సాక్షి, హైదరాబాద్ : దేశ మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తెలుగు జాతి గౌరవానికి ప్రతీకలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు గర్వించదగ్గ గొప్పవారిని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా వారిని అందరూ గౌరవిస్తారని గుర్తుచేశారు. నగరంలోని పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌లను గురువారం బండి సంజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌లకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మహానేతలపై ఒవైసీ మాట్లాడిన తీరు దురదృష్టకరమని, ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ఘాట్‌ను కూల్చివేస్తామంటూ ఎంఐఎం నేతలు చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్, టీడీపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. (కమలనాథుల గ్రేటర్ అటెన్షన్)
ఈ సందర్భంగా బీజేపీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. ‘ఎన్టీఆర్, పీవీ ఘాట్లకు బీజేపీ రక్షణగా ఉంటుంది. ఎంఐఎం పార్టీ దేశ ద్రోహ పార్టీగా ముస్లీంలే భావిస్తున్నారు. న్టీఆర్ స్కూల్ నుంచే వచ్చి ఈ రోజు సీఎం అయిన కేసీఆర్.. అభిమాన నాయకుడిని అవమనిస్తే ఎందుకు సీఎం ఎందుకు స్పందించడం లేదు. రోహింగ్యాలను ప్రభుత్వం గుర్తించినట్లు భావిస్తున్నాం. ప్రశాంతంగా గ్రేటర్ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలవబోతుంది. గ్రేటర్ ప్రజలు స్వేచ్చగా ఓటు వేయకుండా టీఆర్‌ఎస్ నేతలు భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. పార్టీలకు అతీతంగా నివాళులు అర్పించడానికి బీజేపీ నేతలు వస్తే...భారత రత్నకు, ఎన్టీఆర్ ఘాట్ కూల్చడానికి ఎంఐఎం వ్యాఖ్యలకు సంబంధం ఏంటి ?భారతరత్న ఇవ్వాలని బీజేపీ ఖచ్చితంగా కోరుతుంది. ఏపీ, తెలంగాణ రెండు బీజేపీ శాఖలు కలిసి ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కోరుతాం’ అని అన్నారు. (అక్బరుద్దీన్‌ని పిచ్చోడితో పోల్చిన కేటీఆర్)
Comments
Please login to add a commentAdd a comment