిన ప్రేమబాయి, ఝరాసంగానికి చెందిన అరుణ, రాయికోడ్ మండలం మందాపూర్ గ్రామానికి చెందిన మహేష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వీరికి జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
 బర్త్‌డేను జరుపుకునేందుకని వెళ్లి..
 జేమ్స్ పుట్టిన రోజును స్నేహితులు పుల్‌కల్ మండలం సింగూరు ప్రాజెక్టులో చేయాలని నిర్ణయించారు. అయితే ఇంట్లో తల్లిదండ్రులకు విషయం చెప్పక పోగా, కళాశాల యాజమాన్యం నుంచి సైతం అనుమతి తీసుకోలేదు. సింగూరు ప్రాజెక్టు వద్దే వంటలు వండుకునేందుకు సామగ్రి, పాత్రలు, చికెన్ కొనుగోలు చేసుకుని అద్దెకు మాట్లాడిన టాటా మ్యాజిక్ వాహనంలో బయలు దేరారు. అయితే వారి ఊహకు విరుద్ధంగా రోడ్డు ప్రమాదం వారి జీవితాలనే చిదిమేసింది.  
 తల్లిదండ్రుల ఆశలు ఆవిరి
 తమ పిల్లలు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం పొంది తమను పోషిస్తారని పెట్టుకు న్న ఆశలు వారి పిల్లల మరణంతో ఆవిరయ్యా యి. విఠల్‌ది పేద కుటుంబం అయినప్పటికీ తల్లి దండ్రులు కష్టపడి తమ కుమారుడిని చది వించుకుంటున్నారు. జీవితంలో పైకి ఎదగాలని కలలు కన్నారు. జేమ్స్‌ది నిరుపేద కుటుం బం. అతడు ఇతర పనులు చేసుకుంటూ కష్టపడి చదువుకుంటున్నాడు. యాదగిరి కుటుం బం కూడా నిరుపేద కుటుంబమే. ఇంటికి పెద్దవాడైనందున ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని పోషిస్తాడని తల్లిదండ్రులు ఆశించారు. ప్రమాదం వారి కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. జహీరుద్దీన్ కొన్నేళ్లుగా జహీరాబాద్ పట్టణంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, కుమార్తె ఉంది.
 విద్యార్థుల ఆందోళన
 రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలుకావడంతో తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు. 9వ నెంబరు జాతీయ రహదారి దెబ్బతిన్నా మరమ్మతులు చేపట్టడం లేదని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయ ని, విద్యార్థుల మృతికి కూడా ఇదే కారణమం టూ కళాశాల విద్యార్థులతో పాటు విద్యార్థి, యువజన సంఘాల నేతలు రాస్తారోకో నిర్వహించారు. దీంతో సీఐ నరేందర్ వారితో మా ట్లాడి ఆందోళనను విరమింపజేశారు.  ప్రమా దం విషయమై మంత్రి గీతారెడ్డితో మాట్లాడినట్లు, మృతుల కుటుంబాలకు తగినన్యాయం చేస్తామని ఆమె చెప్పారని సీఐ వివరించారు.

 మాజీ మంత్రి ఫరీదుద్దీన్ పరామర్శ
 ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రిలో రాష్ర్ట భారీ పరిశ్రమల శాఖ మంత్రి జే గీతారెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, ప్రమాదం గురించి సీఎంతో చర్చించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరి నట్లు పేర్కొన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. అంతకుముందు జహీరాబాద్, కోహీర్ ప్రభుత్వాస్పత్రులను మాజీ మంత్రి ఎండీ ఫరీదుద్దీన్ సందర్శించి, మృతుల కుటుంబాలను పరామర్శించారు. రోడ్డు ప్రమాదం పట్ల ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రోడ్డు అధ్వానంగా ఉండడం మూలంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
 మృతులకు రూ.10 లక్షలు చెల్లించాలి: ఎస్‌ఎఫ్‌ఐ
 సంగారెడ్డి మున్సిపాలిటీ: కోహీర్ మండలం దిగ్వాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డిగ్రీ విద్యార్థుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరేష్, రవిలు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement