
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్‌కే అడ్వాణీ బుధవారం తన 90వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన 90 మంది అంధ చిన్నారులతో సరదాగా గడిపారు. ఆ తరువాత వారికి స్కూలు బ్యాగులు పంపిణీ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ స్వయంగా అడ్వాణీ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అడ్వాణీకి ఫోన్లో శుభాకాంక్షలు చెప్పారు. పలు రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు కూడా ఫోన్లో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.