న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రోజు ఉదయం కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ మేరకు ప్రధానిమోదీ ట్వీట్ చేశారు.‘ఈ రోజు ఎయిమ్స్‌లో కోవిడ్ టీకా రెండవ డోసు తీసుకున్నాను.. వైరస్‌ను ఓడించడానికి మనకు ఉన్న మార్గాలలో వ్యాక్సిన్ ఒకటి. టీకా తీసుకునేందుకు మీరు అర్హులు అయితే వెంటనే వ్యాక్సిన్ వేయించుకోండి.. ఇందుకు కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ CoWin.gov.in చేయించుకోండి’. అని మోదీ పిలుపునిచ్చారు.
కాగా మార్చి 1న ప్రధాని నరేంద్ర మోదీ కరోనా తొలి డోస్ తీసుకున్న విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం మొదటి డోస్ తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ వ్యవధిని 6-8 వారాలకు కేంద్రం పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తాజాగా రెండో డోస్ తీసుకున్నారు. తొలి డోస్ వేయించుకున్నప్పటిలా కాకుండా ఈసారి ప్రధాని ముఖానికి మాస్క్ ధరించి వ్యాక్సిన్ తీసుకున్నారు. మరోవైపు బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే ఆద్వాని సైతం కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు.
చదవండి: పరీక్షలు ఒక్కటే జీవితం కాదు: మోదీ
Got my second dose of the COVID-19 vaccine at AIIMS today.
— Narendra Modi (@narendramodi) April 8, 2021
Vaccination is among the few ways we have, to defeat the virus.
If you are eligible for the vaccine, get your shot soon. Register on https://t.co/hXdLpmaYSP. pic.twitter.com/XZzv6ULdan
భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. వ్యాక్సినేషన్ పరంగా భారత్ ప్రపంచంలోనే ముందు వరుసలోదూసుకుపోతోంది. ముందుగా వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అందించగా.. తర్వాత 60 ఏళ్లు దాటినవారు, 45 ఏళ్లు దాటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నవారికి వ్యాక్సినేషన్ అందజేశారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన అందరికీ టీకా పంపిణీ ప్రారంభించారు. ఇక ఇప్పటి వరకు దేశంలో 8 కోట్ల మందికి టీకాను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment