ఈ వారం యూట్యూబ్ హిట్స్‌ | this week youtube hitz | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

Published Sun, Jan 22 2017 11:46 PM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

సీక్రెట్‌ సూపర్‌స్టార్‌: టీజర్‌
నిడివి : 1 ని. 26 సె. ; హిట్స్‌ :  85,48,767


‘‘ఇన్సూ... రాత్రి మూడవుతోంది. కలలు కనడం మాని, నిద్రపో.’’
‘‘అదేంటి మమ్మీ.  నిద్రపొమ్మని చెప్తావ్‌. కలలు కనొద్దని చెప్తావ్‌. పడుకున్నప్పుడు కలలు రావా ఏంటీ? కలలు కనడం కనీస హక్కు కదా. ప్రతి ఒక్కరినీ కలలు కననివ్వాలి’’.

‘‘చెప్పు. నీకేం కావాలి? నీ కలేంటి?’’
‘‘ఈ ప్రపంచం మొత్తం నా పాట వినాలి’’.
‘‘అది నా కల మాత్రం కాదనా? కానీ నాన్నకు ఇష్టం లేదు’’

నాన్న ఇన్సూ గిటార్‌ తీగలు తెంపేస్తాడు. తీగలు తెగిన గిటార్‌ను ఇన్సూ చేతిలో పెడతాడు. స్కూల్‌ నుంచి వచ్చిన ఇన్సూ బాధగా ఆ గిటార్‌ను అందుకుంటుంది. కొంతకాలం గడుస్తుంది. సడెన్‌గా సోషల్‌ మీడియాలో ఓ వీడియో రిలీజ్‌ అవుతుంది. అందులో.. ముఖం కనిపించకుండా ముసుగు వేసుకున్న ఓ అమ్మాయి చేతిలో గిటార్‌ పట్టుకుని మాట్లాడ్డం మొదలుపెడుతుంది. ‘వీడియో చూస్తున్నవారందరికీ ధన్యవాదాలు. ఇది నా మొదటి యూట్యూబ్‌ వీడియో.

నా పేరు.. అని ఆగుతుంది. ‘ఊహు’ నా పేరు చెప్పుకోను అంటుంది. పాట పాడుతుంది. ‘నేను అభయారణ్యంలో ప్రాణిలా స్వేచ్ఛగా ఆలపిస్తాను. మనసంతా సంతోషంగా..’ అంటూ పాడుతుంది. ఆమె పాటను ఎక్కడో ఉన్న ఆమిర్‌ఖాన్‌ కూడా వింటాడు. సూపర్‌హిట్‌.. సూపర్‌ హిట్‌ అంటాడు. నచ్చితే లైక్‌ కొట్టండి అంటాడు. నచ్చకపోతే మీ టేస్ట్‌ చేంజ్‌ చేసుకోండి అంటాడు. ఐ లవిట్‌ అంటాడు. ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ మూవీ టీజర్‌ ఇది. సినిమా ఆగస్టు 4న విడుదలవుతోంది. దంగల్‌ ఫేమ్‌ జైరా వసీమ్‌ ఇందులో ఇన్సూగా నటించింది. ఆమె కలలను అర్థం చేసుకున్న క్యారెక్టర్‌ ఆమిర్‌ఖాన్‌ది. వీడియో ఇన్‌స్పైరింగ్‌గా ఉంది.

లిటిల్‌ మిక్స్‌: టచ్‌ (అఫీషియల్‌ వీడియో)
నిడివి : 3 ని. 37 సె. ; హిట్స్‌ : 84,58,749

బ్రిటిష్‌ గర్ల్‌ గ్రూప్‌ ‘లిటిల్‌ మిక్స్‌’ పెర్ఫామ్‌ చేసిన ఈ ‘టచ్‌’ వీడియో సాంగ్‌.. పాప్‌ అభిమానుల కళ్లను తమ వెంట పరుగులు తీయించుకుంటోంది! సాఫ్ట్‌ సాంగ్‌.. విత్‌ స్ట్రాంగ్‌ ఎమోషన్స్‌. జేడ్, పియరీ, యాన్, జెస్సీ అనే ఈ నలుగురు అమ్మాయిలు తమ స్టూడియో ఆల్బమ్‌ ‘గ్లోరీ డేస్‌’ నుంచి ఈ సెకండ్‌ సింగిల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. యు.కె., ఐర్లండ్, స్కాట్లాండ్‌ల పాప్‌ చార్ట్‌లలో ప్రస్తుతం ఈ పాట టాప్‌ 10లో ఉంది. ప్రేమ కోసం పరితపించే స్త్రీ హృదయం.. ‘జస్ట్‌ ఎ టచ్‌ ఆఫ్‌ యువర్‌ లవ్‌ ఈజ్‌ ఎనఫ్‌’ అంటూ రిపీటెడ్‌గా పాడుతూ ఉండడం ఇందులోని భావ సౌందర్యం. ‘నువ్వూ నేను.. నో బడీ ఎల్స్‌’ అంటూ మొదలై.. ‘టు టేక్‌ కంట్రోల్‌ ఆఫ్‌ మై హోల్‌ బాడీ... జస్ట్‌ ఎ టచ్‌ ఆఫ్‌ లవ్‌ ఈజ్‌ ఎనఫ్‌..’ అని పాట ఎండ్‌ అవుతుంది.

సావరే: ప్రైవేట్‌ మెలడీ
నిడివి : 5 ని. 48 సె. ; హిట్స్‌ : 13,71,949

టైమ్స్‌ మ్యూజిక్‌ రొమాంటిక్‌ సింగిల్‌ ‘సావరే’. బాలీవుడ్‌ నటుడు కుణాల్‌ ఖేము, మిస్‌ ఇండియా గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌ 2015 విర్టికా సింగ్‌ నటించారు. లక్నోలోని అత్యద్భుతమైన లొకేషన్‌లలో ఈ మెలోడీ సాంగ్‌ని షూట్‌ చేశారు. అనుపమ రాగ్, రహత్‌ ఫతే అలీఖాన్‌ పాడారు. అలీఖాన్‌ గొంతులోని మార్ధ్రవం.. మైండ్‌కి రిఫ్రెష్‌ కొట్టేలా ఉంది. లిరిక్స్, కంపోజిషన్‌ అనుపమ రాగ్‌.  ‘నా హృదయంతో, నా ఆత్మతో నిన్ను ప్రేమించాను.. నా ప్రియతమా.. మనసులు ఎదురెదురుగా ఉన్నప్పటికీ మన మధ్య దూరాలు ఉన్నాయి. నిన్నెక్కడ వెతుక్కోను.. నా కళ్లు నీ సాక్షాత్కారం కోసం అన్వేషిస్తున్నాయి’ అనే అర్థంలో సాగే ఈ పాట ఒక సిపాయికి, అతడి ప్రియురాలికి మధ్య ఉన్న ప్రేమగురించి తెలుపుతుంది.  ‘సావరే’ అంటే.. త్వరగా అని అర్థం. దూరతీరాలలో ఉన్న రెండు హృదయాలు త్వరగా కలుసుకోవడం కోసం çపడే పరితపనకు అందమైన దృశ్యరూపం ఈ వీడియో సాంగ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement