మందిర్‌-మసీదు.. ముఖ్య ఘట్టాలు | Ram Janmabhoomi-Babri Masjid issue | Sakshi
Sakshi News home page

మందిర్‌-మసీదు.. ముఖ్య ఘట్టాలు

Published Tue, Dec 5 2017 7:07 PM | Last Updated on Sat, Apr 6 2019 9:31 PM

Ram Janmabhoomi-Babri Masjid issue - Sakshi

రామజన్మ భూమి, బాబ్రీ మసీదుపై మంగళవారం తుది విచారణ జరగాల్సి ఉండగా.. గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 8కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో రామజన్మ భూమి, బాబ్రీ మసీదుకు సంబంధించిన వివాదాలు.. ముఖ్యఘట్టాలకు సం‍బంధించిన వివరాలివి.

రామజన్మభూమి, బాబ్రీ మసీదుకు సంబంధించి 2010లో అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మొత్తం వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభవించింది. ఒక భాగం నిర్మో‍హి అఖారాకు, మరొక బాగం రామజన్మభూమికి, మూడో భాగం మసీదుకు కోర్టుకు కేటాయించింది. ఈ తీర్పును ఉభయపక్షాలు సుప్రీంలో సవాల్‌ చేశాయి. ఈ నేపథ్యంలో మసీదు వివాదానికి సంబంధించిన చారిత్రక ఘట్టాలను పరిశీలిద్దాం.

బాబ్రీ మసీదు టైమ్‌లైన్‌

  •  1528లో మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ పేరు మీద మీర్‌ బాఖీ నిర్మించారు. 
  • 1853 : మసీదుకు సంబంధించి మొట్టమొదటి హింస జరిగిన సంవత్సరం. నిర్మోహి అఖారాకు చెందిన హిందువులు, అలాగే అవధ్‌ నవాబ్‌ అయిన వాజిద్‌ ఆలీ షా వర్గాలకు మధ్య ఘర్షణ జరిగినట్లు ఆధారాలున్నాయి. రామాలయాన్ని కూల్చి మసీదు కట్టారని హిందువులు తొలిసారి ఆరోపించారు.
  • 1885 : బాబ్రీ మసీదుపై మొదటిసారిగా మహంత్‌ రఘుబర్‌దాస్‌ ఫైజాబాద్‌ జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశారు. మసీదు స్థలం రామాలయయని ఆయన కోర్టుకు తెలిపారు.
  • 1889 : హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణ చెలరేగడంతో అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం మసీదు చుట్టూ కంచె ఏర్పాటు చేసింది. బ్రిటీష్‌ ప్రభుత్వం ముస్లింలకు లోపలి భాగం, హిందువులకు బయటి భాగాన్నిఅప్పగించింది.
  • 1949 : బాబ్రీ మసీదులోకి ప్రవేశించిన కొందరు హిందువులు.. అక్కడ రాముడు, సీతమ్మ, లక్ష్మణుడి విగ్రహాలను ప్రతిష్టించారు.
  • 1950 : బాబ్రీ మసీదులోని ఖాళీ ప్రాంతంలో ప్రార్థనలను చేసుకునేందుకు అనుమతించాలంటూ.. మహంత్‌ పరమహంస రామచంద్ర దాస్‌ ఫైజాబాద్‌ కోర్టును ఆశ్రయించారు. ఖాళీ భాగంలో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించన కోర్టు.. లోపలి భాగంలోకి వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించింది.
  • 1959 : మొత్తం స్థలాన్ని తమకు అప్పగించాలంటూ నిర్మోహి అఖారా మూడోసాకి కోర్టును అశ్రయించింది.
  • 1961 : మసీదు ఖాళీప్రాంతాన్ని స్మశానంగా మార్చుకునేందుకు అనుమతి కోరుతూ..  సున్నీ సెంట్రల్‌ బోర్డు, షియా వక్ఫ్‌ బోర్డులు కోర్టుకెక్కాయి.
  • 1984 : రామజన్మ భూమిలో రామాలయాన్నినిర్మించడమే లక్ష్యమంటూ బీజేపీ అగ్రనేత లాల్‌ కృష్ణ అద్వానీ ప్రకటన. రామాలయం నిర్మాణం కోసం ఉద్యమం మొదలు పెట్టిన అద్వానీ.
  • 1986 : బాబ్రీ మసీదులో హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చంటూ జి‍ల్లా కోర్టు తీర్పు. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ముస్లింలు.. బాబ్రీ మసీద్‌ యాక్షన్‌ కమిటీ ఏర్పాటు.
  • 1989 :  విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో మసీదులోని ఖాళీ స్థలంలో రామాలయం నిర్మాణానికి శిలాన్యాస్‌. అంతేకాక మసీదును మరో ప్రాంతానికి తరలించాలంటూ.. కోర్టులో కేసును దాఖలు చేసిన వీహెచ్‌పీ
  • 1990 : చంద్రశేఖర్‌ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కొందరు కర సేవకులు బాబ్రీ మసీదును పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ సమయంలో ప్రధాని చంద్రశేఖర్‌.. ఇరు వర్గాల మధ్య చర్చలతో సమస్యను పరిష్కారం కోసం ప్రయత్నాలు చేశారు. చర్చలు జరుగుతున్న సమయంలోనే బీజేపీ సీనియర్‌ నేత అద్వానీ రామాలయం కోసం దేశవ్యాప్తంగా రథయాత్ర మొదలు పెట్టారు.
  • 1991 : అప్పటివరకూ ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అద్వానీ రథయాత్రతో మొదటిసారి ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది. దీంతో అయోధ్యలో కరసేవకుల ఉద్యమం మరింత ఉధృతమైంది.
  • 1992 : డిసెంబర్‌ 6న శివసేన, వీహెచ్‌పీ, బీజేపీ కార్యకర్తలు భారీగా వివాదాస్పద ప్రాంతానికి చేరుకుని.. మసీదును కూల్చారు. ఈ సమయంలో జరిగిన అల్లర్లలో 2 వేలమందిపైగా మరణించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు జస్టిస్‌ లిబర్హాన్‌ కమిషన్‌ను నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వం ఏర్పాటు చేసిం‍ది.
  • 2002 : గుజరాత్‌ నుంచి అయోధ్యకు రైలుతో తరలివెళుతున్న కరసేవకులపై గోధ్రా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల దాడి. 58 మంది కరసేవకుల మృతి. గోధ్రా ఘటన తరువాత చెలరేగిన అల్లర్లలో సుమారు 1000 మంది మరణించారు.
  • 2002 : బాబ్రీ మసీదు ప్రాంతంపై సర్వే చేయాలంటూ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించిన హైకోర్టు.
  • 2003: బాబ్రీ మసీదు ప్రాంతంలో సర్వే పనులు మొదలు పెట్టిన ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌. మసీదు కింది భాగంలో ఆలయం ఉన్నట్లు తేల్చిన ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌.
  • 2009 : బాబ్రీ మసీదు విధ్వంసానికి సంబంధించి ఏర్పాటు చేసిన లిబర్హాన్‌ కమిషన్‌ నివేదిక కేంద్రానికి సమర్పించింది. ఇందులో బీజేపీ అగ్రనేత అద్వానీ సహా మరో 68 మందిని దోషులుగా తేల్చింది.
  • 2010 : బాబ్రీ మసీదు వివాదంపై అలహాబాద్‌ హైకోర్టు మొదటిసారి తీర్పును వెలవరించింది. మొత్తం వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభజించి.. నిర్మోహి అఖారాకు, రామజన్మభూమికి, మసీదుకు కేటాయిస్తూ తీర్పును ప్రకటించింది. ఈ తీర్పును ఇరు వర్గాలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి.
  • 2011 : అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీం‍కోర్టు స్టే. యథాతథ స్థితిని కొనసాగించాలన్న సుప్రీం.
  • 2014 : నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ఎన్నికల్లో ఘనవిజయం.
  • 2015 : అయోధ్యలో రామమందిర నిర్మాణం లక్ష్యంగా వీహెచ్‌పీ దేశవ్యాప్తంగా రాళ్ల సేకరణ. సరిగ్గా రెండు నెలల తరువాత రెండు ట్రక్కుల రాళ్లు వివాదాస్పద ప్రాంతానికి చేరుకున్నాయి. మోదీ ప్రభుత్వం అనుమతిస్తే రామాలయాన్ని నిర్మిస్తామంటూ.. మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌  ప్రకటన.
  • 2017 : అమోధ్య ధ్వంసానికి సంబంధించి అద్వానీపై తిరిగి కేసును రీ ఓపెన్‌ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు.
  • 2017 : ఉత్తర్‌ప్రదేశ్‌లో సుదీర్ఘ కాలం తరువాత అధికారంలోకి వచ్చిన బీజేపీ
  • 2017 మార్చి 21 : బాబ్రీ మసీదు విషయం చాలా సున్నితమైనది. దీనిని కోర్టు బయటే తేల్చుకోవాలన్న సుప్రీంకోర్టు.
  • 2017 డిసెంబర్‌ 5 : అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేసిన వర్గాల వాదనలు వినేందుకు సిద్ధపడ్డ సుప్రీం కోర్టు. గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో బాబ్రీ మసీదు విచారణను.. వచ్చే ఏడాది 8కి వాయిదా వేసిన కోర్టు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement