
తుమకూరు: బీజేపీ దిగ్గజ నేత ఎల్‌కే అడ్వాణీ చనిపోయారంటూ కేంద్రమంత్రి వి.సోమణ్ణ ఏకంగా ఆయనకు శ్రద్ధాంజలే ఘటించారు! కర్ణాటకలోని తుమకూరులో శనివారం ఈ ఘటన జరిగింది. అడ్వాణీ అనారోగ్యంతో రెండుసార్లు ఆస్పత్రిలో చేరి చికిత్స అనంతరం కోలుకోవడం తెలిసిందే.
మంత్రి మాత్రం బీజేపీ, జేడీ(ఎస్) కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, ‘‘నాకిప్పుడే సమాచారం అందింది. అడ్వాణీ మరణించారు’’ అంటూ శ్రద్ధాంజలి ఘటించారు. అడ్వాణీ క్షేమంగా ఉన్నారని తేలడంతో సభికులంతా కంగుతిన్నారు.
Comments
Please login to add a commentAdd a comment