
న్యూఢిల్లీ: లోక్‌సభలో ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అడ్వాణీ తిరిగి నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆయనను ఎంపిక చేశారు. లోక్‌సభలో సభ్యుల అనైతిక ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదులను ఈ కమిటీ పరిశీలిస్తుంది. సభలో సభ్యుడి అనైతిక ప్రవర్తనపై సుమోటోగా కూడా ఈ కమిటీ విచారణ చేపట్టవచ్చు.
సభ్యుల గైర్హాజరీ కమిటీ చైర్మన్‌గా పి.కరుణాకరన్ తిరిగి నియమితులు కాగా, ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా రమేశ్ పోఖ్రియల్ నిశాంక్, పేపర్స్ లేయిడ్ ఆన్ టేబుల్ కమిటీ చైర్మన్‌గా చంద్రకాంత్ బి ఖైరే, లెజిస్లేషన్ సబార్డినేట్ కమిటీ చైర్మన్‌గా దిలీప్‌కుమార్ మన్సుఖ్‌లాల్ గాంధీలు నియమితులైనట్లు బుధవారం లోక్‌సభ ఓ బులెటిన్‌లో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment