
పెద్దాయన ఆశీర్వాదం తీసుకున్న కోవింద్
న్యూఢిల్లీ: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ ఢిల్లీలో పలువురు నేతలను కలిసేపనిలో బిజీగా గడుపుతున్నారు.
బుధవారం మధ్యాహ్నమే బీజేపీ కురువృద్ధుడు మురళీ మనోహనర్ జోషిని కలుసుకున్న కోవింద్.. సాయంత్రానికి పార్టీ పెద్దదిక్కైన ఎల్‌కే అద్వానీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఢిల్లీలోని అద్వానీ నివాసానికి వెళ్లిన కోవింద్ దాదాపు అరగంటపాటు అక్కడే గడిపారు. ఈ సందర్భంగా తన ఆశీర్వాదాలు తోడుంటాయని అద్వానీ కోవింద్‌కు భరోసా ఇచ్చినట్లు సమాచారం.
సోనియా చెంతకు మీరా: మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ బుధవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. కోవింద్‌కు పోటీగా బలమైన దళిత అభ్యర్థిని నిలపాలని భావిస్తున్నవేళ సోనియా-మీరాల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా మీరా కుమార్ లేదా సుశీల్ కుమార్ షిండే పేరును ప్రకటిస్తారని ఢిల్లీలో జోరుగా ప్రచారం సాగుతోంది.