
ఢిల్లీ: మాజీ ఉప ప్రధాని, సీనియర్ బీజేపీ నేత లాల్‌కృష్ణ అద్వానీ మరోసారి అనారోగ్యంతో మంగళవారం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. 96 ఏళ్ల అద్వానీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి డాక్టర్లు పేర్కొన్నట్లు పీటీఐ వార్త సంస్థ వెల్లడించింది.
జూలై 3న అద్వానీ ఆనారోగ్యం బారిన పడటంతో అయన్ను అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఒక రోజు చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. దీనికంటే వారం రోజల ముందు కూడా అద్వానీ వృద్దాప్యంతో కూడిన అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి ఒకరోజు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే.