మధిర: అనారోగ్యంతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి పులి బయటకు వస్తోందని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నా రని, అయితే ఆ పులిని బంధించి రాష్ట్ర ప్రజలు, ఆస్తులను ఎలా కాపాడుకోవాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలుకు బడ్జెట్‌లో కేటాయించిన రూ.17,700 కోట్ల నిధులు ఏమయ్యాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లా మధిరలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ బంధు, గృహలక్ష్మి, రుణమాఫీ, దళితబంధు వంటి ఏ పథకాన్నీ సంపూర్ణంగా అ మలు చేయని బీఆర్‌ఎస్‌కు మళ్లీ ఎందుకు ఓటు వేయాలో కేసీఆర్, కేటీఆర్ చెప్పా లని భట్టి అన్నారు. బ్యాంకు ఖాతాలో రుణమాఫీ నగదు జమ చేయకుండానే అయినట్లు మెసేజ్‌లు పంపిస్తూ ప్రజలను మోసం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.
ఇలాంటి మోసాల ప్రభుత్వానికి ప్రజలు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురా వాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆరు గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేస్తుందని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment