న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విధి నరేంద్ర మోదీని ఎంచుకుందని బీజేపీ కురువృద్ధ నేత ఎల్‌కే అద్వానీ (96) పేర్కొన్నారు. ‘రాష్ట్ర ధర్మ’ ప్రత్యేక మ్యాగజీన్‌కు రాసిన వ్యాసంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం 33 ఏళ్ల క్రితం తాను చేపట్టిన రథయాత్రను ప్రస్తావించారు. ఆలయ ప్రారంభ సమయానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి లేకపోవడం వేదన కలిగిస్తోందన్నారు.
‘‘నాటి రథయాత్ర ఆసాంతం ప్రధాని మోదీ నాతోపాటే ఉన్నారు. అప్పట్లో ఆయన గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. కానీ ఆ శ్రీరాముడే ఆలయ పునర్నిర్మాణం కోసం ఆయన్ను ఎంచుకున్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన ద్వారా ప్రతి పౌరుడికి మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు’’ అన్నారు. రామాలయ కలను సాకారం చేసి తన లక్ష్యాన్ని నెరవేర్చుతున్నందుకు మోదీకి ధన్యవాదాలన్నారు.
చదవండి: స్వామి వివేకానంద బాటలో నడవాలి
Comments
Please login to add a commentAdd a comment