still alive
-
అడ్వాణీకి పొరపాటున మంత్రి శ్రద్ధాంజలి!
తుమకూరు: బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అడ్వాణీ చనిపోయారంటూ కేంద్రమంత్రి వి.సోమణ్ణ ఏకంగా ఆయనకు శ్రద్ధాంజలే ఘటించారు! కర్ణాటకలోని తుమకూరులో శనివారం ఈ ఘటన జరిగింది. అడ్వాణీ అనారోగ్యంతో రెండుసార్లు ఆస్పత్రిలో చేరి చికిత్స అనంతరం కోలుకోవడం తెలిసిందే. మంత్రి మాత్రం బీజేపీ, జేడీ(ఎస్) కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, ‘‘నాకిప్పుడే సమాచారం అందింది. అడ్వాణీ మరణించారు’’ అంటూ శ్రద్ధాంజలి ఘటించారు. అడ్వాణీ క్షేమంగా ఉన్నారని తేలడంతో సభికులంతా కంగుతిన్నారు. -
‘ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ బతికే ఉన్నాడు’
తమిళుల ఆరాధ్యదైవం, ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నాడా?.. తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నేత చేసిన ప్రకటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. సోమవారం తంజావూరులో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత కింది సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ జాతీయవాది, కాంగ్రెస్ మాజీ నేత అయితే పళ నెడుమారన్ తాజాగా.. ఎల్టీటీఈ ప్రభాకరన్ బతికే ఉన్నాడంటూ ప్రకటించారు. తమిళ ప్రజల కోసం లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఇలం(ఎల్టీటీఈ) నేత త్వరలోనే వస్తాడంటూ ఉలగ తమిళర్ పెరమైప్పూ నేత తమిళ నెడుమారన్ ప్రకటించడం గమనార్హం. ప్రపంచంలో ఉన్న తమిళులందరికీ శుభవార్త. ఆయన బతికే ఉన్నారు. ప్రస్తుతం శ్రీలంకలో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితి నేపథ్యంలో .. తమిళ దేశీయ తలైవర్(తమిళ జాతీయ వాద నేత) ప్రభాకరన్ బయటకు రావాల్సిన అవసరం వచ్చిందని, తాను జీవించి లేనన్న పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందంటూ నెడుమారన్ వ్యాఖ్యానించారు. తమిళుల అభ్యున్నతి కోసం ప్రభాకరన్ ఇప్పుడు పోరాడాల్సిన సమయం వచ్చిందని, ఆయనకు తమిళనాడులోని రాజకీయపార్టీలు.. ప్రపంచంలోని ప్రజలు సంపూర్ణ మద్ధతు ప్రకటించాలని వ్యాఖ్యానించారాయన. అయితే.. అయితే ప్రభాకర్ బతికే ఉన్నాడనేందుకు ఆధారాలు ఉన్నాయా? అనే ప్రశ్నకు మాత్రం ఆయన దాటవేత ప్రదర్శించారు. అయితే.. తాము ఇప్పటికీ టచ్‌లో ఉన్నామని, ఈ సమయంలో అంతకు మించి ఇంకేం చెప్పలేమంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తమిళ మైనార్టీల కోసం వేర్పాటువాద ఉద్యమం ప్రారంభించిన ప్రభాకరన్.. 2009 మే 18వ తేదీన ముల్లైవైతూ జిల్లా ముల్లైవైక్కల్ వద్ద శ్రీలంక బలగాల చేతుల్లో మరణించినట్లు ప్రకటన వెలువడింది. ప్రభాకరన్ చనిపోయాడంటూ సాక్ష్యంగా ఒక వీడియో, కొన్ని ఫొటోలను సైతం రిలీజ్ చేసింది. -
చనిపోలేదు! బిగ్గెస్ట్ ఫ్యామిలీమ్యాన్ బతికే ఉన్నారు!
ఐజ్వాల్: ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి అధిపతిగా రికార్డులకెక్కిన జియాన్‌ఘాకా మరణించి 36 గంటలు దాటుతున్నా, ఆయన కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు చేసేందుకు నిరాకరిస్తున్నారు. ఆయన ఇంకా జీవించేఉన్నారని వారు చెబుతున్నారు. 39 మంది భార్యలు, 90 మందికి పైగా సంతానం, 33 మంది మనవళ్లు, మనవరాళ్లున్న 76 ఏళ్ల జియాన్ స్థానిక లాల్పా కోహ్రాన్ ధర్ తెగకు అధిపతి. బీపీ, సుగర్‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం మరణించినట్లు స్థానిక ట్రినిటీ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. అయితే ఆయన కుటుంబసభ్యులు మాత్రం ఆయన శరీరం ఇంకా వెచ్చగానే ఉందని, నాడి కొట్టుకుంటూనే ఉందని చెబుతున్నారు. ఆస్పత్రి నుంచి ఇంటికి తెచ్చాక ఆయన నాడి తిరిగి కొట్టుకోవడం ఆరంభించిందని తెగ కార్యదర్శి జతిన్ ఖుమా చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులే కాకుండా స్థానికులు సైతం ఈ పరిస్థితుల్లో ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు సిద్ధంగా లేరన్నారు. ఆయన పూర్తిగా మరణించారని తెగ పెద్దలు భావించేవరకు జియాన్‌ను పూడ్చిపెట్టేదిలేదన్నారు. 70 ఏళ్ల క్రితం ఈ తెగను జియాన్ పూర్వీకులు స్థాపించారు. వీరంతా కుటుంబపోషణకు వడ్రంగి పని చేస్తుంటారు. ప్రస్తుతం దాదాపు 433 కుటుంబాలకు చెందిన 2500 మందికి పైగా తెగలో ఉన్నారు. చదవండి: 38 భార్యల ముద్దుల భర్త ఇక లేరు -
అతను బతికే ఉన్నాడు
బెంగళూరు: కర్ణాటకలో సీఎం సిద్దరామయ్య హయాంలో ‘జిహాదీ’ల చేతిలో మరణించారని పేర్కొంటూ హిందూత్వ వాదుల పేరుతో కర్ణాటక బీజేపీ కార్యదర్శి శోభా కరంద్లాజే ఇటీవల ఒక జాబితా విడుదల చేశారు. 23 మందితో కూడిన ఆ జాబితాలోని ఉన్న మొదటి వ్యక్తి బతికే ఉన్న విషయం బయటపడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2015 సెప్టెంబర్ 20న అశోక్ పూజారి ‘జిహాదీ’ల చేతిలో మరణించినట్లు కరంద్లాజే పేర్కొనగా.. అతను ఉడుపి సమీపంలోని మూదాబిద్రిలో బతికే ఉన్నట్లు ఓ మీడియా సంస్థ పరిశోధనలో తేలింది. అయితే తనపై దాడి నిజమేనని, చనిపోలేదని అశోక్ పూజారి వెల్లడించాడు.