ఆ చిత్రానికి అద్వానీ ఫిదా | Advani impress with Secret Superstar movie | Sakshi
Sakshi News home page

అమీర్‌ చిత్రానికి అద్వానీ ప్రశంస

Published Sat, Oct 14 2017 1:39 PM | Last Updated on Sat, Oct 14 2017 4:35 PM

Advani impress with Secret Superstar movie

సాక్షి, న్యూఢిల్లీ : మిస్టర్‌ ఫర్‌ఫెక్షనిస్ట్‌ అమీర్‌ ఖాన్‌కు ఊహించని ప్రశంస దక్కింది. ఆయన కొత్త చిత్రం సీక్రెట్ సూపర్ స్టార్ అద్భుతమని రాజకీయ దిగ్గజం ఎల్‌కే అద్వానీ కితాబిచ్చారు. ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమౌతున్న నేపథ్యంలో పలు నగరాల్లో ప్రముఖుల కోసం అమీర్‌ ప్రత్యేక ప్రదర‍్శనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనకు అద్వానీ, ఆయన కూతురు, పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. చిత్రం పూర్తయిన థియేటర్‌ చప్పట్లతో మారుమోగిపోగా.. తర్వాత చాలా సేపు అద్వానీ అమీర్‌తో చర్చించటం మీడియా కంటపడింది. దీనిపై అమీర్‌ స్పందిస్తూ... సినిమా అద్భుతంగా తెరకెక్కించారని అద్వానీ ప్రశంసించినట్లు చెప్పారు. కాగా, దంగల్‌ ఫేమ్‌ జైరా వసీమ్‌ ప్రధాన పాత్రలో అద్వైత్‌ చావ్లా దర్శకత్వంలో సీక్రెట్ సూపర్‌ స్టార్ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి నిర్మాతగానే కాదు.. ఓ కీలకపాత్రలో అమీర్‌ నటిస్తుండటం విశేషం. 

ఓ ముస్లిం అమ్మాయి తన ఉనికి బయటపడకుండా.. తనలోని టాలెంట్‌ను ప్రదర్శించటమే ఈ చిత్ర నేపథ్యంగా తెలుస్తోంది. అక్టోబర్‌ 19న సీక్రెట్‌ సూపర్‌ స్టార్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement