PV Narasimha Rao Birth Anniversary A Leader Should Not Be Ignored - Sakshi
Sakshi News home page

PV జయంతి నేడు: క్లిష్టకాలంలో దేశాన్ని గట్టెక్కించిన తెలుగు బిడ్డ

Published Wed, Jun 28 2023 12:34 PM | Last Updated on Wed, Jun 28 2023 1:27 PM

PV Narasimha Rao birth anniversary A Leader Should Not be Ignored - Sakshi

భారత దేశ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కలిగిన మేధావీ, పరిపాలనాదక్షుడూ పాము లపర్తి వెంకట నరసింహారావు. ఎవరి జీవితం, ఎట్లా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. తమిళ నాడు శ్రీపెరుంబుదూర్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న  రాజీవ్‌ గాంధీని 1991 మే 21న ఎల్‌టీ టీఈ ఆత్మాహుతి దాడితో హత్య చేసింది. అత్యధిక మెజారిటీతో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి అధికారం కట్ట బెట్టారు. భారత పదవ ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టారు పీవీ.

ఆ సమయంలో భారతదేశం అంతర్జాతీయ చెల్లింపులపై  డిఫాల్ట్‌ అయ్యి రెండు వారాలు కావ స్తోంది. విదేశీ మారక నిల్వలు కేవలం రెండు వారాల దిగుమతులకు మాత్రమే సరిపో యేంతగా ఉన్నాయి. అంతకు నెలరోజుల క్రితం మొత్తం 55 టన్నుల బంగారాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ తనఖా పెట్టింది. పెద్ద మొత్తంలో చెల్లింపులు తగ్గు ముఖం పట్టాయి. భారతదేశా నికి రుణం ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు. 

ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థికవేత్త మన్మోహన్‌ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించారు పీవీ. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడడానికి ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికైనా ఆయనకు స్వేచ్ఛ నిచ్చారు. అప్పటివరకూ ఉన్న కఠిన నిబంధనలను సడళించి సరళీకరణకు ద్వారాలు తెరచింది పీవీ ప్రభుత్వం. దాని ఫలితాలనే ఇప్పుడు మనమంతా అనుభ విస్తున్నాం. అంతర్జాతీయ సమాజంలో భారత్‌ పట్ల సన్నగిల్లిన విశ్వాసాన్ని తిరిగి పాదుకొల్పారు పీవీ. ఫలితంగా అంతర్జాతీయ ద్రవ్య సంస్థల సహాయం మళ్లీ ప్రారంభమయ్యింది. అలా దేశాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చారు.

ప్రస్తుత తెలంగాణలోని హనుమకొండ జిల్లా లోని ‘వంగర’ గ్రామంలో 1921లో పీవీ జన్మించారు. అంచెలంచెలుగా రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో ఎదిగారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే బాబ్రీ మసీద్‌ కూల్చివేత జరిగింది. ఆ సమయంలో ఆయన తీవ్ర మైన విమర్శలను ఎదుర్కొన్నారు. దక్షిణ భారత్‌కు చెందిన పీవీకి వ్యతిరేకంగా ఆయన సొంత పార్టీ ప్రముఖులే పనిచేసి ఆయనను పదవి నుంచి లాగి వేయడానికి ప్రయత్నించారు. కానీ ఇటు ప్రతి పక్షాలు, అటు అసంతృప్తులైన సొంత పార్టీ వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఆయన విజయవంతంగా తన ఐదేళ్ల పదవీకాలాన్ని దిగ్విజయంగా ముగించారు. ఆయన మరణించి 18 ఏళ్లు గడిచాయి. పీవీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ తన సందేశాన్ని ట్వీట్ ద్వారా పంచుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ పీవీ చేసిన సేవలను స్మరించుకుంది. 

ఈ తరుణంలో దేశానికి పీవీ చేసిన సేవను అన్ని వర్గాలూ మరచిపోవడం బాధాకరం. ఆయన శత జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించి ఆయన కీర్తి ప్రతిష్ఠలను ఇను మడింప చేశారు.ఇంతటి మహా మేధా వినీ, పరిపాలనా దక్షుణ్ణీ నేను నా జీవితంలో ఆరుసార్లు అతి దగ్గర నుండి చూశాను. ఆయనతో కొంత సమయం గడిపాను. నా జీవితంలో మరపు రాని సందర్భాలివి. 1977లో పెద్ద పల్లి జిల్లా మా కొలనూరు పక్క ఊరైన ‘పెగడ పల్లి’లో మా చుట్టాల ఇంటిలో పెళ్లి సందర్భంగా ఆయనతో కలిసి బంతి భోజనం చేశాను. మరొకసారి ఒక దినపత్రిక విలేక రిగా పెద్దపల్లి విశ్రాంత భవనంలో ఆయన పక్క కూర్చుని ముచ్చటించడం అరుదైన ఘటన. 

– దండంరాజు రాంచందర్‌ రావు, రిటైర్డ్‌ డిప్యూటీ సూపరింటెండెంట్, సింగరేణి భవన్, హైదరాబాద్‌ (నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement