సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దొరల ప్రభుత్వం కావాలో... ప్రజాప్రభుత్వం కావాలో ప్రజలే తేల్చుకోవాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. ఆత్మ గౌరవం కోసం అందరూ ఐక్యమై నియంతలా పాలిస్తున్న కేసీఆర్‌ను ఓడించాలని కోరారు. ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్, మాజీ మంత్రి డాక్టర్ జె.గీతారెడ్డిలతో కలసి శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకు ప్రజాసంఘాలు, విద్యార్థులు, రైతులు, బీసీలు, దళి తులు, గిరిజనులు, మహిళలు ఏకతాటిపైకి రావా లని కోరారు. గాంధీ కుటుంబం, రాహుల్‌నుద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
‘తెలంగాణను ఇచ్చిన సోనియాను అమ్మా.. బొమ్మా అని అన్న కొడుకు కేటీఆర్, రాహుల్‌ను బఫూన్ అన్న తండ్రి కేసీఆర్ స్థాయి ఏంటో తెలంగాణ ప్రజలకు అర్థమైంద’న్నారు. అధికారంలోకి వచ్చే అవకాశము న్నా ఇతరులను ప్రధానిని చేసిన ఘనత సోనియా కుటుంబానిదని గుర్తుచేశారు. 100 సీట్లు గెలుస్తామ ని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన కేసీఆర్ కాంగ్రెస్ నాయకులనెందుకు చేర్చుకుంటున్నారని మధుయాష్కీగౌడ్ ప్రశ్నించారు. సురేశ్‌రెడ్డి పార్టీని వీడి నంత మాత్రాన నష్టం లేదన్నారు. ఎమ్మెల్సీలు, ఎంపీలే కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా రన్నారు. ముందస్తుకు వెళ్లి కేసీఆర్ తన గొయ్యి తానే తవ్వుకున్నారని గీతారెడ్డి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment