
న్యూఢిల్లీ: సుష్మా స్వరాజ్ మరణం తనని తీవ్రంగా కలచివేసిందన్నారు బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వాణీ. బుధవారం ఉదయం ఆమె మృతదేహానికి నివాళులర్పిస్తూ.. అద్వాణీ కన్నీరు పెట్టుకున్నారు. ‘సుష్మ చాలా చిన్న వయసులోనే పార్టీలో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ... శక్తివంతమైన రాజకీయ వేత్తగా ఎదిగారు. నేటి తరం మహిళా నాయకులకు ఆదర్శంగా నిలిచారు. సుష్మ గొప్ప వక్త. ఆమె జ్ఞాపకశక్తిని చూసి చాలాసార్లు నేను ఆశ్చర్యపోయేవాడిని. సుష్మ ప్రతిసంవత్సరం నా పుట్టిన రోజు నాడు నాకిష్టమైన చాకొలెట్ కేక్ తీసుకొచ్చేవారు. ఒక్క సారి కూడా కేక్ తేవడం మర్చిపోలేదు’ అంటూ సుష్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు అద్వాణీ. అంతేకాక సుష్మ చాలా మంచి వ్యక్తి అన్నారు. ఆమె తన మంచితనంతో అందరిని ఆకట్టుకున్నారు. ఆమె మరణం బీజేపీకి తీరని లోటు అంటూ అద్వాణీ కన్నీటి పర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment