జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వాణీ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సాహసోపేత నిర్ణయంగా వర్ణించారు. ఈ సందర్భంగా అద్వాణీ మాట్లాడుతూ.. ‘జాతీయ సమగ్రత బలోపేతం దిశగా ఇదో గొప్ప ముందడుగు. ఆర్టికల్ 370 రద్దు బీజేపీ ప్రధాన భావజాలాల్లో ఒకటి. జనసంఘ్ రోజుల నుంచే ఈ ప్రతిపాదన ఉంద’ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.