‘అద్వానీ, మోదీని చూస్తే.. ఆ రెండు సంఘటనలు గుర్తుకొస్తాయి’ | Jairam Ramesh When I look At Advani PM Modi I Recall Two Incidents | Sakshi
Sakshi News home page

‘అద్వానీ, మోదీని చూస్తే.. ఆ రెండు సంఘటనలు గుర్తుకొస్తాయి’

Published Sat, Feb 3 2024 9:58 PM | Last Updated on Sat, Feb 3 2024 10:05 PM

Jairam Ramesh When I look At Advani PM Modi I Recall Two Incidents - Sakshi

రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నతో సత్కరించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ శనివారం ‘ఎక్స్‌ (ట్విటర్‌)’ వేదికగా వెల్లడించారు. అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని దేశాభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమని కొనియాడారు. 

అయితే  ఎల్‌కే  అద్వానీకి  భారత రత్న ప్రకటించడంపై కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ  జైరాం రమేష్‌  స్పందించారు. బీజేపీ అగ్రనేత ఎల్‌.కే అద్వానీకి భారతరత్న ప్రకటించిన సందర్భంగా.. అద్వానీ, ప్రధాని మోదీకి సంబంధించి తనకు రెండు సంఘటనలు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. 

అందులో మొదటి సంఘటన.. 2002లో ప్రస్తుత ప్రధాని మోదీ గుజరాత్‌కు సీఎం ఉన్న సమయంలో.. మోదీని అద్వానీ కాపాడారని తెలిపారు. ఆనాటి ప్రధానమంత్రి దివంగత అటల్ బిహారీ వాజపేయి.. గుజరాత్‌ సీఎంగా ఉన్న మోదీని ఆ పదని నుంచి తొలగించి రాజధర్మను గుర్తుచేయాలనుకున్నారని తెలిపారు.కానీ, ఆ సమంయలో మోదీని సీఎం పదవి నుంచి తొలగించబడకుండా అద్వానీ రక్షించారని అన్నారు. 

రెండో  సంఘటన.. 5 ఏప్రిల్‌, 2014 నాటి సమయంలో నరేంద్ర మోదీ.. గుజరాత్‌లోని గాంధీ లోక్‌సభ నియోజకవర్గంలో నామినేషన్‌ వేశారు. అప్పడు అద్వానీ.. నరేంద్రమోదీపై అసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేంద్రమోదీ తన శిష్యుడు కాదని.. మంచి ఈవెంట్‌ మేనేజర్‌ అని​ అన్నారని తెలిపారు. ఈ మాటలు తాను అంటున్నని కాదని.. స్వయంగా అద్వానీ అన్న మాటలేనని  తెలిపారు. వారిద్దరినీ (అద్వానీ, మోదీ) చూసినప్పుడు ఈ సందర్భాలు గుర్తుకువస్తాయని జైరాం రమేష్‌ అన్నారు. ఇక.. 2002లో మోదీని రక్షించిన అద్వానీ.. 2014లో మాత్రం మోదీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేశారని అ‍న్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement