
అహ్మదాబాద్: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ మరోసారి చాలా మందికి స్పూర్తి కలిగించేలా వ్యవహరించారు. తనకు ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ అద్వానీ తన హక్కును మరిచిపోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. జ్వరంతో బాధపడుతున్నప్పటికీ.. ఆ బాధను లెక్కచేయకుండా మంగళవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అద్వానీ ప్రస్తుతం 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో బీజేపీ అద్వానీని విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరింది. కానీ ఆ మాటలు పక్కనబెట్టిన అద్వానీ అహ్మదాబాద్‌లోని షాపూర్ హిందీ స్కూల్‌లోని పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేశారు. తాను 1952 నుంచి ఎప్పుడు కూడా ఓటు హక్కు వినియోగించకుండా ఉండలేదని అద్వానీ పేర్కొన్నారు. ప్రస్తుతం అద్వానీ గాంధీనగర్ ఎంపీగా ఉన్నారు. అయితే ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆ స్థానం నుంచి బరిలో నిలిచారు. కాగా, ఈ సారి ఎన్నికల్లో అద్వానీ పోటీ చేయడం లేదనే సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment