‘ఇదో సాహసోపేత నిర్ణయం’ | LK Advani On Centre Scrapping Article 370 Bold Step | Sakshi
Sakshi News home page

మోదీ, అమిత్‌ షాలను అభినందించిన అద్వాణీ

Published Mon, Aug 5 2019 4:37 PM | Last Updated on Mon, Aug 5 2019 6:40 PM

LK Advani On Centre Scrapping Article 370 Bold Step - Sakshi

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంపై బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వాణీ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడాన్ని సాహసోపేత నిర్ణయంగా వర్ణించారు. ఈ సందర్భంగా అద్వాణీ మాట్లాడుతూ.. ‘జాతీయ సమగ్రత బలోపేతం దిశగా ఇదో గొప్ప ముందడుగు. ఆర్టికల్‌ 370 రద్దు బీజేపీ ప్రధాన భావజాలాల్లో ఒకటి. జనసంఘ్‌ రోజుల నుంచే ఈ ప్రతిపాదన ఉంద’ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ఆయన అద్వాణీ అభినందనలు తెలిపారు. జమ్ముకశ్మీర్‌, లడఖ్‌లో శాంతి, సుఖ సంతోషాల స్థాపనలో ఈ నిర్ణయం కీలకంగా మారనుందని అద్వాణీ వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement