
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి(93) మృతి పట్ల పార్టీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వాని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఐ మిస్ యూ అటల్ జీ అంటూ తన బాధను వ్యక్తం చేశారు.
‘వాజ్‌పేయి మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. తీవ్రం దుఃఖంతో నేనున్నాను. నోట మాట రావడం లేదు. 65 ఏళ్ల స్నేహం మాది. ఆరెస్సెస్‌లో ప్రచారకర్తలుగా ప్రారంభమైన మా అనుబంధం భారీతీయ జన్ సంఘ్‌లోనూ కొనసాగింది. జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ వరకు కలిసే ప్రయాణించాం. ఎమర్జెన్సీ చీకటి రోజులను కలిసే ఎదుర్కొన్నాం. అపారమైన దేశ భక్తి, అన్నింటికి మించి మానవతా విలువలు ఉన్న గొప్ప వ్యక్తి. సైద్ధాంతిక విభేదాలున్నా ప్రతి ఒక్కరిని హృదయాన్ని గెలిచిన వ్యక్తిత్వం వాజ్‌పేయికి సొంతం’ అంటూ అటల్ జీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment