సాక్షి, ముంబై: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు రావడంలో విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) నేత అశోక్ సింఘాల్, ఎల్‌కే అద్వానీ చేసిన కృషే కారణమని శివసేన చీఫ్ ఉద్దవ్‌ఠాక్రే అన్నారు. నాడు వారు చేసిన పోరాటం, త్యాగం ఫలితంగానే నేడు అనుకూలంగా తీర్పు వచ్చిందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే తాను ఎల్‌కే అద్వానీతో సమావేశమవుతున్నట్లు ఠాక్రే తెలిపారు. అలాగే నెల 24న అయోధ్యలో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. కాగా అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పును కేంద్ర ప్రభుత్వం తన ఘనతగా చాటుకోలేదని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఇదివరకే పేర్కొన్న విషయం తెలిసిందే. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చట్టం చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరితే అందుకు నిరాకరించిందని, సుప్రీం తాజా తీర్పును ప్రభుత్వం ఇప్పుడు తమ ఘనతగా చెప్పుకోరాదని ఠాక్రే అన్నారు. ( చదవండి: ‘అద్వానీ, సింఘాల్ సాధించారు’).
Comments
Please login to add a commentAdd a comment