సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయం చేసిందని, ఈ చరిత్ర గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీకి ఏ మాత్రం అవగాహన లేకపోవడం నిజంగా దురదృష్టకరమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పీవీ మనందరం అభిమానించే గొప్ప వ్యక్తి అని, మట్టిలో పుట్టిన మాణక్యమని తెలిపారు. తన జీవితమంతాకాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేసిన వ్యక్తని పేర్కొన్నారు. అలాంటి నిరాడంబరమైన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ దారుణంగా అవమానించిందని మంత్రి చెప్పారు.
ప్రధానమంత్రి ఉన్న పీవీ నర్సింహరావుకు 1996లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎంపీ టికెట్ నిరాకరించి ఘోరంగా అవమానించారని కేటీఆర్ ప్రస్తావించారు., ఆయన చనిపోయిన తర్వాత కూడా కనీసం 24 అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోకి కూడా ఆయన భౌతిక కాయాన్ని అనుమతించలేదని గుర్తు చేశారు.చరిత్ర గురించి ప్రియాంకాగాంధీకి అవగాహన లేకపోవడం దారుణమని అన్నారు. పీవీ కుటుంబానికి రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
చదవండి: మోదీకి కేసీఆర్, ఓవైసీ స్నేహితులు: రాహుల్ గాంధీ
#WATCH | Hyderabad: On Former PM PV Narasimha Rao, Telangana Minister and BRS MLA KT Rama Rao says, "It's truly unfortunate that Priyanka Gandhi does not seem to have any information on the history of the injustice meted out to late PM PV Narasimha Rao. He is someone we all look… pic.twitter.com/mjMOSdew3j— ANI (@ANI) November 25, 2023
#WATCH | Telangana Minister and BRS MLA KT Rama Rao says, "Rahul Gandhi is jobless today because he lost his job in 2014. He and his party both lost their job in 2014. That's why today he remembered unemployment... I want to ask if Rahul Gandhi has ever written a single entrance… pic.twitter.com/7PkNPpajrx— ANI (@ANI) November 25, 2023
Comments
Please login to add a commentAdd a comment